చాలామందికి కలిగే ఒక చిత్రమైన సందేహం పూజ చేసేటప్పుడు ఏ వైపు ముఖము పెట్టి పూజను చేయాలి…? అని. ఈ సందేహం మీకూ ఉందా???
అనంతముగా వ్యాపించి ఉన్న పరమాత్మని అర్చించేటప్పుడు నిజమునకు దిక్కులో సంబంధం లేదు. కానీ ఏ దిక్కున ఉండి పూజ చేస్తే మంచి ఫలితములను పొందవచ్చో శాస్త్రంలో ప్రస్తావించబడింది.
సాధారణంగా పూజలను ఇంట్లో, ఆలయాలలో, మండపాలు మొదలైన ప్రాంతాలలో చేస్తారు.
ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే పూజా గదిలో కూర్చొని పూజ చేసుకోవాలి. ఇంటికి దక్షిణ దిక్కులో కూర్చుని ఎన్నడూ దేవుడిని పూజించరాదు.
ఇంట్లో లేదా కళ్యాణ మండపాలలో చేసుకొనే విశేష కార్యక్రమాలను తూర్పుగా కానీ, ఉత్తరంగా కూర్చొని చేసుకోవడం శుభప్రదం. దేవాలయాలలో, యాగశాలలో, వైదిక క్రతువుల కోసం నిర్మించిన మండపాలలో కూర్చొని చేసే పూజా కార్యక్రములకు దిక్కులతో పనిలేదు. ఆయా సందర్భాన్ని బట్టి దిశను మార్చి కూర్చొని పూజను చేయవచ్చును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/what-are-the-best-vastu-directions-for-pooja-in-different-places/
3 Comments. Leave new
chalamanchivishayam teliyachesaru thanks
chalamanchi. Vishsyam tliyaa chesaru vandanamulu
ధన్యవాదాలు శాస్త్రి గారు