ఉగాది తులా రాశి ఫలితాలు 2025-26
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి [Sri Viswavasu Nama Samvatsara Tula Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 11, వ్యయం – 05
- రాజపూజ్యం – 02, అవమానం – 02
ఎవరెవరు తులా రాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు తులారాశి లోకి వస్తారు.
- చిత్త 3, 4 పాదాలు (ర,రి)
- స్వాతి 1, 2, 3, 4 పాదాలు (రు, రె, రో,త)
- విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది తులారాశి ఫలాలు [Tula Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
తులా రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 నుండి భాగ్యస్థానమైన మిథునరాశి రజితమూర్తి గామా మరియూ శని సంవత్సరమంతా షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగనూ అత్యద్భుత ఫలితములను కలుగ జేయునట్లుగనూ, రాహుకేతువులు వరుసగా మే 18 మండి పంచమ, ఏకాదశ స్థానములందు సంవత్సరమంతా లోహమూర్తులుగన సామాన్య ఫలితముల నిచ్చును. సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. ఆత్మ విశ్వాసం, సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికీ సంబంధించిన ఖర్చు. ఉద్యోగం చేసేవారి కృషికి తగిన గౌరవం ఉంటుంది. ఆన్ లైవ్ వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తి కరంగా ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావాహంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటారు. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలు ఉంటాయి. కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు. సంతానం ఆనందాన్ని పొందుతారు. సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది.
సంవత్సరారంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా భావిస్తారు. ఎన్నికలలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు. సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్నవలను పొందుతారు. వ్యాధినిర్మూలన అవుతుంది. సాంఘికంగా ప్రతిష్ఠ వస్తుంది. జూలై మండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయానికొస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఉద్యోగం, పని మరియు జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం. పంచమ స్థానంలో రాహువు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చేయగలుగుతారు. మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. మీ జ్ఞాపకశక్తి పదునుగా ఉంటుంది. మీరు విద్యలో బాగా రాణించగలుగుతారు. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు కానీ, బెట్టింగ్, జూదం, లాటరీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అన్నిరకాల వ్యాపారస్తులకు, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూల సమయం. ఏకాదశ స్థానమందు కేతువు పంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ఇదిమీ ఆదాయాన్ని పెంచుతుంది. ఇది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, తులా రాశి వారు ఈ సంవత్సరం శ్రీవిష్ణు గణపతి ఆరాధనలు చేయుటచే సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6.
నెలవారీ ఫలితములు
- 2025 ఏప్రిల్ : యోగా ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. వికసిత వదనం విత్య యవ్వనంతో కనిపిస్తారు. ఎంత కఠినమైన పని అయినా ఎంతో సులువు గా చేయగల్గుతారు. ఆయుర్వృద్ధి అవుతుంది.
- మే: అధికారం మీ పరం ఆవుతుంది. ఇతరులను శాసించాలనుకోవడం అజ్ఞాన హేతువు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్ధిక వికాసం కల్గుతుంది.
- జూన్: ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు అధిక రక్తపోటు వలన ఇబ్బందులు. భూ స్థిరాస్తులు మార్పు చేయడం వలన లాభపడతారు.
- జూలై:మద్యం వ్యాపారులకు, వడ్డీ వ్యాపారుల కాళ్ళకు కళ్ళెం పడుతుంది. ప్రభుత్వం మండి అవరోధాలు కల్గుతాయి. దీర్ఘ కాళిక ప్రణాళికలు రూపొందిస్తారు. ముందు చూపు తో ప్రమాదాన్ని నివారిస్తారు.
- ఆగష్టు: శ్రమకు తగిన ఫలితం వస్తుంది. జీవితాన్ని ఆనందిస్తారు. ఉద్యోగులకు ఆదాయం ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా సులభంగా వస్తుంది. ఈ కాలంలో ఆర్థిక స్థితిలో పెరుగుదలవస్తుంది.
- సెప్టెంబర్: ప్రయాణాలు ఫలవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు విజయాలను సాధిస్తారు. ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
- అక్టోబర్ : ఈ నెలలో వైద్య వృత్తివారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అహంకారం అహంభావం తగ్గించుకుని లక్ష్య సాధన వైపు దూసుకుపోగల్గుతారు. అనైతిక పనులకు అడ్డుకట్ట వేస్తారు.
- నవంబర్ : కొత్త విషయాలను వేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఆశావాహంగా ఉంటారు. సన్నిహితులు,మిత్రులతో కలసి కార్యసాధన చేస్తారు. ఆనందమాయమైన సమయాన్ని చూస్తారు. విధ్యార్ధులకు విజయం.
- డిసెంబర్ : తలపెట్టినులు సకాలం లో పూర్తి ఆగుట, ధైర్యం తో వ్యవహారజయము, ఉద్యోగా విషయాలలో ముందంజ, అన్నీ వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం ,స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
- 2026 జనవరి : ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. మృష్టాన్న భోజనం చేస్తారు. బంధు మిత్రుల సమాగమం. ధైర్యం ప్రణాళిక తో కార్య నిర్వహణ చేస్తారు. విద్యార్ధులకు మంచి అవకాశాలు వస్తాయి.
- ఫిబ్రవరి: విద్యా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంత శుభకార్య నిర్వహణ అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్ధిక వికాసం కల్గుతుంది.
- మార్చి: అన్నీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పుష్కలమైన ఆరోగ్యం తో విత్యమాతనంగా కనిపిస్తారు. పామాజిక కార్యక్రమాల్లో నాయకత్వం వహించి అందరి మన్నవలను పొందుతారు.
Astrology Consultation
₹1,050.00 – ₹2,625.00
Horoscope Matching for Marriage
₹367.50 – ₹1,050.00