మీ ఇంట్లో ఎటాచ్డ్ బాత్ రూము ఉందా??? అయితే అది వాస్తు ప్రకారం ఉందో లేదో తెలుసుకోవలనుకొంటున్నారా??? అయితే ఈ సమాచారం మీకోసమే…
ప్రస్తుత కాలంలో ఏ ఇంట్లో చూసినా ఎటాచ్డ్ బాత్ రూములు ఉంటున్నాయి. సాధారణంగా మన పూర్వికులు బాత్ రూములను బయట నిర్మించుకొనేవారు. ఆధునికతకు తగిన విధంగా అనేక సౌకర్యములతో బాత్ రూములను ఇంట్లోనే కట్టుకొంటున్నారు. ఇంటినంతా వాస్తు ప్రకారం నిర్మించినా… వాస్తు రీత్యా బాత్ రూములు కట్టకపోతే దాని ప్రభావం ఇంటిపై పడుతుంది.
బాత్ రూములను వాస్తు ప్రకారం నిర్మించదలచిన వారు కింది సూచనలను పాటించాలి (Guidelines for Attached Bathroom)…
నైరుతి మూల పడకగదిని నిర్మించడం శుభకరం, కావునా ఈ గదిలో తూర్పు వైపుగా దక్షిణం గోడకి ఆనుకోనేలా ఎటాచ్డ్ బాత్ రూము నిర్మించుకోవాలి. బాత్ రూము దక్షిణం గోడకి వెంటిలేటర్ అమర్చి పశ్చిమ-వాయవ్యం దిశలలో బాత్ రూము తలుపును అమర్చాలి.
నైరుతి వైపు డబుల్ బెడ్ రూము కట్టాల్సి వచ్చినపుడు ముందు ఒక గది కట్టి దానికి తూర్పు వైపు రెండు బాత్ రూములు నిర్మించాలి. రెండవ బాత్ రూముని ఆనుకొని తూర్పు వైపు మరొక పడకగది నిర్మించుకోవాలి. ఈ కట్టడమంతా దక్షిణం గోడకి ఆనుకోనేలా ఉండాలి.
అదేవిధంగా నైరుతి వైపు నుంచి తూర్పుభాగం వైపు, దక్షిణ గోడని ఆనుకొని నిర్మించుకొన్న పడకగదిలో దక్షిణంవైపు తలలు ఉండేలా పడక మంచాలను ఏర్పాటు చేసుకోవాలి. నిద్రలేవగానే ఉత్తరదిశను చూసి, అనంతరం పశ్చిమ-వాయవ్య దిశలలో నడుస్తూ బాత్ రూముకి వెళ్ళాలి.