- సుమంగళి స్త్రీలు నుదుటిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు.
- జుట్టు విరబోసుకొని, రెండు చేతులతో తల గీరుకోరాదు.
- ఎప్పుడూ కంట నీరు పెట్టుకోరాదు. ఇది పుట్టింటికి, మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెట్టును.
- ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.
- గర్భిణి స్త్రీలు కొబ్బరికాయ పగులకొట్ట రాదు.
- గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
- స్త్రీలు ఎప్పుడూ నేరుగా గుమ్మడికాయను కొట్టకూడదు, ఇది గర్భ శోకాన్ని ఇచ్చును.
- ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను.
- ఉదయాన్నే లేచి, పనిమనిషి ఉన్నపటికినీ తాను స్వయంగా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును.
- చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వంటి పదార్ధాలు వడ్డించకూడదు
- ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనాలి. నాస్తి నాస్తి(లేదు లేదు) అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.
సేకరణ: https://www.panditforpooja.com/blog/what-things-married-women-should-not-do/
3 Comments. Leave new
It*s a good information. I want to get the Aadhyatmika samachaaram kosamu ee message meeku pampistunnanu. Naa mobile No: 09540463742.
Very nice information.
చాలా మంచి విషయాలు తెలిపినారు, ధన్యవాదములు, ఇంకా చాలా విషయాలు తెలుప గోరు చున్నాము