ఉగాది కన్యా రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి [Sri Viswavasu Nama Samvatsara Kanya Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 14 వ్యయం – 2
- రాజపూజ్యం – 6 అవమానం – 6
ఎవరెవరు కన్యారాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కన్యారాశి లోకి వస్తారు.
- ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
- హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
- చిత్త 1,2 పాదాలు (పె, పొ)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కన్యారాశి ఫలాలు [Kanya Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
కన్యా రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి దశమ స్థానమైన మిథునరాశి యందు మరియూ శని సంవత్సరమంతా సప్తమస్థానమందు తామ్రమూర్తులు గానూ సామాన్య ఫలితములు కలుగజేయునట్లు గానూ, రాహుకేతువులు వరుసగా మే 18 నుండీ సంవత్సరమంతా షష్ఠ, వ్యయస్థానములందు రజితమూర్తులుగనూ సౌభాగ్యకరమగు ఫలితములిచ్చువారుగనూ సంచరించును. ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాహదృక్పథాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యా రంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢం. ప్రేమవిషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచారం సమయంలో, అనగా మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలుంటాయి. అక్టోబర్ నెలనుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం.
ఈ రాశిలోని ఆర్ధికంగా నిపుణులకు బ్యాంకింగుఫైనాన్సు రంగమువారికి షేర్ మార్కెట్టు వడ్డీ వ్యాపారులకు సంవత్సరం పొడుగునా అధిక ఆదాయము వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్ఠలు పేరు ప్రఖ్యాతులు కల్గుతాయి. అన్నిరకముల వృత్తుల వారికి ముఖ్యముగా చేనేత, వ్యవసాయదారులకు అధిక ఆదాయం ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకు ప్రస్తుత పరిస్థుతులకు చాలా అనుకూలమైన మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం వస్తుంది. ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి. శుభయోగాలు సంప్రాప్తత అవుతాయి. బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సంతానం వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది. దూరప్రయాణాలు కలసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం.
షష్ఠరాశి గతుడైన రాహువు మరియు వ్యయస్థానమందలి కేతువు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా భావిస్తారు. ఇది రాబోయే సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా మోకాళ్ళు సంబంధ నొప్పులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుతాయి మరియు మీరు డబ్బు పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. 9వ ఇంట్లో గురుడు సంచార సమయంలో, సంఘంలో పలుకుబడి.సంపదలో పెరుగుదల, నిలచియున్న పనులన్నీ పూర్తగుట. చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లాభాలు. ఈ కాలంలో అత్తమామలు సహకరిస్తారు. మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వ్యాజ్యాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గణపతి, దుర్గ ఆరాధనలు చేయుట వలన దోషం తొలగును. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : గురుబలం ఉంది. కలలను సాకారం చేసుకోడానికి ప్రణాళిక రచిస్తారు. లక్ష్యం సాధించే వరకు దృఢ నిశ్చయంతో కృషిచేస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంశక్తితో విజయం సాధిస్తారు.
- మే : భూ గృహ స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోగల్గుతారు. పంటల అధిక దిగుబడుల వలన ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాల మూలంగా ఆర్ధిక ఉన్నతి.
- జూన్ : స్థానచలన సూచనలు గలవు. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. సంతానం ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. వారిని మరిన్ని విజయాలు వరిస్తాయి.
- జూలై: అధికారుల అండదండలు కలుగుతాయి. మీకు వృత్తి వ్యాపారాలలో గుర్తింపు, కళాకారులకు ఉన్నత స్థాయి పురస్కారాలు వస్తాయి. వృత్తిపరమైన రంగంలో స్థానికుల పేరు మరియు గుర్తింపు పెరుగుతుంది.
- ఆగష్టు:ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సామరస్య సంబంధాలు, పుష్కలమైన ఆరోగ్యంతో ఆనందభరితమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
- సెప్టెంబర్: అధికార యోగం అధికార విస్తరణ కల్గుతుంది. ఖచ్చితత్వాన్ని పాటించి లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. మీ దురుసుతనానికి ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదాల బారినపడకుండా క్రమశిక్షణతో వాహనాలు నడపాలి.
- అక్టోబర్ : దురుసుతనం వలన ఇబ్బందులు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుంది. విందు భోజనాల్లో పాల్గొంటారు.
- నవంబర్ : జ్ఞానసముపార్జన కోసం పరితపిస్తారు. ఇతరులను జ్ఞానవంతులను చేయడం లక్ష్యంగా పనిచేస్తారు. వారికి నిరంతరం సహకారమందిస్తూ వారిపై ప్రభావం చూపుతారు. లక్ష్యాలను సాధిస్తారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.
- డిసెంబర్ : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి ఆగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
- 2026 జనవరి : నిత్యనూతనంగా ఆలోచించి పరిశోధనలలో విజయం సాధిస్తారు. పనిచేసే చోట క్రిందివారిని ఆకట్టుకుని వారిని ప్రగతిపథం లక్ష్యసాధన వైపు మరలించ గల్గుతారు. ఆదర్శవంతమైన జీవనం కలుగుతుంది.
- ఫిబ్రవరి : విద్యార్ధులకు కెరీర్ వృత్తి పరంగా అవకాశాలు మెరుగు. సుసంపన్నమైన జీవితాన్ని ఆస్వాదించటం, మంచి విద్యను మరియు సంపదను పొందెదరు.
- మార్చి: అందమైన అలంకరణ వసతులు గల గృహాన్ని కొనుగోలు చేస్తారు. స్వచ్చమైన భాషతో విష్కల్మషమైన మనస్సుతో అందర్నీ ఆకట్టుకుంటారు. శ్రమకు తగిన ఫలితమొస్తుంది.