ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడు కొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వేంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రం లోని మూలవిరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ కేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభుగా వ్యవస్థానని వారికి వివరిస్తాడు దీనితో మునులు సంతోషంతో అక్కడ్నుంచి వెని తిరుగుతారు.
కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్ట కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో, ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, సుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షినీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది. భక్తిశ్రద్ధలతో ఆ పెట్టిన ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్టింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు.