ఉగాది సింహ రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి [Sri Viswavasu Nama Samvatsara Simha Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 11 వ్యయం – 11
- రాజపూజ్యం – 3 అవమానం – 6
ఎవరెవరు సింహరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు సింహరాశి లోకి వస్తారు.
- మఖ 4 పాదాలు (మ, మి, ము, మే)
- పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
- ఉత్తర 1వ పాదం (టె)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సింహరాశి ఫలాలు [Simha Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
సింహ రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి ఏకాదశస్థానమైన మిథునరాశి యందు లోహమూర్తిగా ధనవ్యయమును శని సంవత్సరమంతా అష్టమస్థానమందు లోహమూర్తులు గానూ ధననాశము కలుగ జేయునట్లు గాన, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా సప్తమ-జన్మ స్థానములందు సువర్ణమూర్తులుగనూ సర్వసౌఖ్యకరమగు ఫలితములిచ్చువారుగనూ సంచరించును. అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది. మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది. మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు, గురుడు పంచమ, అష్టమాధిపతి ఏకాదశ స్థానం లోనికి వచ్చినపుడు మంచి జరుగుతుంది. ధనాదయం కల్గుతుంది. అవివాహితులకు వివాహం. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. సత్సంతానం కల్గుతుంది. విద్యావిషయాల్లో ముందంజ. రహస్య ధనం అందుతుంది. ఈ సమయం తోబుట్టువులకు కూడా అనుకూలంగా ఉంటుంది మరియు వారితో మీ సంబంధం సజావుగా మారుతాయి. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరుగుతాయి. మీ ఖర్చులు పెరుగుతాయి తదుపరి ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. యత్నకార్యాలు ఆలస్య మవుతాయి.
శని అష్టమరాశి సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కలసివస్తాయి. కోర్టు విషయాలకోపం అధిక ధనం వెచ్చించ వలసి వస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసేచోట అధిక ఒత్తిడి. సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే, సమస్యలను అధిగమిస్తారు. జూలై మరియు నవంబర్ల మధ్య సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. కోపోద్రిక్తలకు లోనవడం అవుతుంది. వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ముందంజ వేస్తారు. సింహరాశి వారికి రాహు సంచారం 2025 సప్తమస్థానంలో జరుగబోతోంది. రాహువు సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక రకాల అపార్థాలు పెరుగుతాయి, దీనికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తారు. మీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందవచ్చు.
జన్మరాశిలో కేతువు సంచారం కాబట్టి తొందరబాటు నిర్ణయాలు మానసిక హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు. ఏకాదశ స్థానమందలి గురుడు సామాజిక విషయాలలో పురోగతిని సూచిస్తుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థికస్థితి మెరుగు. వ్యాపారాల ద్వారా లాభా లాభాలుంటాయి. కొత్త యి. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలరు. ఆంజనేయ ఆరాధన, హనుమాన్ చాలీసా, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠించుట మేలు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : కుటుంబంలో శాంతి, సామరస్యం. సంతోషకరమైన వైవాహిక జీవితంతోతృప్తి. ప్రోత్సాహకాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు. వ్యాపారస్తులకు అనూహ్యలాభాలు, అదృష్ట కాలంగా ఉంటుంది.
- మే : కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు మరియు ఆనందిస్తారు. ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా సులభంగా వస్తుంది. ఆర్థిక స్థితిలో పెరుగుదల కనబడుతుంది.
- జూన్: ఆకస్మిక ధనలాభాలు. వృత్తిపరమైన రంగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగు తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని సహకారాన్నీ పొందుతారు.
- జూలై : చురుకైన స్వభావం మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిఉంటారు. అహం కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. కుజ గ్రహదోష నివారణకు కందులు దానం చేయండి.
- ఆగష్టు: కొత్త పథకాల రచిస్తారు. మరింత చురుకుగా ఉత్సాహంతో ఉంటారు. మీ భౌతిక సంపదను వృద్ధిచేస్తారు. దస్తావేజులు మొదలైన రహస్య పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి వస్తుంది.
- సెప్టెంబర్:స్వస్థతగా ఉంటారు. ఆస్తుల క్రయవిక్రయ మార్పులు అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో లాభపడతారు. చక్కటి ప్రణాళికతో అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తారు. ధన, కుటుంబ విషయాల్లో లాభపడతారు.
- అక్టోబర్: చేసే పని మీద పూర్తి అవగాహన ఖచ్చితమైన ప్రణాళిక వీరికి ఉంటుంది. ఆశయ సిద్ది కోసం నిర్విరామంగా కృషిచేసి సాధిస్తారు. సోదరబలం వీరికి ఉంటుంది. ఇతరులకు తమవంతు సహకారములు అందిస్తారు.
- నవంబర్ : తలపెట్టినులు సకాలంలో పూర్తి ఆగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
- డిసెంబర్ : విద్యా వ్యాసంగాలలో వక్తృత్వపు పోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకుంటారు. అందరి ప్రశంసలను పొందుతారు. ప్రజాప్రయోజనం కోసం ధాతృత్వంతో ఆకట్టుకుంటారు. అధికార పదవి వరిస్తుంది.
- 2026 జనవరి : శత్రువర్గాన్ని నిర్వీర్యం చేస్తారు. సంపదలు కీర్తి కలుగుతాయి. స్నేహితులకు ప్రయోజనాకారిగా ఉంటారు. కోర్టు కేసులు ఋణములబారి నుండి విముక్తులవుతారు. శరీరంలో స్వస్థత చైతన్యం కనబడుతుంది.
- ఫిబ్రవరి : కుటుంబ సభ్యులతో అనగా ముఖ్యంగా తల్లి సోదరవర్గం వారితో మంచి సంబంధాలు కలిగియుంటారు. కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయకారిగా వ్యక్తిత్వాన్ని పెంచుకుంటారు. పోటీ పరీక్షలలో ఉద్యోగ విజయం పొందుతారు.
- మార్చి: మానసిక క్షోభ, శారీరిక రుగ్మత, అస్వస్థత కల్గుతుంది. పనిచేసేచోట ఒత్తిడి. మీ పై అధికారి లేదా సహోద్యోగులతో దురుసుగా వ్యవహరించడం తగదు.