శమీ వృక్షం (జమ్మి చెట్టు) ప్రాశస్త్యం

Loading

Significance of Shami Puja

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.

జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీని వ్యవహార నామం ‘జమ్మి’. విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీదనే దాచారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. “ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి”. దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. “ఓం ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం సమర్పయామి”

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.

ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 12 వది.