CHAR DHAM YATRA

గంగా నది పుష్కర సందర్బంగా చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర

Char Dham Yatra

ఢిల్లీ – హరిద్వార్ – ఢిల్లీ

ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన గంగా నది పుష్కరాల సందర్బంగా చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా హరిద్వార్, రిషికేష్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాధ్ వంటి పవిత్ర మైన క్షేత్రాలతో పాటు గంగా నది జన్మ స్థలమైన గోముఖ్ ని పుష్కర సమయంలో దర్శించటం  జరుగుతుం

Poojalu.com వారు ఆర్ ఎం ట్రావెల్స్ బాపట్ల వారితో అనుసంధానమై ఈ  ప్యాకేజీ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి గోముఖ వంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.  ఈ యాత్ర మొత్తం RM Travels వారి ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. Poojalu.com కేవలం ఒక మాధ్యమంగా సేవలను అందిస్తుంది. యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలను కింద తెలుసుకోగలరు.

15 రోజులు 14 రాత్రులు

ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు (ఢిల్లీలో పికప్ చేసుకుని ఢిల్లీలో డ్రాప్ చేయడం జరుగును)

23 వ తేదీ ఏప్రిల్ 2023 . 8/27 సీట్లు నిండినవి.

Day 1
23-4-2023
ఢిల్లీ to హరిద్వార్

మొదటి రోజు ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్ట్ వద్ద పికప్ చేసుకుని హరిద్వార్ లోని హోటల్ వద్ద డ్రాప్ చేయడం జరుగుతుంది

Day 2
24 April 2023
హరిద్వార్
ఈరోజు ఉదయం హరికి పౌరి వద్ద గంగా నది పుష్కర స్నానమాచరించి మేము ఏర్పాటు చేసిన తెలుగు పురోహితుని పర్యవేక్షణ లో పితృ దేవతలకు పిండ ప్రధాన కార్యక్రమం ముగించుకుని మనసా దేవి మరియు చండి దేవి ఆలయం దర్శించుకుని
రాత్రి గంగా హారతి దర్శనం చేసుకోవడం జరుగుతుంది
రాత్రికి హరిద్వార్ లో విశ్రాంతి తీసుకుంటాము

Day 3
25 April 2023
హరిద్వార్ to రిషికేష్ to బార్కోట్
ఈరోజు ఉదయం హరిద్వార్ లోని హోటల్ నుంచి బయలు దేరి రిషి కేష్ లోని త్రివేణి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి ఉదయం 5:30 నుంచి 6:30 వరకు జరిగే గంగా హారతి దర్శనం చేసుకుని క్వీన్ ఆఫ్ ది హిల్స్ గా పిలువబడే ముస్సూరి లోని ప్రకృతి అందాలను వీక్షిస్తూ ప్రకాశ ఈశ్వర దేవాలయం దర్శించుకుని బార్కోట్ చేరుకుంటాము
రాత్రికి బార్కోట్ లోని హోటల్ లో విశ్రాంతి తీసుకుంటాము

Day 4
26 April 2023
యమునోత్రి
ఈరోజు ఉదయం బార్కోట్ లోని హోటల్ నుంచి బస్సు లో ప్రయాణం చేసి జానకి చట్టి చేరుకుంటాము ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ లేదా డోలి మరియు గుర్రాల సహాయం తో యమునోత్రి చేరుకుంటాము యమునోత్రి లో దర్శనం అయిన తరువాత తిరిగి జానకి చట్టి చేరుకుని జానకి చట్టి నుంచి బస్సు లో బార్కోట్ లోని హోటల్ కి చేరుకుని రాత్రికి విశ్రాంతి తీసుకుంటాము
(గమనిక డోలీ మరియు గుర్రాల ఖర్చులు యాత్రికులే భరించ వలసి ఉంటుంది)

Day 5
27 April 2023
బార్కోట్ to ఉత్తరకాశి to గంగోత్రి
ఈరోజు ఉదయం బార్కోట్ లోని హోటల్ నుంచి బయలు దేరి ఉత్తరకాశి లోని విశ్వనాధ ఆలయం దర్శించుకుని హార్సిల్ వాలి లోని ప్రకృతి అందాలను వీక్షించి సాయంత్రం గంగోత్రి చేరుకుంటాము గంగోత్రి లో పుష్కర స్నానమాచరించి గంగోత్రి ఆలయం దర్శనం చేసుకుని రాత్రికి గంగోత్రి లో విశ్రాంతి తీసుకుంటాము

Day 6
28 April 2023
గంగోత్రి
ఈరోజు ఉదయం గంగోత్రి లో పుష్కర స్నానమాచరించి మేము ఏర్పాటు చేసిన తెలుగు పురోహితుని పర్యవేక్షణ లో పితృ దేవతలకు పిండ ప్రధాన కార్యక్రమం ముగించుకుని గంగోత్రి ఆలయం దర్శనం చేసుకుంటాము

Day 6
గోముఖ్ యాత్ర ప్రారంభం
ఉదయం గంగోత్రి ఆలయం దర్శనం తరువాత గోముఖ్ వెళ్లే యాత్రికులు యాత్రలో భాగంగా 1 వ రోజు నడక మార్గం ద్వారా యాత్ర ప్రారంభించి భోజ్ బాస చేరుకుంటారు అక్కడ రూమ్స్ లో విశ్రాంతి తీసుకొని 2 వ రోజు గోముఖ్ దర్శనం చేసుకుని తిరిగి అదే రోజు భోజ్ బాస చేరుకుని అక్కడ రూమ్స్ లో విశ్రాంతి తీసుకుని 3 వ రోజు మధ్యాహ్నం గంగోత్రి చేరుకుంటారు

గోముఖ్ వెళ్ళని యాత్రికులు గంగోత్రి లో 3 రోజులు పాటు పుష్కర స్నానం మరియు గంగోత్రి ఆలయం దర్శనం చేసుకుని గంగోత్రి లోని వివిధ తీర్ధ ప్రదేశాలను దర్శించుకోవటం జరుగుతుంది

Day 6
28 april 2023
గంగోత్రి to భోజ్ బాస
ఈరోజు గోముఖ్ యాత్రలో భాగంగా యాత్రికులు ఉదయం గంగోత్రి ఆలయం దర్శనం తరువాత గంగోత్రి నుంచి అత్యంత అనుభవజ్ఞులైన గోముఖ్ గైడ్స్, వంట వాళ్ళు మరియు వంట సామాగ్రి తో బయలుదేరి నడక మార్గాన భోజ్ బాస చేరుకుని ఆరోజు కి అక్కడే రూమ్స్ లో విశ్రాంతి తీసుకుంటాము

Day 7
29 April 2023
గోముఖ్
ఈరోజు ఉదయం భోజ్ బాస నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గోముఖ్ చేరుకుంటాము పవిత్రమైన గంగా నది పుష్కర సమయంలో గంగా నది జన్మ స్థలమైన గోముఖ్ దర్శనం చేసుకోవడం జరుగుతుంది
దాదాపు 5 నుంచి 6 గంటల పాటు గోముఖ్ వద్ద గడిపి దర్శనం,జపం మరియు ధ్యానం మొదలైన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రానికి భోజ్ బాస చేరుకుంటాము ఆ రోజు అక్కడే రూమ్స్ లో విశ్రాంతి తీసుకుంటాము

Day 8
30 april 2023
భోజ్ బాస to గంగోత్రి

ఈరోజు ఉదయం భోజ్ బాస నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం గంగోత్రి చేరుకుంటాము గంగోత్రి ఆలయం దర్శనం తరువాత రాత్రికి గంగోత్రి లో విశ్రాంతి తీసుకుంటాము

Day 9
1 may 2023
గంగోత్రి to అగస్త్య ముని to గుప్త కాశి

ఈరోజు ఉదయం గంగోత్రి నుంచి బయలుదేరి మార్గం మధ్యలో అగస్త్య మహాముని ఆలయం దర్శించి గుప్త కాశి చేరుకుని అక్కడ విశ్వనాధ ఆలయం దర్శించి రాత్రి కి సోన్ ప్రయాగ్ లో విశ్రాంతి తీసుకుంటాము

Day 10
2 may 2023
సోన్ ప్రయాగ్ to కేదార్ నాధ్
ఈరోజు కేదార్ నాధ్ యాత్రలో భాగంగా ముందు గా మన హోటల్ నుంచి బస్సు లో సోన్ ప్రయాగ్ చేరుకుంటాము సోన్ ప్రయాగ్ నుంచి లోకల్ టాక్సీ లో గౌరికుండ్ చేరుకుని అక్కడ అక్కడ నుంచి 16 కిలోమీటర్లు నడుచుకుంటూ లేదా డోలి మరియు గుర్రాల సహాయం తో కేదార్ నాధ్ చేరుకుంటాము లేదా పాఠా నుంచి హెలికాప్టర్ ద్వారా కేదార్ నాధ్ చేరుకుని కేదార్ నాధ్ ఆలయం దర్శించుకుని రాత్రికి కేదార్ నాధ్ లోనే విశ్రాంతి తీసుకుంటాము

(గమనిక లోకల్ టాక్సీ,డోలి,గుర్రాలు మరియు హెలికాప్టర్ ఖర్చులు యాత్రికులే భరించవలెను)

Day 11
3 may 2023
కేదార్ నాధ్ to సోన్ ప్రయాగ్ to సారి
ఈరోజు ఉదయం 4 నుంచి 7 వరకు జరిగే అభిషేకం లో పాల్గొని దర్శనం చేసుకుంటాము దర్శనం తరువాత 600 మీటర్స్ దూరం లో వున్న కాల భైరవ ఆలయం దర్శనం చేసుకుని నడుచుకుంటూ కాని డోలి,గుర్రాలు సహాయంతో కాని లేదా హెలికాప్టర్ లో ప్రయాణించి యాత్రికులు సోన్ ప్రయాగ్ మరియు పాటా కి చేరుకుని అక్కడ నుండి బస్సు లో ప్రయాణం చేసి సారి లోని హోటల్ కి చేరుకుని ఆరోజు విశ్రాంతి తీసుకుంటారు
(గమనిక హెలికాప్టర్, డోలి లు మరియు గుర్రాల ఖర్చులు యాత్రికులే భరించవలెను)

Day 12
4 may 2023
సారి to బద్రీనాథ్

ఈరోజు ఉదయం సారి లోని హోటల్ నుంచి బద్రీనాథ్ కు యాత్ర ప్రారంభిస్తాము మార్గం మధ్యలో ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ ఆలయం మరియు పంచ ప్రయాగ లలోని రుద్రప్రయాగ మరియు విష్ణుప్రయగ దర్శించి సాయంత్రానికి బద్రీనాథ్ చేరుకుని బద్రీనాథ్ ఆలయం దర్శించి రాత్రికి బద్రీనాథ్ లోనే విశ్రాంతి తీసుకుంటాము

Day 13
5 may 2023
బ్రహ్మకపాలం,సరస్వతి నది, మరియు వసుధారా

ఈరోజు ఉదయం ముందు గా తప్త కుండ్ లో స్నానం చేసి బ్రహ్మ కపాలం లో మేము ఏర్పాటు చేసిన తెలుగు పురోహితుని పర్యవేక్షణ లో పితృ దేవతలకు పిండ ప్రధాన కార్యక్రమం ముగించుకుని బద్రీనాథ్ ఆలయం దర్శనం చేసుకుంటాము దర్శనం తరువాత సరస్వతి నది మరియు వసుధార దర్శిస్తాము తిరుగు ప్రయాణం లో వ్యాస మహర్షి గుహ,వినాయక స్వామి గుహ చూసి రాత్రి బద్రీనాథ్ లోనే విశ్రాంతి తీసుకుంటాము

Day 14
6 may 2023
బద్రీనాథ్ to రిషికేష్
ఈరోజు ఉదయం బద్రీనాథ్ నుంచి బయలుదేరి మార్గం మధ్యలో నంద ప్రయాగ, కర్ణప్రయగ,దేవ ప్రయాగ మరియు ధారి దేవి ఆలయం దర్శించి సాయంత్రానికి రిషికేష్ చేరుకుని రామ్ జూల,లక్ష్మణ్ జూల వీక్షణ తరువాత రాత్రి త్రివేణి ఘాట్ లో గంగా హారతి దర్శించటం జరుగుతుంది గంగా హారతి దర్శనం తరువాత
రాత్రి రిషికేష్ లోని హోటల్ లో విశ్రాంతి తీసుంటాము

Day 15
7 may 2023
రిషికేష్ to ఢిల్లీ
ఈరోజు ఉదయం రిషికేష్ లోని హోటల్ నుండి ఢిల్లీ కి బయలుదేరుతాము మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ వద్ద మిమ్మల్ని సురక్షితంగా డ్రాప్ చేయడం జరుగుతుంది

  • హరిద్వార్ లో ఒకరోజు
  • రుషికేశ్ లో ఒకరోజు
  • గంగోత్రి లో నాలుగు రోజులు

రోడ్డు ప్రయాణాలు కొరకు 2+2 లగ్జరీ పుష్‌బ్యాక్ బస్సు, కేదార్నాథ్ లో హెలికాప్టర్  సౌకర్యం కలదు వానికి చార్జీలు అదనం.

ముగ్గురుకి కలిపి సుచి శుభ్రం మరియు గీసర్ సదుపాయం గల రూమ్స్ ఇవ్వబడును.

ప్రతి రోజు ఉదయం టీ, టిఫిన్ 1 లీటర్ వాటర్ బాటిల్ మరియు రెండు పూటల బ్రాహ్మణ భోజనం పెట్టబడును

పుష్కర తీర్ధంలో పిండ ప్రదానం చేస్తే, సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే.. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యాత్రలో పిండ ప్రధాన కార్యక్రమం చేయడానికి భాషాయిబ్బంది కలుగకుండా తెలుగు పురోహితులు గారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది

  • ప్యాకేజీ ఒకరికి 33,600 రూపాయలు (అన్ని చార్జీలు కలిపి)
  • చార్ధామ్ తో పాటుగా గోముఖ కూడా దర్శనం చేసుకునే వారికి ప్యాకేజీ ఒకరికి 36,400 రూపాయలు (అన్ని చార్జీలు కలిపి)

గమనిక:  ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగా నది పుష్కరాలకు భక్తులు లక్షలాదిగా రావడం జరుగుతుంది కావున పుష్కర కాలం సమీపించే కొద్దీ హోటల్ మరియు రూమ్స్ మొదలైన అద్దెలు పెరిగే అవకాశం వున్నది ఇవి ముందుగా బుక్ చేసుకుంటే సాధారణ ధరకు అందుబాటులో ఉంటాయి కావున వీలైనంత త్వరగా అడ్వాన్స్ ఇచ్చి మీ సీట్ రిజర్వ్  చేసుకోగలరు.

  • అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఒకవేల మీరు యాత్ర రాదల్చుకోకపోతే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వబడదు
  • యాత్ర ముగిసిన తరువాత డ్రైవర్ కి 100 మరియు వంటవారికి 200 ఇవ్వవలెను
  • యాత్రికులు ఈ యాత్రకు అవసరమైన స్వెట్టర్,మంకీ కాప్,సాక్స్,గ్లౌజస్ మరియు షూస్,ఫ్లాస్క్ తమ వెంట తెచ్చుకోవలెను
  • బస్సు వెళ్ళని చోట,కేదార్ నాధ్ మరియు యమునోత్రి యాత్రలో గుర్రం, డోలి మరియు టాక్సీ ఖర్చులు యాత్రికులే భరించవలెను
  • కంపెనీ వారు బహు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వ్యక్తుల యొక్క పొరపాట్లు వలన కాని లేదా ప్రకృతి విపత్తుల వలన జరుగు పరిణామలకు కంపెనీ వారు బాధ్యులు కారు
  • ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ యాత్ర 15 రోజుల లో పూర్తి అవుతుంది ఒకవేల ప్రకృతి వలన ఏర్పడిని కారణాలకు రోడ్ డామేజ్ అయితే రోడ్ మరమ్ముతుల నిమిత్తం బస్సులు వెళ్ళటానికి అనుమతి ఇవ్వరు (ఈ విధంగా 99 % జరగదు మిగిలిన 1 % జరిగే అవకాశం వున్నది ) ఇలాంటి సందర్భం లో యాత్ర యొక్క రోజులు పెరిగే అవకాశం వున్నది ఇలాంటి సందర్భం లో ఆ ప్రదేశం లో అయ్యే రూమ్స్ ఖర్చులు (ఆ ప్రాంతం బట్టి రూమ్ ఖర్చులు ) మరియు భోజనానికి అయ్యే ఖర్చులు సుమారుగా 1200/- ఒకరోజుకి ఒకమనిషికి ఇవ్వవలసి ఉంటుంది

గంగా నది పుష్కర సందర్బంగా చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర

గోముఖ్ క్షేత్ర ప్రాశస్త్యం:

కపిల మహర్షి కోపాగ్ని కి లోనైయిన తన పూర్వీకులకు సద్గతులు కలిగించాలి అని సంకల్పించిన భగీరతుడు దేవ లోకం లో వుండే గంగా నది తోనే అది సాధ్యం అవుతుంది అని గంగ ను భూమి పైకి తీసుకురావడానికి బ్రహ్మ దేవుని కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు తపస్సు కి ప్రసన్నుడు అయిన బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యి నీ కోరిక నెరవేరుతుంది అయితే ఆకాశం నుండి మహోధ్రుతంగా కిందికి దూకే గంగ ను భూమి భరించలేదు ఆ పరమశివుడు మాత్రమే నియంత్రిచగలడు పరమ శివుని కోసం తపస్సు చేయమని చెప్తాడు భగీరతుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా తపస్సు కి ప్రసన్నుడైన పరమ శివుడు భగీరతుని కోరిక మేరకు ఆకాశం నుంచి ఉదృతం గా ప్రవహించే గంగా ప్రవాహాన్ని తన తలపై ఒడిసిపట్టి తన జటాజూటాల ద్వారా హిమాలయ కొనల మీదుగా మొట్ట మొదటి గా భూమి మీదకు దింపిన ప్రదేశమే ఈ గోముఖ్ గంగా నది జన్మ స్థలం ఇక్కడ నుంచే గంగా నది ఆవిర్భావం జరుగుతుంది గోముఖ్ నుంచి గంగోత్రి వరకు వచ్చిన ఈ గంగా ప్రవాహం అప్పుడే పుట్టిన తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువు లాంటిది అని చెప్తారు ఎందుకంటే గోముఖం నుంచి గంగోత్రి చేరేవరకు ఈ ప్రవాహంలో నీటికి ఎక్కడా కూడా మానవ స్పర్శ అంటదు ఎంతో మంది హిందువుల కల అయినటువంటి గోముఖ్ దర్శనం ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన గంగా నది పుష్కర కాలంలో దర్శనం చేసుకోవడం అనేది అత్యంత పుణ్య ప్రదంగా చెప్పవచ్చు.

గంగా నది పుష్కర సందర్బంగా చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర

Related Yatra Services