కార్తీకమాసం లో వచ్చే శుక్లపక్ష నవమిని ‘అక్షయ నవమి‘ అని అంటారు. ఈ రోజున ‘అక్షయ నవమి’ వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్యరాశి పెరిగి, సకల సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కొరకు ‘కూష్మాండుడు‘ అని పిలువబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించిన రోజే ఈ అక్షయ నవమి. ఈ రోజునే ‘కృతయుగం‘ ఆరంభమైన రోజుగా ‘సత్యయుగాది’గా పేర్కొంటారు.
అంతే కాకుండా ఈ రోజునే రాక్షస సంహారానికి అమ్మవారు వివిధ రూపాలు ధరించడానికి నాంది అని కూడా చెప్తారు.
లక్ష్మీ నారాయణుల సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మిని గాని నిలిపి, రావి, ఉసిరి, తులసి మొక్కలను ఉంచి పూజను చేయవలెను. ఈ విధంగా చేసే పూజను ‘జగద్ధాత్రి పూజ‘ అని పిలిచెదరు.
అక్షయ నవమి నాడు పఠించవలసిన స్తోత్రములు:-
విష్ణు విజయ స్తోత్రం
కనకధారా స్థవం
దుర్గా స్తోత్రం
లక్ష్మీ అష్టోత్తరం
నివేదనలు:- చక్కెర పొంగళి, దద్ధోజనం
పూజా ఫలితములు:- పాపరాశి ధ్వంసం, ధన లాభం, శత్రు నాశనం, అధికార ప్రాప్తి