మనకు మరికొద్ది రోజులలో అక్షయతృతీయ అనే విశేషమైన పర్వదినం రాబోతోంది. అయితే అక్షయ తృతీయ రోజు చాలా మంది చేసే పని బంగారం కొనడము. అయితే…
అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొనడమనే ప్రక్రియ కలిపురుషుడిని ఆహ్వానించడం లాంటిది. ఎందుచేతనంటే, పురాణాలను పరిశీలించినయెడల “మహాభారతంలో పరిక్షిత్ మహారాజును కలిపురుషుడు తాను ఉండటానికి తానూ ఉండటానికి కావలసిన యోగ్యమైన ప్రదేశములను చెప్పమన్నప్పుడు, కలిపురుషుడు ప్రధానంగా ఉండే ప్రదేశములలో సువర్ణము(బంగారము) ఒకటి అని చెప్పెను“.
చాలామందికి ఒక సందేహం రావచ్చును. “మేము బంగారము కొనుక్కోనేదే సంవత్సరంలో కొన్ని సార్లు, కనీసం ఇలాంటి పర్వదినములో కొనుక్కోకపోతే సంవత్సరంలో ఇంకెప్పుడు కొనుక్కొంటామో తెలియదుకదా!!! “ప్రతి సంవత్సరం మేముకొనుక్కొంటున్నాము బాగానే ఉంది. ఈ సంవత్సరం మీరు ఇలా కొత్తగా విడియోలో చెబుతున్నరేమిటి అనే సందేహం రావచ్చును“.
సాధారణం గా ఈ అక్షయతృతీయ రోజు నాడు బంగారం కొనుక్కోవడం వల్ల సకల దరిద్రాలు చేకురుతాయి. అయితే అక్షయతృతీయ రోజు బంగారం కొనకుండా, ముందు రోజు కాని వెనుక రోజు కాని కొనుక్కోవడం ఉత్తమము.
చాలా మందికి ఉండే అపోహ ఏమయ్యా అంటే… అక్షయతృతీయ రోజు నాడు బంగారం కొనుక్కోవడం వల్ల అది అక్షయమైపోయి సర్వాభరణములు వస్తాయని. కాని సర్వాభరణముల మాట ఎలా ఉన్నా… దరిద్రం మాత్రం మీ వెంట వస్తుంది. కలహా ప్రదముగా ఉంటుంది. సంవత్సరమంతా కలిపురుషుడు మనతోనే ఉంటాడు. తద్వారా ఇంట్లో ఉండే శాంతి పోయి, అశాంతి నెలకొంటుంది. అనేక ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలహములు వస్తాయి. ఇవి అనేక దుర్భర పరిణామములకు దారితీస్తాయి.
సేకరణ: https://www.panditforpooja.com/blog/things-should-not-do-on-akshaya-tritiya/