ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు – Dhanu Rasi Phalalu 2025-26

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి [Sri Viswavasu Nama Samvatsara Dhanu Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు 2025-26

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి [Sri Viswavasu Nama Samvatsara Dhanu Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 5 వ్యయం – 5
  • రాజపూజ్యం – 1 అవమానం – 5

ఎవరెవరు ధనుస్సు రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు ధనుస్సు రాశి లోకి వస్తారు.

  • మూల 1,2,3,4 పాదములు (యె, యో, బ, బి)
  • పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బు, ధ, భ, ఢ)
  • ఉత్తరాషాఢ 1వ పాదం (బె)

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ధనుస్సు రాశి ఫలాలు [Dhanu Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.

ధనుస్సు రాశి ఫలాలు 2025-26

వీరికి గురుడు మే15 నుండి సప్తమస్థానమైన మిథునరాశి యందు మరియూ శని సం॥రమంతా అర్ధాష్టమస్థానమందు లోహమూర్తులు గానూ ధననాశము కలుగ జేయునట్లు గానూ, రాహుకేతువులు వరుసగా మే 18నుండి సం॥రమంతా తృతీయ, భాగ్యస్థానములందు రజితమూర్తులుగనూ ప్రణాళికతో కార్యసాధన, సౌభాగ్యకరమగు ఫలితములు, నూతనమైన ఆలోచనలతో అధికారం వచ్చునట్లుగా ఫలితములిచ్చును.

ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం, పరిశోధన రంగ సంబంధవ్యక్తులు మాతన విషయములను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు. కళత్ర స్థానమందు గురుడు కళత్రంతో సంబంధాలను మెరుగుదల, ఆర్ధికవృద్ధి, సానుకూలతను పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం, భూమి కొనుగోలు అమ్మకం సంబంధ లావాదేవీల వలన లాభపడతారు. ప్రణాళికతో ముందుచూపుతో లాభాలు. అక్టోబర్లో తలనొప్పి, ఉదరసంబంధ, నోటిపూత, తలనరములు, మెడ వరములు, కండరాల సంబంధించి స్వల్ప రుగ్మతలుంటాయి. ఈ సమయంలో గురువారం శెనగలు దానం చేస్తే స్వస్థత కలుగుతుంది. డిసెంబర్లో వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన. వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలు మెరుగవుతాయి.

ఈరాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే చతుర్ధ స్థానంలో శని సంచారం ఆనందదాయకమవుతుంది. లేకపోతే మత్తుమందులు, జూదములు బెట్టింగు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాలలో పట్టుబడే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ మధ్య, ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ అవసరం. కుటుంబం మరియు తల్లిదండ్రులు, స్వంత గృహం ఏర్పాటుకోసం చేసుకునే ప్రయత్నాలలో విఫలం కావచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్య విషయం అంతంతగానే ఉంటుంది.

తృతీయ స్థానమందలి రాహువు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే శక్తి ఉంటుంది. కమ్యునికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సత్ సంబంధాలు, ధైర్యం మరియు భావ వ్యక్తీకరణలను ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది. సృజవాత్మకతతో అన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు. మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది మరియు వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు లభిస్తాయి.

మీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు కుటుంబం మరియు మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీ తోబుట్టువు వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ వారికి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వక్తృత్వపు పోటీలలో ఆకర్షణగా నిలబడి బహుమతులు గెలుచుకుంటారు.
అదృష్టం కలసివస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కల్గియుంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఘర్షణలు ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. స్థానచలన సూచన కూడా లేకపోలేదు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ‘3’. గురువారనియమములు పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకములు చేయించుకోవాలి. శివ అష్టోత్తరశతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేయుట మంచిది.

నెలవారీ ఫలితములు

  • 2025 ఏప్రిల్ : జీవితంలో ప్రతి కార్యకలాపాన్ని చురుకుగా నిర్వర్తించడానికి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉన్నత ఆశయాలను విజయవంతంగా చేరుకుంటారు. సమాజంలో కుటుంబం, స్నేహితులు మొదలైన విషయాల్లో ప్రసిద్ధి చెందుతారు.
  • మే: చుట్టూ ఉన్న సమాజం మరియు కుటుంబ సభ్యులకు శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. వ్యాపార విషయాల్లో స్వయం ప్రతిపత్తిని కోరుకుంటారు.
  • జూన్: ఉన్నత విద్యావకాశాలు, సాంకేతిక పరమైన సంస్థలను నెలకొల్పి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కొంతమేరకు వనరుల వృద్ధి ఆదాయవృద్ధి కల్గుతుంది.
  • జూలై: భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి. గొప్ప మేధా సామర్థ్యాన్ని కలిగి వారి కార్యక్రమాలు ప్రణాళికలను పూర్తి చేయడానికి ప్రభుత్వ మరియు భాగస్వామ్యుల మద్దతు కలిగి యుంటారు.
  • ఆగష్టు : వృత్తిధర్మంలో మంచి నైతికత, ఉన్నత విలువలను పాటించడం, ఆధ్యాత్మికతపై ఆసక్తి. సంప్రదాయ వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉంటారు.
  • సెప్టెంబర్ : అదృష్టాన్ని మరియు ఉన్నత విద్య అవకాశాలను పొందుతారు. ధార్మికంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు మొగ్గు, అదృష్టం కలసి వస్తుంది.
  • అక్టోబర్ : మందులు వ్యాపారులకు అనుకూలం. లాభాలను ఇబ్బడిముబ్బడిగా పొందుతారు. వైద్య సంబంధమైన పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి విద్యార్ధులు చదువులలో ముందంజ వేస్తారు. ప్రముఖ వ్యక్తుల అండదండలు ఉంటాయి.
  • నవంబర్ : ఆర్ధికపరమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే సమయం ఇది. ఋణముల నుండి అభద్రతా భావాన్ని తొలగించుకుంటారు. కళాత్మక రంగం లేదా సినీరంగంలో ప్రతిభ చూపి అధిక ఆదాయం పొందుతారు.
  • డిసెంబర్ : స్వయంసమృద్ధి ధన విషయాలలో లోటులేక స్వచ్చమైన మేధస్సు ఆరోగ్యం, భావ వ్యక్తీకరణ కలిగి బాహ్య అంతర రూపాలలో సౌందర్యాన్ని చూపిస్తారు.
  • 2026 జనవరి : ఈ రాశికి ఎదురులేని ఆకర్షణ, బలమైన సౌందర్యం కలిగి ఉంటారు. మరియు ఇతరులను ప్రభావితం చేయగల సత్తాకలిగి ప్రతి విషయం లోమా కృత కృత్యులవుతారు.
  • ఫిబ్రవరి : గణితం మరియు సైవ్స్ కంటే సోషల్ సైన్సెస్ మరియు కళల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. జీవితంలోని ఆచరణాత్మక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
  • మార్చి: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం, పుష్కలమైన ఆరోగ్యం.
Download Horoscope

Download Horoscope

525.001,050.00