పూజా వివరములు
మాఘ శుద్ధ పాడ్యమి లగాయత్తు అనగా ది 02-02-2022 బుధవారం ఉదయం నుంచి పూజాది కార్యక్రములుప్రారంభమగును. శ్రీ త్రిచ మహా సౌర అరుణ పారాయణ సహిత సూర్య నమస్కారములులో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనము, మహా సంకల్పము, శ్వేత తండుల చూర్ణంతో సౌరయంత్ర స్థాపన, త్రిచ-మహాసౌర-అరుణ పారాయణా పూర్వక సూర్య నమస్కారములు, సూర్య తర్పణలు, అధాంగ-అష్టోత్తర షోడశోపచార పూజలు, నీరాజన మంత్రం పుష్పములు. ప్రసాద వితరణ.
మా పురోహితులచే నిర్వహించబడిన సూర్యనమస్కారాల యంత్ర నమూనా చిత్రములు…
Related
పూజా ప్రాంతం
ఏడు గుఱ్ఱాలు పూన్చిన రథాన్ని అధిరోహించి, నిరంతర సంచారం చేసే కశ్యపాత్మజుడైన సూర్యుని యొక్కజన్మ తిధే ఈ రథసప్తమి.
స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర మాఘ శుద్ధ పాడ్యమి లగాయత్తు అనగా ది 02-02-2022 బుధవారం నుంచి ది 03-03-2022 గురువారం వరకు మాఘమాసం కలదు. మాఘ మాసం పురస్కరించుకుని అందరికీ ఆయురారోగ్యలు కలగాలని కోరుతూ శ్రీ త్రిచ మహా సౌర అరుణ పారాయణ సహిత సూర్య నమస్కారములు ఆంధ్రప్రదేశ్ నందు ప్రముఖ క్షేత్రములైన పంచారామములలో ఒకటైన కుమారభీమారామము (సామర్లకోట) నందుగల శ్రీ విద్యా సంతోషి నిలయము పీఠంలో జరుపబడును.
Related
Reviews
There are no reviews yet