ఉగాది వృషభ రాశి ఫలితాలు – Vrushabha Rasi Phalalu 2025-26

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది వృషభ రాశి ఫలితాలు 2025-2026

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి [Sri Viswavasu Nama Samvatsara Vrushabha Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 11, వ్యయం – 05
  • రాజపూజ్యం – 01, అవమానం – 03

ఎవరెవరు వృషభ రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు వృషభరాశి లోకి వస్తారు.

  • కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)
  • రోహిణి 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ)
  • మృగశిర 1,2 (వే,వో) పాదములు

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వృషభ రాశి ఫలాలు [Vrushabha Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.

వృషభరాశి రాశి ఫలాలు 2025-26

ఈరాశి వారికి గురుడు మే15 నుండి ద్వితీయ స్థానమైన మిథునరాశి యందు తామ్రమూర్తి సామాన్యఫలితములను, శని సంవత్సరమంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగానూ సర్వసౌఖ్యములు కలుగజేయునట్లు గానూ, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా దశమ, చతుర్ధ స్థానములందు రజితమూర్తులు గనూ సౌభాగ్యకరమగు ఫలితములిచ్చువారుగనూ సంచరించును. వృషభరాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచారం చేత న్యాయపరమైన అంశాలలో విజయం పొందడం, అప్పులు తీరడం, వ్యాధినిర్మూలన అయి స్వస్థత చేకూరడం, వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులను ప్రభావితం చేస్తారు. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవ మన్ననలను పొందుతారు. ఆనందంకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగుతుంది. చేతిలో ధనమునకు లోటు ఉండదు. కానీ సంపదను పెంచడం అంత సులభం కాదు. కొన్ని సమస్య లుంటాయి. అయితే, మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపు ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే, వృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా గౌరవం ఉన్నతి, ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఇంతో సహాయపడతారు. కుటుంబంలో సభ్యులందరి తోనూ సత్ సంబంధాలు కలిగి ఉంటారు. వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనం కూడా పొందుతారు. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పవు. అక్టోబర్ నెలలో, తీర్ధయాత్రలకు దూర ప్రయాణాల అవకాశం కలదు. మీరు చేసే ప్రతి పమలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కానీ డిసెంబర్ నెలలో, కుటుంబంలో కొంత అసమతుల్యత ఉంటుంది.

ఈరాశి వారికి శని భాగ్య, రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానమందు పంచారం అనుకూలం. వృత్తులలో విజయాలు మరియు ఆర్ధిక వృద్ది కలగడం, వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం రావడం, వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు. మీ సమస్యలు తొలగి విజయపథం వైపు పయనించేటట్టు చేస్తుంది. జూలై నవంబర్ల మధ్యకాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడూ సంతానం గురించి కొన్ని ఆందోళనలు ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆతదుపరి కాలంలో ఈ విషయంలో ఉపశమనం ఉంటుంది. పదోన్నతి కల్గుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలం. మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. గతంలో నిలచిన పమలు త్వరితంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. పామాజికజీవితం అనుకూలమవుతుంది. స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడుగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది. గణపతి ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దశమ స్థానంలో రాహువు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తాడని భావించినప్పటికీ, ఒక ఉద్యోగం వదలి వేరే ఉద్యోగం చూచుకోవడం, అయితే ఆత్మవిశ్వాసంగా ఉంటారు. ఎటువంటి పని నైనా శ్రద్ధగా చిటికెలో చేపేస్తారు. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చతుర్ధ స్థానమందు కేతు సంచారం నిర్లిప్తతకు కారణం అవుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6.

 నెలవారీ ఫలితములు

2025 ఏప్రిల్ : అనుకూలమైన కాలం, ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యుల సహకారం బలమైన ఆర్థిక పరిస్థితికి దోహదం చేస్తుంది. సామరస్యపూర్వక కుటుంబ సంబంధాలు వారితో సమయం గడపడం, సమాజంలో గౌరవ మర్యాదలు.

మే: వాక్సౌమ్యత పెరుగుతుంది. స్వచ్చమైన నిజాయితీని ప్రదర్శించి అవరోధాలను అధిగమించి కృతకృత్యులవుతారు. కుటుంబ వృద్ది అవుతుంది.

జాన్: ఇతరులతో స్నేహాపూర్వకమైన ధోరణి అవసరం. తలనొప్పి మరియు కంటి సమస్యలతో సతమతమవుతారు. వైద్యుని సంప్రదిస్తారు. మిశ్రమఫలితాలుంటాయి.

జూలై: ఖచ్చితమైన ప్రణాళిక ఇతరులను కలుపుకునిపోవడం, ఆదాయమార్గాలు పెరగడం, ఆశయసిద్ధి కోపం విరంతరం కృషి మరియు సత్ఫలితం పొందటం, పోదర సోదరీ వర్గానికీ ఉన్నతి కల్గటం. వారి నుంచి శుభవార్తలు.

ఆగష్టు : తలపెట్టిన సమలు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహారజయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.

సెప్టెంబర్ : కళాత్మక భావాలను వ్యక్తీకరించడం, తోబుట్టువులతో సామరస్య పూర్వకమైన సంబంధాలు మరియు రచనా వ్యాసంగాలలో మనోహరమైన పదవివ్యాస శైలి వైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

అక్టోబర్ : స్పెక్యులేషన్ మరియు పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఈ రాశివారు మానసిక ఒత్తిడి మనోవేదవ మరియు ఆందోళనలేక ఆనందమయమైన జీవితం ఆప్వాదిస్తారు. ఇది అదృష్టవంతంగా ఉండే కాలం.

నవంబర్ : దూర ప్రయాణాలు ఫలిస్తాయి. సౌకర్యవంతంమయిన గృహాయోగం అనుభవిస్తారు. ఉద్యోగాలలో పై అధికారుల మన్ననలు పొందుతారు. శారీరక దృఢత్వం కోసం ఆరోగ్యకరమైన వియమాలను అనపరిస్తారు.

డిసెంబర్: ఆనందమయమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. ఒకరిపై మరొకరు పరస్పర గౌరవం కలిగియుండటం ఒకరి అభిప్రాయములను మరొకరు గౌరవించడం వలన జీవనం సాఫల్యమవుతుంది.

2026 జనవరి : వృత్తి వ్యాపారాలలో అధికాదాయాన్ని సంపాదిస్తారు. అత్యంత సుఖమయ జీవనాన్ని ఆస్వాదిస్తారు. చేతికి వచ్చిన పంట అమ్మి ధనం నిల్వ చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.

ఫిబ్రవరి : వృత్తి పరంగా ముందంజ వేస్తారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి పనులు సకాలంలో పూర్తి, వేత్రపంబంధ వైద్య చికిత్సలు అవసరమవుతాయి.

మార్చి: అధికారం విస్తరణ అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్. వ్యాపారస్తులకు కళాకారులకు అధికాదాయం. మాతృ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

1,000.002,500.00

Newborn Baby Horoscope

Newborn Baby Horoscope

350.00

Download Horoscope

Download Horoscope

500.001,000.00