విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద అపరాజితా దేవిని పూజించి, శ్రీ శమీ ప్రార్ధన చేస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. శమీ శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
శమీ వృక్షము పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉన్నది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
శ్రీ శమీ ప్రార్ధన
(దశమ్యాం సాయాహ్నే శమీపూజాం కృత్వా-తదనంతరం ధ్యాయేత్)
శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || ౧ ||
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీమ్ |
ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీమ్ || ౨ ||
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే |
త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || ౩ ||
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది |
పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ || ౪ ||
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీమ్ |
దుఃస్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభామ్ || ౫ ||