శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం

Loading

Sri Devi Khadgamala Stotram

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

Sri Devi Khadgamala Stotram

సకల పాపాలు తొలగించి, సకల దుఃఖాలు తొలగించి నిత్యం మనల్ని రక్షించే, అపూర్వ స్తోత్రం శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో విన్న పఠించిన, సకల దోషాలు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది.

ఖడ్గమాలా స్తోత్రం పూర్తిగా శ్రీ చక్రం యొక్క వర్ణన. శ్రీ చక్రం లో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఆ తొమ్మిది ఆవరణలో ఉండే దేవతల స్తోత్రమే ఖడ్గమాల స్తోత్రం.

ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే శ్రీచక్రాన్ని ఉపాసించినటువంటి ఫలితం ఉంటుంది. వీటిని చదవాలంటే అక్షర దోషం లేకుండా నేర్చుకొని చదివితే మంచిది. అలాగే చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల సర్వ శక్తులు పీడా హరణం జరుగుతుంది. అంతేకాదు మన మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి.

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి,
శిరోదేవి, శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవికామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నేభేరుండేవహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి,
నిత్యానీలపతాకే, విజయే సర్వమంగళే, జ్వాలా మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి, షష్టిశమయి, ఉడ్డీశమయిచర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మచార్యమయి, ముక్తికేసీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి , వాసుదేవమయి, |

రత్నదేవమయి, శ్రీరామానందమయిఅణిమాసిద్దే, లఘుమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, సర్వకామసిద్దే , బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైశ్ణవి, వారాహిమాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ద్యా కర్షిణి, అహంకారా కర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపా కర్షిణీ, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యా కర్షిణి, స్మృత్యా కర్షిణి, నమామ కర్షిణి, బీజా కర్షిణి, ఆత్మా కర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వశా పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగ మదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాం కుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, |

గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంబిని, సర్వజృంబిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వ దవంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, సర్వసిద్ది ప్రదే, సర్వసంపత్ప్రతే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయని, సరార్ధసాదక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార స్వరూపే, |

సర్వపాప హరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫ్లప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని, వశిని కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణీని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరీ, మహాభగమాలిని, సర్వ సిద్డి ప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాబట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని , త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి , త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్దే త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహా మహాజ్ఞప్తే, మహా మహానందే, మహామహా స్కందే, మహా మహాశయే, మహా మహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమస్తే నమః ||

Dussehra, festivals, god, hindu tradition, lalitha devi, maha lakshmi, maha saraswati, sahasra namam, Saraswati
శ్రీ దుర్గా అష్టోత్తరం
లలితా సహస్రనామ – ఉత్తర పీఠిక

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.