గోత్రము అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

what is gotra and how it was formed

ప్రతీ వంశానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. మనిషికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా మనుష్యడి తాలూకు మూలానికి (వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడిని బట్టి ఆధారపడి ఉంటుంది.

గోత్రము అనే పదంలో గో అంటే గోవు(గురువు,భూమి, వేదముల స్వరూపము), త్ర అంటే రక్షించుట అని అర్ధం. ఆటవిక జీవనానన్ని గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్ల ఆవువారు, కపిలగోవువారు అని, తెల్ల ఆవులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, కౌండిన్య అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.

ఒక విధంగా గోత్రాలు ఆర్యుల/ఆటవిక కాలంలోనే ఏర్పడ్డాయి.

తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి) పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య (సగోత్రీకుల మధ్య) వివాహ సంబంధములు ఉండరాదని, వేరు గోత్రీకుల మధ్య వివాహములు జరపటము మంచిదని వాటి ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు.

బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు. భూములను కలిగిన బోయ/క్షత్రియ జాతివారు భూపతి, మండల, భూపని అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-is-gotra-and-how-it-was-formed/

agastya maharshi, gotra, hindu tradition, marriage, pooja
వైఖానస ఆగమం | వైఖానసులు అంటే ఎవరు?
ఎంత సంపాదించినా డబ్బు ఖర్చైపోతోందా? వాస్తు టిప్స్ మీకోసం !

Related Posts

Comments

1 Comment. Leave new

  • C.Gnaneswar
    20/02/2020 10:55

    పై వివరణ వ్రాసిన వారు ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్ వారి పేరు వ్రాయటం ధర్మము

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.