ఆశ్వీయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి నాడు ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు.భాగవతం అష్టమ స్కంధంలో ధన్వంతరి గురించి వివరించ బడినది. పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి శ్రీ మహావిష్ణువు అంశగా ఉధ్బవించాడు ధన్వంతరి
విష్ణుదేవుని అంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి “ధన్వంతరి” అని పేరు పెట్టారు.
ధన్వంతరి గురించి మరో కథనం కూడా ఉంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకొన్నాడు. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
విక్రమాదిత్యుని ఆస్థానంలో “నవరత్నాలు”గా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ధన్వంతరి ఒకరని మరో కథనం. ఇతడు “ధన్వంతరి నిఘంటువు” అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ధన్వంతరి జయంతి రోజు చదవాల్సిన మంత్రం
నమామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం సకల ఔషధీనాం
ధన్వంతరి జయంతి రోజున, భగవంతుడు ధన్వంతరి జీని పూజిస్తారు. ఆయుర్వేద పాఠశాలలు కూడా ధన్వంతరి పూజ నిర్వహిస్తాయి. ఈ రోజున మందులు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఏదైనా మందులు మొదలైన వాటిని దానం చేస్తే, అతను/ఆమె ఏ వ్యాధితో బాధపడుతున్నా నయం అవుతారని నమ్ముతారు.