ఉగాది సింహ రాశి ఫలితాలు – Simha Rasi Phalalu 2024-25

Loading

ఉగాది సింహ రాశి ఫలితాలు - Simha Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది సింహ రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి [Sri Krodhi Nama Samvatsara Simha Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 02, వ్యయం – 14
  • రాజపూజ్యం – 02, అవమానం – 02

ఎవరెవరు సింహరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు సింహరాశి లోకి వస్తారు.

  • మఖ 4 పాదాలు (మ, మి, ము, మే)
  • పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
  • ఉత్తర 1వ పాదం (టె)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సింహరాశి ఫలాలు [Simha Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

సింహ రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : సంవత్సర ప్రారంభం నుండి 13-4-2024 వరకు అష్టమం , 17-7-2024 నుండి 16-9-2024 వరకు ద్వాదశం, జన్మం 17-11-2024 నుండి 15-12-2024 వరకు అర్ధాష్టమం. 15-3-2025 నుండి ఆఖరుకు అష్టమం.
  • కుజుడు: 23-4-2024 నుండి 1-6-2024 వరకు అష్టమం.
  • గురుడు: ఈ సం॥రం శుభుడే.
  • శని : ఈ సం||రం శుభుడే.
  • రాహువు : ఈ సం॥రం అష్టమం.
  • కేతువు: ఈ సం||రం శుభుడే.

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు పదవరాశిలో రాహువు అష్టమందుఉన్నందున సం॥రం ప్రారంభంనుండి పోరాట నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును శరీరములో ఆరోగ్యబాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానక రమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసినవి తప్పక పోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము, నెపముగా పరిణమించును. అనేక ఊహించని సంఘటనలుజరుగును. ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినా చివరకు ఆదాయం, రాజ్యపూజ్యత కొంతమేర కలిగించును. బంధుమిత్రాదులు యొక్క సహాయ సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివి తేటలు వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడుదురు. కళత్ర, సంతాన పీడలు, ధనవ్యయం, ప్రయాణాదులలోధననష్టం, చోరభయం, ప్రతీ విషయంలో ఆందోళన, భయంకలుగును, నేత్ర, కంఠ, హృదయబాధలుతప్పవు. ఏచి ఏ చిన్నకార్యము తలపెట్టినా ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకుసాగును. బంధుమిత్రవర్గంవారితో సమయస్పూర్థితో మెలగాలి.

ఊహించని అద్భుతసంఘటనలుజరుగును. కొన్నివిషయాలలో కొద్దిలో తప్పించు కొంటారు. ఆధ్యాత్మికముగా కూడా దైనందిన కార్యాలలో అభివృద్ధి కన్పించును. ఈ సం||రం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. రాహువు, శనుల ప్రభావంవల్ల అసంతృప్తి.వి.ఆర్.ఎస్. తీసుకోవాలి అనే ఆలోచన. మాటలలోనిలకడ ఉండదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వములలో పనిచేయువారికి సుదూర ప్రాంతములకు బదిలీలు, అధికారులు వల్ల ఇబ్బందులు. పర్మినెంటు కాని వార్కి ఈ సం॥ రం కూడా నిరాశే మిగులును. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు. కాని ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా లభించును. గృహనిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి. రాజకీయనాయకులకు ఈసం॥రం గడ్డుకాలమే అనిచెప్పవచ్చు. రాహువుబలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును. ప్రజలలో గుర్తింపు ఉండదు. అధిష్ఠానవర్గంలోనూ పేరుఉండదు. ఏపదవీవచ్చేఅవకాశం లేదు. ఉన్నపదవులను కోల్పోవుదురు. ఎన్నికలలో పాటీ చేసినా ఓటమి పాలగుదురు. అధిక ధనవ్యయం. స్థిరాస్తులనుపోగొట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండేది. నమ్మినవారే దగా చేయుదురు.

కళాకారులకు కూడా ఈ సం॥రం అనుకూలంగా ఉండదు. టి.వి సినిమా రంగంలోఉన్న గాయనీ,గాయకులు, నటీనటవర్గం, సాంకేతిక నిపుణులకు విజ యాలులభించక నూతన అవకాశాలుకోల్పోవుదురు. ఆర్థికంగా ఇబ్బందులు. మీ అవకాశాలు ఇతరులకు పోవును. అవార్డులలో కూడా మీకు అన్యాయం జరుగును. వ్యాపారులకు ఈ సం॥రం మిశ్రమంగా ఉండును. ఆశించినంత లాభాలురాక పోయినా నష్టములు రావు. సిమ్మెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహసంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది. బంగారం, వెండివ్యాపారులకునష్టాలు, సరుకులు నిల్వచేయువార్కి ఫర్వాలేదనిపించును. జాయింటు వ్యాపారాలు వారు భాగస్వా ములతో విభేదించి విడిపోవుదురు. ప్రభుత్వ, ప్రవేటు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులురాక నష్టాలు, నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవార్కిబాగుండును. గృహనిర్మాణరంగంలో ఉన్నవార్కిఅనుకూలమే. విద్యార్థులకు ఈ సం॥రం అనుకూలంగా ఉండును. జ్ఞాపకశక్తి పెరుగును. చదువుపైఉన్న శ్రద్ధ ఉంటుంది. చెడు స్నేహములు, ఇతర వ్యాపకములు వలన పరీక్షలలో మార్కులు స్వల్పంగా తగ్గునుఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, అసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొందినా కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు. వ్యవసాయదారులకు ఈ సం॥రం మొదటి పంటకంటే రెండవపంట ఫలిం చును. నిలద్రొక్కుకోలేరు. క్రొత్త ఋణములు చేయవలసి వచ్చును. కౌలుదార్లకు ఇబ్బందులే. గృహంలో అశాంతి విరోధాలుగాఉండును. చేపలు, రొయ్యల చెరువు లవార్కి విపరీతనష్టాలు. పంటవేయకపోవుట మంచిది. పౌల్ట్రీలవార్కినష్టములు.

స్త్రీలకు :- ఈ సం||రం అంతగా అనుకూలతఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటామాటాపట్టింపులు. విరోధాలు, ఏమిమాట్లాడినా విరోధమా? అను నట్లుండును. కొన్ని ముఖ్య సమస్యలు ఎదురగును. విలువైన వస్తువులుపోగొట్టు కొంటారు. దొంగలవల్లభయం, ఉద్యోగాలుచేయువార్కి దూరప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యంకూడా అంతంతమాత్రమే. శస్త్రచికిత్స, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ, పుత్రసంతానప్రాప్తి. వివాహంకానిస్త్రీలకు ఈసం॥ ప్రథమార్ధంలో అవకాశం లేదు. మొత్తంమీద ఈరాశి స్త్రీపురుషాదులకు గ్రహసంచారం మిశ్రమంగా ఉన్నందు వల్లఅన్నివర్గాలవార్కి ఇబ్బందులుతప్పవు. మీయొక్కశక్తిసామర్థ్యాలు, తెలివి తేటలు, ధైర్యసాహసాల ఫలితముండదు. ప్రతి చిన్నవిషయం యోచించి మసలు కోవలెను.

చేయవలసిన శాంతులు: ఈరాశివారుమంగళ, శనివారనియమాలుపాటించి, ఆరోజులలో శివాలయంలో రుద్రాభిషేకం, శ్రీశైలక్షేత్రసందర్శన, పంచాక్షరీ మంత్ర జపం చేసినమంచిది. రాహువుగ్రహ, శనిగ్రహయంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్: ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా లేనందున అన్నిరంగాల
వార్కియోగదాయకంకాదు. ప్రతీవిషయంలో వ్యతిరేకత, అలసట, శారీరక శ్రమ, అకాలభోజనం, బంధుమిత్రాదులతోవిరోధాలు, కుటుంబంలో అశాంతి, ప్రయాణా లందుఅసౌఖ్యం, ఇబ్బందులు, ఆరోగ్యభంగాలు, స్థానమార్పులులేదాగృహమార్పులు.

 

మే :- అన్నివిధాలుగా అన్నిరంగాలవార్కి బాగుంటుంది. ద్వితీయార్ధంలో చేయు వృత్తివ్యాపారాలందురాణింపు, ఆరోగ్యం బాగుండును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి నిచ్చును. రావలసినధనంసరైనసమయంలో చేతికందును. ఉత్సాహంగా, ఉల్లాసంగా ధైర్యంతోముందుకుపోగలరు. సంతాన, వాహనసౌఖ్యం, బంధుమిత్రాదులతో సఖ్యత,

జూన్ :- తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. కుటుంబంలో సఖ్యత, గృహజీవితానందం, నూతనవస్తు, వస్త్రప్రాప్తి, గృహంలోవివాహాది శుభకార్యాలు, మధ్యవర్తిత్వంనెరుపుట, గౌరవలాభం, మీ మాటకు విలువ పెరుగును. సంతానం ద్వారాఆనందం, సంతోషకర వార్తలువినుట, స్త్రీసౌఖ్యం, నూతన పరిచయలాభాలు.

జూలై:- ఈనెలలో అన్నిరంగాలవార్కి ప్రధమార్ధంలో బాగుంటుంది. తదుపరి ద్వితీ యార్ధంలో ఆదాయంనకు మించిన ఖర్చులే. ఆరోగ్యభంగాలు, బంధుమిత్ర విరోధాలు, ఉద్యోగులకు స్థానచలనం లేదా గృహమార్పులు తప్పవు. శారీరకశ్రమ, అకారణవిరోధాలు, సంతానం వల్లఇబ్బందులు, భార్యతో చిన్న చిన్న తగాదాలు.

ఆగష్టు:- ఈ నెలలో కూడా పరిస్థితులు అనుకూలించవు. అంతా వ్యతిరేకంగాను ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఏ పని చేయబుద్ధికాదు. ఆరోగ్యభంగాలు, నేత్ర, శిరోబాధలు, కావసినవారే అవమానింతురు. ఆర్ధిక సమస్యలు వెంటాడును. ఋణాలు చేయవలసి వచ్చును. సోదర విరోధములు, మాతృవంశి సూతకములు, పీడలు, నిద్రలేమి, కుటుంబ విరోధములు, దేహసౌఖ్యం లేకుండుట, ధనవ్యయం.

సెప్టెంబర్:- ఈనెలలో అన్నిరంగములవార్కి యోగమే. ఆదాయం బాగుండును. ధైర్యంగా ముందుకు పోగలరు. ఆరోగ్యం కుదుటపడును. పట్టుదలతోకార్యజయం. మనోధైర్యం వచ్చుట వల్ల పనులలో ముందంజ వేయుదురు. కుటుంబ సౌఖ్యం, స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు. దైవ సంబంధ కార్యములలో పాల్గొంటారు.

అక్టోబర్:- గత రెండు, మూడు నెలలుగా పడుచున్న బాధల నుండి ఉపశమనం పొందుదురు. చేయు వృత్తి వ్యాపారములలో రాణింతురు. ఆదాయం బాగుండును. ఆరోగ్యలాభం, కుటుంబసౌఖ్యం, భార్యాభర్తలమధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతానం కూడా వృద్దిలో వచ్చును. స్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్లో అనుకూలత.

నవంబర్:- యోగకారక గ్రహాలు, శుభస్థానములో ఉన్నందున అన్ని విధాలుగా లాభించును. ఆర్ధికంగా సంతృప్తి, పాతబాకీలువసూలగుట, స్నేహితులు మూల కంగా కొన్ని సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై ఆధిక్యత, సంతానసౌఖ్యం, కుటుంబ వ్యక్తుల సహాయ సహకారములు లభించును.

డిశంబర్:- ఈ నెలలో శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఒక్కోసారి మీ మాటలు ఉద్రేకంగా ఉండుటచే కార్యములందు ఆటంకములు. ఆర్ధిక ఇబ్బందులు ఊహించని సమస్యలు, అనుకోని ఖర్చులు, వాహన ప్రమాదములు, భార్యతోనూ కుటుంబ సభ్యులతోనూ మాటామాటా పట్టింపులు, ప్రయాణములందు కష్టములు.

జనవరి :- ఈ నెలలో 7,8 రాసులలో గ్రహసంచారంవల్ల అనుకూలత ఉండదు. ప్రతీ విషయంలో ప్రతికూలత. ధననష్టములు, ఊహించని సంఘటనలు, అపవా దులు, అవమానములు, బంధుమిత్రాదులతో సోదరులతో విరోధములు, రక్తం కళ్ళచూచుట, వాహనప్రమాదాలు, జాగ్రత్తగా ఉండేది. స్పెక్యులేషన్లో నష్టములు.

ఫిబ్రవరి :- ఈనెలయందు కొంతమేరపర్వాలేదు. ప్రథమార్ధంలో బాగుండక పోయినా ద్వితీయార్ధంలోరాణింపు ఉంటుంది. చేయు వృత్తివ్యాపారములందు అనుకూలత, సంతృప్తి, ఆర్ధికంగా నిలద్రొక్కుకుంటారు. మాట నిలుపుకొనే ప్రయ త్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, నూతన పరిచయలాభం.

మార్చి :- ఈ నెలలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ప్రతి పని యందు ఆటంకాలు, శారీరకశ్రమ, అకాల భోజనములు, త్రిప్పుట, శిరోవ్యాధులు, ఔషధసేవ, కుటుంబంలో అందరితోనూ విరోధములు, వాహనమార్పులు, గృహ మార్పులు, ఉద్యోగులకు బదిలీలు తప్పవు. విద్యార్థులకు చదువు పై పై ప్ర శ్రద్ధ ఉండదు.

Newborn Baby Horoscope

Newborn Baby Horoscope

350.00

Download Horoscope

Download Horoscope

500.001,000.00

Leo Rashiphal, Simha Rasi Phalalu, Simha Rasi Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2024-25, Ugadi Rasiphalalu, What is the future of Simha Rasi, Yearly Prediction for Leo
ఉగాది కన్యా రాశి ఫలితాలు – Kanya Rasi Phalalu 2024-25
ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2024-25

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.