శ్రీ హేమలంబ నామ సంవత్సర మాఘ శుక్ల పూర్ణిమ బుధవారం ది.. 31-01-2018 తేదీ బుధవారం రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం.
ది. 31 – జనవరి – 2018 , శ్రీ హేమలంబ నామ సంవత్సరం మాఘ మాస పౌర్ణమి బుధవారం పుష్యమి, ఆశ్లేష నక్షత్రములందు సాయంత్రం 5.17 ని నుండి రాత్రి 8.41 వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse on January 31, 2018) ఏర్పడును. ఈ గ్రహణం భారత దేశమంతటా కనిపించును. ఐతే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పడమర దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణిస్తుంది. ఈ గ్రహణం పూర్తిగా ఒక గంట 16 నిమిషాల 4 సెకన్ల వరకు ఉంటుంది.
జనవరి 31, 2017 చంద్రగ్రహణ సమయాలు |
|
గ్రహణ స్పర్శకాలం: | సాయంత్రం 5గంటల 17 నిముషములు (IST) |
చంద్రోదయకాలం(RJY): | సాయంత్రం 6గంటల 05 నిముషములు (IST) |
గ్రహణ నిమీలన కాలం: | రాత్రి 6గంటల 21 నిముషములు (IST) |
గ్రహణ మధ్య కాలం: | రాత్రి 6గంటల 59 నిముషములు (IST) |
గ్రహణ ఉన్మీలన కాలం: | రాత్రి 7గంటల 37 నిముషములు (IST) |
గ్రహణ మోక్ష కాలం: | రాత్రి 8గంటల 41 నిముషములు (IST) |
గ్రహణ పుణ్య కాలం 3గంటల 24 నిముషములు | |
బింబదర్శన కాలం 1గంట 16 నిముషములు |
ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహణ ఫలితములేవి?
ధనస్సు – మేషం – కర్కాటక – సింహ రాశుల వారికి అధమ ఫలితము.
వృశ్చిక – మకర – మీన – మిధున రాశుల వారికి మధ్యమ ఫలితము.
కన్య – తుల – కుంభ – వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.
ఎవరు ఈ చంద్ర గ్రహణాన్ని చూడరాదు?
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం పుష్యమీ, ఆశ్లేష నక్షత్రాలు, కర్కాటక రాశులలో సంభవిస్తున్న వలన పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం చూడరాదు మరియు గ్రహణ శాంతి జరిపించుకోవలెను.