హనుమంతుడికి మంగళవారానికి ఉన్న సంబంధం ఏమిటి?

Loading

Hanuman

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఎవరైనా గ్రహ దోషాలతో బాధపడితే ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారిని మంగళవారం నాడు లేదా శనివారం నాడు పూజిస్తూ ఉంటారు. ఈ కారణాల వల్లే మన సంస్కృతిలో మంగళవారానికి అదే విధంగా శనివారానికి హనుమంతుని విషయంలో ప్రత్యేక స్థానం ఉంది.

  • ఆంజనేయ స్వామి వారి జన్మించినటువంటి రోజు చైత్రమాస శుద్ధ పూర్ణిమ.
  • స్వామివారిని మంగళ మూర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు దీనికి అర్థం సంతోషాన్ని ఇచ్చేవాడు అని. అందుకే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు.
  • సాధారణంగా అంగారక గ్రహం లేదా కుజ గ్రహం ఎరుపువర్ణాన్ని కలిగి ఉంటుంది స్వామివారి ధరించేటువంటి సింధూరం కూడా అటువంటి వర్ణమునే కలిగి ఉండడం ఇక్కడ విశేషం.
  • గ్రహాల వల్ల ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు హనుమంతుడిని ప్రత్యేకంగా మంగళ మరియు శని గ్రహాల కోసం గుర్తు చేసుకుంటారు, అందుకే మన సంస్కృతిలో మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు ఉన్నాయి.
  • నిజమైన భక్తితో స్వామివారిని మంగళవారం నాడు లేదా శనివారం నాడు అర్చించే భక్తులకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు.
  • మంగళవారం నాడు మరియు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి, తమలపాకులతో ఆకు పూజ చేసి, వడమాల లేదా అప్పాల మాల సమర్పించిన యెడల తప్పక కోరికలు నెరవేరుతాయి.
  • శ్రీ హనుమంతుని భక్తులుగా ఉన్న వారికి నరఘోష మరియు బంధు ఘోష గ్రహ బాధలు తొలగి భూత ప్రేతాది శక్తులు దరిచేరకుండా రక్షణ ఇస్తాయి.