సోమవార వ్రతం

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఈ వ్రతాన్ని శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాలలో శుక్లపక్ష సోమవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. భక్త సులభుడు, కోరిన కోర్కెలను అడగగానే తీర్చే భోలాశంకరుడు మరియు మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసాన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈ వ్రతం ఎలా చేయాలంటే చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో స్నానం చేస్తూ ‘ఓం నమశ్శివాయ’ అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. స్నానంతరం శివపర్తవుల అష్టోత్తరం, అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి.