కృష్ణాష్టమి రోజున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఈ కింది విధంగా వివరించబడ్డాయి. కావునా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజుని ఈ విధంగా పూర్తి చేసినా విశేష ఫలితం కలుగును .
కృష్ణాష్టమి రోజు చేయవలసిన ముఖ్య పనులు:
- లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలకు
- శుభ్రపరచవలసినవి: పూజామందిరము, ఇల్లుశుభ్రం చేయాలి.
- చేయవలసిన అలంకారములు: గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
- చేయవలసిన స్నానము: తలస్నానము
- ధరించవలసిన పటుబట్టలు: పసుపు రంగువి
- పూజామందిరంలో చేయవలసినవి: పూజకు ఉపయోగపడు వస్తువులు, పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
- మందిరములో పరచవలసిన వస్త్రము: పసుపు రంగు
- కలశముపై వస్త్రము రంగు: పసుపు రంగు
- పూజించవలసిన ఫోటో: శ్రీకృష్ణుడు రాధతో
- పూజించవలసిన ప్రతిమ: శ్రీకృష్ణుడు
- పూజించవలసిన దైవము: శ్రీకృష్ణుడు
- తయారుచేయవలసిన అక్షతలు: పసుపు రంగు
- పూజకు కావలసిన పువ్వులు: కదంబ పుష్పములు
- అలంకరణకు వాడవలసిన పూలు: సన్నజాజులతో మాల
- నివేదన చేయవలసిన నైవేద్యం: పానకం
- సమర్పించవలసిన పిండివంటలు: వడపప్పు
- నిషేధించవలసిన పండ్లు: కమలా ఫలములు
- పారాయణ చేయవలసిన అష్టోత్తరం: శ్రీకృష్ణ అష్టోత్తరము
- పారాయణ చేయవలసిన స్తోత్రాలు: శ్రీకృష్ణాష్టకం
- పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు: బాలకృష్ణా స్తోత్రమ్
- పారాయణ చేయవలసిన సహస్రాలు: శ్రీకృష్ణ సహస్రనామము
- పారాయణ చేయవలసిన గ్రంథం: శ్రీమద్భాగవతము
- పారాయణ చేయవలసిన అధ్యాయములు: దశమ, ఏకాదశ స్కంధములు
- దర్శించవలసిన దేవాలయాలు: శ్రీకృష్ణదేవాలయము
- దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు: గౌడీయమఠములు
- చేయవలసిన ధ్యానములు: కృష్ణ ధ్యానశ్లోకములు
- చేయించవలసిన పూజలు: కృష్ణ అష్టోత్తర పూజ
- దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రములు: కృష్ణ సహస్రనామపూజ
- సేకరించివలసిన పుస్తకములు: భాగవతము
- సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుచూ అందజేయు పుస్తకములు: శ్రీకృష్ణ నిత్యపూజ
- స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: శ్రీకృష్ణ నిత్యపూజ
- దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు: శ్రీకృష్ణ లీలలు (నాటిక)
- దేవాలయమువారు నిర్వహించవలసిన ప్రత్యేక పూజలు: శ్రీకృష్ణ చరిత్ర (ఉపన్యాసములు)
- పర్వదిన తిథి: అష్టమి
- పర్వదినము యీవారము వస్తే చాలామంచిది: ఆదివారం
- పర్వదినము రోజున పూజ చేయవలసిన సమయము: మ|| 12గం||
- వెలిగించవలసిన దీపారాధన కుంది: కంచు దీపం
- వెలిగించవలసిన దీపారాధనలు: 2
- వెలిగించవలసిన వత్తుల సంఖ్య: 5
- వెలిగించవలసిన వత్తులు: దూదితో
- దీపారాధనకు వాడవలసిన నూనె: కొబ్బరినూనె
- వెలిగించవలసిన ఆవు నేతితో హారతి: పంచహారతి
- ధరించవలసిన తోరము: సింధూరము
- నుదుటన ధరించవలసినది: సింధూరము
- 108 మార్లు జపించవలసిన మంత్రం: ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
- జపమునకు వాడవలసిన మాల: తులసి మాల
- మెడలో ధరించవలసిన మాల: తులసి మాల
- మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: శ్రీకృష్ణ
- చేయవలసిన అభిషేకము: పంచామృతములతో
- ఏ దిక్కుకు తిరిగి పూజించాలి: తూర్పుదిక్కు