శ్రీ ఆంజనేయ దండకం – Sri Anjaneya Dandakam

Loading

Sri Anjaneya Dandakam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

చాలా తరాల నుంచి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ప్రాచుర్యంలో ఉన్న దండకమే శ్రీ ఆంజనేయ దండకం. ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి సామర్థ్యాలు సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహము, సుగుణాలు, మహిమ, మొదలైనవి అన్ని కలగలిసిన దండకం ఈ ఆంజనేయ దండకం. ఇందులో సంస్కృత పదాలతో పాటుగా తెలుగు పదాలు కూడా ఇమిడి ఉండడం ఒక గొప్ప విశేషం. సంస్కృత పదాల వల్ల వచ్చే శబ్దశక్తి మరియు మంత్ర శక్తి అలాగే తెలుగు భాషలో ఉండే క్రియా పదాలు మరియు వాక్యాల వల్ల చదువుతున్న వారికి వింటున్న వారికి వెంటనే అర్థమయ్యేటువంటి భావ శక్తి కూడా ఉన్నది. ఈ రెండూ కలగలసిన శ్రీ ఆంజనేయ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన లేదా చదివిన వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే తీరుతాయని ప్రగాఢ విశ్వాసం.

శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజేవాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్
నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి
నీ మూర్తినిం గాంచి నీసుందరం బెంచి

నీ దాసదాసానుదాసుండనై రామభక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే
వేడుకల్ చేసితే నా మొరాలించితే
నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే
దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే
తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిన్ విచారించి
సర్వేశు బూజించి యద్భానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యద్దూమిజన్ జయానందముప్పొంగి
యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి

శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునిం జేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది వీరులన్ గూడి
యా సేతువున్ దాటి వానరుల్ మూకలై పెన్మూకలై
యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వైచి
యా లక్ష్మణున్ మూర్ఛ నొందింపగానప్పుడే
నీవు సంజీవినిం దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులన్ బోర
శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా
నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళనున్ విభీషణున్ వేడుకన్ తోడుకన్ వచ్చి
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి
శ్రీరాముకున్నిచ్చి యంతన్నయోధ్యాపురం జొచ్చి
పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు

మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్
పాపముల్బాయునే భయములున్ దీరునే
భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు
సంపత్తులున్ కల్గునో
వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార
యో ధీర యో వీర నీవే సమస్తంబుగా
నెంచి యా తారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్
స్థిరముగన్ వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై
ఎప్పుడున్ తప్పకన్ తలతు

నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు
త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్
రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్
భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్
గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి
ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీ దివ్యతేజంబునన్ జాచి రార నా
ముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి !
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే !
నమస్తే నమస్తే నమస్తే నమః

hanuman, Hanuman Jayanthi Festival, Hanuman Jayanti, Hanuman Mandala Deeksha, How to Perform Hanuman Puja
దుర్గాష్టమి వ్రతం ప్రాముఖ్యత – వ్రత విధానం, నియమాలు
జూన్ నెలలో తిరుమలకు వెళ్ళే భక్తులకు అలర్ట్…

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.