పురాణాల ప్రకారం హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ ఒక పండుగ. ఈరోజు బంధువులు, స్నేహితులు, ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ గడుపుతారు. చిన్న, పెద్ద తేడా లేకుండా కోలాటాలు ఆడుతూ, నృత్యాలు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.. ఈ పండుగను హోలీ పండుగను కాముని పూర్ణిమ గా పిలుస్తూ కామ దహనం [Kama Dahanam] చేస్తారు. ఈ పండుగను తెలుగు నెలలోని సంవత్సరంలోని పాల్గొనమాసం లో వచ్చేపౌర్ణమి రోజు జరుపుకుంటారు.
కామదహనం ఎందుకు చేస్తారు ?
తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురిచేశాడట. దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే. పర్వతరాజైన హిమవంతుని కూతురే పార్వతి. వారిద్దరికీ పెళ్లి కుదిర్చితే వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగలుగుతాడు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు.నిత్యం తపస్సులో ఉండే శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు సమస్య అయింది. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు.
తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అయితే, అతడి భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని బతికించాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలిపాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. ఆనాటి నుండి వాడవాడలా మంటలు వేసి కామ దహనం చేసి, చెడు దహించి, మంచి కలగాలని కోరుకుంటారు .