సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పండితులు ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని భావితరాలకు అందించారు. ఆ స్తోత్రాన్ని చెప్తూ సూర్యదేవున్ని ఆరాధిస్తే.. పూజిస్తే వారిని అన్నీ శుభాలే జరుగుతాయి. ఉదయాన్నే కొందరికి సూర్య నమస్కారం చేయడం అలవాటు. అలాంటి వారు సూర్యడిని దర్శించి నమస్కరించే సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే సూర్యదేవుని ఆశిస్సులు మీకు ఎళ్లేవళలా ఉంటాయి.
జటిల వ్యాధినివారణ, దీర్ఘ కాలిక రుగ్మత నివారణ మరియు వంశవృద్ధి కొరకు శ్రీ సూర్య స్తోత్రము చక్కటి ఫలితమును ఇచ్చును.
ధ్యానం:
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం |
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః || ౫ ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః || ౬ ||
సకలేశాయ సూర్యాయ ఛాయేశాయ నమో నమః |
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం || ౭ ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ || ౮ ||
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౯ ||
1 Comment. Leave new
ధన్యవాదాలు