ఒకానొక సందర్భంలో రాక్షసులు సముద్రపు నీటి గుండా పాతాళ లోకంలోకి ప్రవేశించి దాక్కొని ఉండగా వారిని సంహరించడానికి ఇంద్రుడు అగస్త్య మహర్షిని సముద్రపు నీరు అంతా తాగెయ్యమని ప్రార్ధిస్తాడు. అగస్త్యుడు తన యోగశక్తితో సముద్ర జలాలన్నింటినీ ఆపోసన పట్టి తాగేశారు. సముద్రం నీరు అంతా ఎండిపోగా ఇంద్రుడు ఆ దారి గుండా వెళ్ళి రాక్షసులను సంహరించాడు. రాక్షస సంహార అనంతరం ఇంద్రుడు అగస్త్య మహర్షిని తాగిన నీరు అంతా వదిలిపెట్టమని అడుగగా… అగస్త్యుడు “ఇది నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఇంద్రా నీరంతా జీర్ణమైనది, సరే మిగిలిన నీటిని వదిలేస్తాను” అని ఆయన మూత్ర ద్వారం గుండా తాగిన నీటినంతా వదిలేశారు కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
ఆధారం: బ్రహ్మ వైవశ్వత పురాణం
సేకరణ: https://www.panditforpooja.com/blog/why-is-sea-water-salty/