ఉగాది కర్కాటక రాశి ఫలితాలు 2025-2026
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి [Sri Viswavasu Nama Samvatsara Karkataka Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 8 వ్యయం – 2
- రాజపూజ్యం – 7 అవమానం – 3
ఎవరెవరు కర్కాటక రాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కర్కాటక రాశి లోకి వస్తారు.
- పునర్వసు 4వ పాదము (హి)
- పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
- ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి ఫలాలు [Karkataka Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
కర్కాటక రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి వ్యయస్థానమైన మిథునరాశి యందు రజితమూర్తిగానూ, శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమగు ఫలితములిచ్చునట్లుగాన, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సం॥రమంతా అష్టమ, ద్వితీయస్థానములందు తామ్రమూర్తులుగనూ సామాన్య సౌఖ్యములను ఇచ్చువారుగనూ సంచరించును. వీరికి అన్నిరంగాలలోనూ విజయం, ఆదాయం, కొత్త ఉద్యోగం. ఆన్లైన్ వ్యాపారానికి మేలు. విద్యార్థులు సవాళ్లను అధిగమిస్తారు. అందరి మన్ననలు, ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతాయి.
ఈరాశి వారికి షష్ట భాగ్యాధిపతి అయిన గురుడు వ్యయ స్థానంలో సంచారం వలన గృహమున శుభాలు, శుభవిషయాలకై ధనం వెచ్చించడం జరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు. దైవారాధన, తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సం॥రం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యవాతావరణం పెరుగుతుంది మరియు ఆనందమయమైన జీవనం అనుభవిస్తారు. ఉదరసంబంధ రుగ్మతలకు అవకాశం వలన వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి. గృహ విషయాలలో సంతోషం. మీ అత్తమామల మండి శుభవార్తలు. అక్టోబర్లో, బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖ వర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి దానధర్మాలు సౌఖ్యం వంటి మరిన్ని సత్పలితాలు. డిసెంబర్లో చలికి తట్టుకోలేక పోవడం వలన గొంతునొప్పి, స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఖర్చులు కలుగుతాయి. భాగ్యస్థానంలో శని సంచారం ఆశావాహంగా ఉన్నవారికి వారి పమలలో సత్ఫలితాలు. భాగ్యస్థాన సంచారం వలవ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, అలసత్వం, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగి, ఉపశమనం. వ్యాపార విషయాలు కలసివస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితి, దూర ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, చేతికి డబ్బు అందుట, ఫైనాన్సు రంగం, వడ్డీ వా వ్యాపారులకు బాకీలు వసూలు అయి, ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. జూలై నుంచి నవంబర్ల మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయనాయకులకు జయం కల్గుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ద్వారా ఆకస్మిక ధవలాభం పొందుతారు.
ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆష్టమ రాహువు ఆరోగ్య సమస్యలవిస్తాడు. రాహువు అష్టమ రాశిలో సంచారం వలనఊహించని ధన లాభాలు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందెదరు. ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీఫణమవుతుంది. మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంటుంది కావున శ్రద్ధ వహించాలి. ద్వితీయ స్థానంలో కేతుసంచారం వలన ఒడిదుడుకులు, నోటిలో అల్సర్లు, బొబ్బలు, పంటినొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశముంది. గురువారం సెనగలు కేజింపావు దావం, నిత్యం విష్ణు ఆరాధన వలన మంచి కలుగుతుంది. రుద్రాభిషేకం దుర్గామాతను పూజించాలి. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – “2”.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం, కుటుంబానికి దూరంగా ఉండటం, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురయిననూ అధిగమించగల్గుతారు. దీర్ఘకాలికవ్యాధుల బారిన పడవచ్చు.
- మే : చిన్న చిన్న గాయాలు ముఖముపై వల్లమచ్చలు ఉష్ణ సంబంధ జ్వరాలు మొదలైన స్వల్పకాలిక రుగ్మతలుంటాయి. అధికారం విస్తరిస్తుంది.
- జాన్:వృత్తి వ్యాపారాలలో కొత్త సవాళ్లు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారితోషికాలు.ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు. వ్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం.
- జూలై: కొత్త పథకాలను రూపకల్పన చేసుకోవలసి ఉంటుంది. స్థానచలన సూచనలు.శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చుచేస్తారు. విషజ్వరాల బారిన పడే అవకాశం ఉంది.
- ఆగష్టు: ఈ మాసం ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. తండ్రితోనూ, బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. విలకడ ఉండదు. ఆర్థిక విషయాలు సామాన్యముగా ఉంటాయి ద్వితీయార్ధంలో శుభయోగాలు.
- సెప్టెంబర్ : దృఢమైన సంకల్పం పట్టుదల కలిగి కార్యోమ్మఖులైయుంటారు. సగర్వంగా ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఆశయం సాధిస్తారు. స్వావలంబన కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటివీ చేధించుకుని విజయం సాధిస్తారు.
- అక్టోబర్ : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
- నవంబర్: మానసిక సంతృప్తితో బాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ప్రణాళిక సిద్దం చేసుకుని రంగంలోనికి దిగుతారు. విజయం సాధిస్తారు మరియు విదేశీ ప్రయాణం చేయగలుగుతారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు.
- డిసెంబర్: శారీరక దృఢత్వం కోపం సం యోగాభ్యాసం యోగాభ్యాసం యోగాభ్యాసం వ్యాయామం వంటి క్రమశిక్షణను పెంపొందించే ఆరోగ్యకరమైన వియమాలను అనుపరించడం. స్పెక్యులేషన్ మరియు పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. అదృష్టం కలసివచ్చే కాలం.
- 2026 జనవరి : దీర్ఘకాలిక లక్ష్యాలను తొందరగా పూర్తి చేస్తారు. సభలలో అద్భుతంగా ప్రపంగించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. జనవరి మొదట వారంలో సన్మానాలను పొందుతారు.
- ఫిబ్రవరి: శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు అధ్యయన విషయాల్లో రాణిస్తారు. కొత్త విషయాలను వేర్చుకునేందుకు సుముఖత చూపిస్తారు. ఉదర సంబంధ అనారోగ్యం సూచిస్తోంది.
- మార్చి: పరస్పర భావోద్వేగములకు ప్రతిస్పందన వస్తుంది. ఒకే మనస్తత్వముల గల మనుషుల సమాగమము వలన సమాజంలో ప్రయోజనం కల్గుతుంది. నిత్య మాతనంగా యవ్వనంగా ఇతరులకు కనిపిస్తారు.