పంచారామ క్షేత్రాలు అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ నందు ఉన్నటువంటి ఐదు పరమేశ్వర క్షేత్రాలను పంచారామ క్షేత్రాలు అని పిలుస్తారు. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి వారు సంహరించినప్పుడు ఆ తారకాసుని నోటిలో ఉన్నటువంటి శివలింగము చిన్నమై ఐదు ప్రదేశాలలో పడిందని, ఆ ఐదు ప్రదేశాలని పంచారామ క్షేత్రాలు అని పిలుస్తారు అని మనందరికీ తెలుసు. అవే..
- కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామము
- కాకినాడ జిల్లాలోని కుమార భీమారామము
- పశ్చిమగోదావరి జిల్లాలోని క్షీరా రామము
- భీమవరంలోని భీమారామము
- పలనాడులోని అమరారామము
సామర్లకోట – కుమారభీమారామము ఆలయం
అయితే కాకినాడ జిల్లాలోని సామర్లకోట వద్ద పరమేశ్వరుడు శ్రీ భీమేశ్వరునిగాను అలాగే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈ కుమార భీమారామ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఇక్కడ పరమేశ్వరుని యొక్క శివలింగం 14 అడుగుల ఎత్తైన రెండంతస్తుల మండపంగా ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని చాళుక్యరాజైనటువంటి భీముడు నిర్మించాడు అని, స్థలపురాణం ద్వారా అర్థమవుతున్నది. అందుచేతనే ఈ క్షేత్రం చాళుక్య భీమారామంగా ప్రసిద్ధి చెందినట్లుగా భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి అర్థమవుతున్నది.
మూతపడనున్న సామర్లకోట కుమారభీమారామం ఆలయం
అయితే శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన గర్భాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించడం జరిగినది. కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఉన్న ఈ మహా క్షేత్రం యొక్క శివలింగం జీర్ణోద్ధరణ చేయవలసినది అన్న ఉద్దేశంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సూచనలు మేరకు, అదేవిధంగా శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి విజయవాడ వారి యొక్క అనుమతి మరియు ఉత్తర్వుల మేరకు, ఈ దేవస్థాన వంశపారపర్య అర్చకులు మరియు బ్రహ్మ గారి యొక్క సూచనలను అనుసరించి మే 29 2024 బుధవారం నుంచి జూన్ 8వ తేదీ 2024 శనివారం వరకు శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయమును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం జరుగును. కావున ఈ ప్రధాన గర్భాలయమును మూసివేసి స్వామి వారి యొక్క జీర్నోదరణ కార్యక్రమములు వారు ప్రారంభించుట జరుగును.
సామర్లకోట భీమేశ్వర స్వామి గర్భాలయం మూసేస్తే మరి పూజలు ఎలా?
శివలింగం జీర్ణోద్ధరణ దృష్ట్యా.. సామర్లకోట కుమారభీమారామం గర్భాలయం తాత్కాలికంగా మూసివేస్తున్నందున, మరియు భీమేశ్వర స్వామి వారు అదే విధంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దర్శనము నిలుపు చేయుచున్నందుకుగాను స్వామి వారి యొక్క నంది మండపంలో శ్రీ స్వామి వారు మరియు అమ్మవార్ల యొక్క ఉత్సవ మూర్తుల దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున భక్తులందరూ దీనిని గమనించి ప్రధాన క్షేత్రమైనటువంటి ఈ సామర్లకోట పంచారామ క్షేత్ర దర్శనానికి వచ్చేటువంటి భక్తులు దీనిని గమనించవలసిందిగా కోరడం అవుతున్నది.
శ్రీ స్వామివారి యొక్క నిత్యాన్నదానం యధావిధిగా కొనసాగి, స్వామి వారి యొక్క ప్రసాదం అందరికీ అందజేయడంలో ఎటువంటి ఆటంకం లేదు అని కార్యనిర్వాహణాధికారి వారు తెలపడం జరిగింది.