ఉగాది కుంభ రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి [Sri Viswavashu Nama Samvatsara Kumbha Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 8 వ్యయం – 14
- రాజపూజ్యం – 7 అవమానం – 5
ఎవరెవరు కుంభరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కుంభరాశి లోకి వస్తారు.
- ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
- శతభిషం 1,2,3,4 పాదాలు (గొ, స, సి, సు)
- పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కుంభ రాశి ఫలాలు [Kumbha Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
కుంభ రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి పంచమస్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలములను, మరియూ శని సంవత్సరమంతా ధనస్థానమందు సువర్ణ మూర్తిగా సర్వాశుభములను కలుగజేయును. రాహుకేతువులు వరుసగా మే 18నుండి సంవత్సరమంతా జన్మ సప్తమస్థానములందు లోహమూర్తులుగానూ అపరిష్కృత సమస్యలు, వ్యవహారప్రతిబంధకములు కలుగునట్లు సామాన్యఫలితముల నిచ్చును.
ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన ఒరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికీ వచ్చిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్దములను వండించి సరఫరా చేయు కేటరింగు, కాస్మెటిక్, రవాణారంగ వ్యాపారాలు వీరికి బాగా కలసి వస్తాయి. ఈ రాశివారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమందు సంచారం ధనసంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి వస్తుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. యత్నకార్యసిద్ధి అవుతుంది. వివిధ ఆదాయమార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఉద్యోగవిషయాలు చూస్తే కోరుకున్న హోదా గల ఉద్యోగావకాశం ఉంది.
పంచమస్థానంలో ఉన్న గురుడు భాగ్య, ధనుస్సు మరియు జన్మరాశిని వీక్షించుట వలన ముఖ వర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం సృజనాత్మకంగా ఉన్నతవిద్యలలో బాగా రాణించడంతో బాటు సంస్కారవంతమైన సంతానంగా రూపు దిద్దుకుంటారు. ఉన్నత విద్యలలో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజవకారులుగా మారతారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతోబాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. తదుపరి డిసెంబర్నెల నుండి ఆర్థిక సవాళ్లు, ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటిలోనూ జాగరూకత వహించగలరు.
శని కుంభరాశికి మాతృ గృహ వాహన సౌఖ్య విషయములను ప్రభావితం చేసే చతుర్ధ స్థానమును, ఆయువును సూచించే అష్టమస్థానమును మరియు లాభస్థానమును వీక్షించుటచే ఈ సంవత్సరంలో ధనమును వీలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదించుట, బహుపరిశ్రమ చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతరదేశముల ద్వారా బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ధనం కూడబెడతారు. స్థిరాస్థి క్రయవిక్రయాల వల్ల లాభపడేతారు. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జూలై మరియు నవంబర్ మధ్య, కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు. వీరికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహనా శక్తిని ప్రభావితం చేస్తుంది. జన్మరాశిలోని రాహువు వలనసరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్రతి పనిలో తొందరపాటును సూచిస్తుంది. ఆ పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాలలో ఎదురయ్యే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో కేతువు సంచారం అంత తేలికాగా తీసుకోకూడదు. అహంకారం వదలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం గౌరవం చూపాలి. విత్యం దుర్గామాతను ఆరాధించుట వలన ఇక్కట్లు తొలగుతాయి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించుట మరియు ప్రతి పోమవారం శివారాధన చేయుట వలన ఉపశమనము కల్గును. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : గృహం కొవడం లాంటి ప్రయోజనాలు నెరవేరతాయి. ధనమును శుభవిషయాలకై మాత్రమే వెచ్చిస్తారు. దూబరా ఖర్చులను అదుపులో ఉంచుతారు.
- మే: కుటుంబమువ శుభకార్య సిద్ది కార్యభారం వహించి నిర్విఘ్నముగా శుభకార్యములు జరుపుట, పై అధికారులను సందర్శించి ప్రయోజనం పొందటం, శారీరికంగా మానసికంగా స్వస్థతగా ఉంటారు.
- జూన్: దూర ప్రాంతాలకు వెళ్ళడం, విదేశీ మారకద్రవ్యాన్ని పొందగల్గుతారు. భార్య కుటుంబానికి దూరంగా ఉంటారు. అయితే వారిలో స సత్సంబంధాలు నెరపుతారు.
- జూలై : మాట ధోరణి వలవ ఇతరులతో కలహం వచ్చే సందర్భాలుంటాయి. ఆర్ధికంగా ప్రయోజనం, ధవం విల్వ చేస్తారు. కుటుంబ సభ్యులు ఆవందం.
- ఆగష్టు: జాగ్రత్త వహించి ప్రమాదాలను నిర్మూలించడం సమాజం మరియు కుటుంబ భద్రతమ పరిరక్షించడం, స్వస్థత కలగడం, ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం వలవ ఎలాంటి ఆవారోగ్య సమస్యా ఉండదు.
- సెప్టెంబర్: బంధు మిత్రుల కలయిక ధవాగమము అధికార పమలపై వెళ్ళుట వలవ లాభపడతారు. ఆర్ధిక స్థిరత్వం, సామాజికంగా గౌరవం పేరు ప్రఖ్యాతులు.
- అక్టోబర్: కుటుంబం శిశుజవనం వలన ఆనందం పుత్రోదయం శాంతులు జరపడం సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. బంధు మిత్రుల కలయిక ఆనందమయమైన జీవనం అమభవిస్తారు.
- నవంబర్: సాంఘికంగానూ కుటుంబ పరంగాను ఆనందంగా ఉండటం మాతవవస్తు వస్త్ర, ధన ప్రాప్తి. ఆలయములను సందర్శించడం గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
- డిసెంబర్: మానసిక అశాంతి ప్రతి చిన్న దానికి అసంతృప్తి, అస్థిమితం పెరుగుతుంది. బంధన యోగం కలిగే అవకాశం ఉంది. శత్రువుల బలాన్ని అంచనా వేయగల్గుతారు.
- 2026 జనవరి : ఆకస్మిక ధనలాభం, వ్యవహార జయం. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని వృత్తుల వారికి ధనలాభం సంతృప్తి కల్గుతుంది.
- ఫిబ్రవరి : వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు వివాదాలకు దూరంగా ఉండాలి. అస్థిరత్వం అభద్రతాభావానికి లోనవుతారు.
- మార్చి: స్థానికులు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో శాంతియుత సంబంధాలను అనుభవిస్తారు. సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సమాజంలో గౌరవం కల్గుతుంది. వృత్తిలో కొత్త స్థానాన్ని పొందుతారు.