దుర్గ అమ్మవారి యొక్క మరొక రూపమే వాసవి మాత. ఈవిడనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా పిలుస్తుంటారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని వైశ్యుల యొక్క కులదేవతగా మరియు ఇలవేల్పుగా ఈమె ప్రసిద్ధి చెందింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యులకు ప్రధానమైనటువంటి దైవము.
కొన్ని పురాణాల ఆధారంగా వాసవి అమ్మవారిని పార్వతి దేవి యొక్క అవతారంగా కూడా ఆరాధిస్తారు. కన్యకా పురాణం అనబడేటువంటి ఒక వచనం నుంచి వచ్చినటువంటి వృత్తాంతం ప్రకారంగా, వాసవి అమ్మవారు ఇంద్రుని యొక్క భార్య. ఈ అమ్మవారు వైశ్య సమాజంలో ఒక అందమైనటువంటి యువకురాలిగా, వైశ్యపాలకుడు అయినటువంటి కుసుమ శ్రేష్ఠ కుమార్తెగా వైశాఖ బహుళ ఏకాదశి రోజున జన్మించింది. దీనినే వాసవి జయంతి అంటారు. అయితే ఒక రాజు ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరినప్పుడు ఆమె నిరాకరించి, తన దైవిక స్వభావాన్ని వెల్లడించి పవిత్రమైనటువంటి అగ్నిలోకి ప్రవేశించింది. దీనినే వాసవి మాత ఆత్మార్పణము గా పిలుస్తారు. ఆత్మార్పణ అనంతరం అయితే ఒక అద్భుతం వలె వాసవి మాత పవిత్రమైనటువంటి అగ్నిగుండం నుంచి కన్యకాపరమేశ్వరిగా ఉద్భవించింది
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రేమ, నైతిక విలువ, యొక్క ధర్మములను చెబుతుంది. అంతేకాకుండా ఆమె విద్య, కళ, సంగీతము మరియు నృత్యం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ అమ్మవారు భక్తులను ప్రలోభాల నుంచి రక్షిస్తూ ఉంటుంది మరియు కుటుంబ సాంప్రదాయ విలువలను కూడా కాపాడుతుంది. వాసవి అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రధానంగా మూడు పండుగలు ఉంటాయి.
- వాసవి జయంతి
- వాసవి జయంతి వైశాఖ బహుళ ఏకాదశి రోజు నాడు జరిగింది ఈ సంవత్సరం 19వ తేదీ మే 2024
- వాసవి మాత ఆత్మార్పణము
- మార్గశిర శుద్ధ విదియ రోజున వాసవి అమ్మవారు 102 గోత్రజాలతో కలిసి హోమగుండంలోని పవిత్ర అగ్నిలోకి ప్రవేశించారు
- నవరాత్రి
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో వారు వాసవాంబను, నిమిషాంబ అని కూడా పిలుస్తారు. మైసూర్ సమీపంలో కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీరంగ పట్టణ నిమిషాంబ ఆలయంలో వాసవి జయంతిను వాసవాంబ జయంతి అత్యంత వైభవంగా జరుపుతారు.