గుడాకేశుడు అనే రాక్షసుడు రాగి పాత్ర స్వరూపాన్ని ఏవిధంగా పొందాడు అనేది భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణంలో ఉన్నది.
ఇంట్లో చేసే పూజల్లో, దేవాలయాల్లోనూ, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో రాగిపాత్రలను తప్పక వాడుతుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రలోని నీటిని తాగడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా రాగి పాత్రల్లో నీటిని నిల్వయుంచి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి కలుగుతుంది అని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
కానీ రాగిపాత్రలో పువ్వులు కాని, పాలు తీసుకోని అభిషేకం(Abhishekam with Copper Vessel) కాని చేయరాదు. ఎందువల్ల అనగా రాగిపాత్రలోని పాలు తదితర పాల పదార్ధాలు / కొబ్బరి నీరులోకి కిలము చేరి పదార్ధమును పాడుచేయును. తద్వారా శరీరమునకు అనారోగ్యము చేకూరును. అంతేకాకుండా రాగిపాత్రలోని పాలు కల్లుతో సమానం అని చెప్పబడింది. అందుచేతనే రాగిపాత్రలోని పాలతో అభిషేకం చేయడం, తీర్ధం తీసుకోవడం సిషిద్ధం.