శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలితాలు [Sri Viswavasu Nama Samvatsara Telugu ఉగాది Rasi Phalalu 2025 – 2026] లో మేష రాశి, వృషభ రాశి, మిథున, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి ల వారికి రాశిఫలాలు(Rasiphalalu 2025) మరియు ఆదాయ-వ్యయాలు ; రాజ్యపూజ్య-అవమానాలు కింది విధంగా తెలుపబడ్డాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం 2025 – 2026
Sri Viswavasu Nama Samvatsaram Telugu Panchangam
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆదాయ-వ్యయాలు & రాజ్యపూజ్య-అవమానాలు
మేష రాశి
- ఆదాయం – 2, వ్యయం – 14 & రాజపూజ్యం – 05, అవమానం – 07
- నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.
వృషభ రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05& రాజపూజ్యం – 01, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
మిథున రాశి
- ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 04, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: మృగశిర 3, 4, పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు.
కర్కాటక రాశి
- ఆదాయం – 08 , వ్యయం – 02 & రాజపూజ్యం – 07, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు.
సింహ రాశి
- ఆదాయం – 11, వ్యయం – 11& రాజపూజ్యం – 03, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం.
కన్య రాశి
- ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 06, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: ఉత్తర 2, 3 , 4 పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త 1,2 పాదాలు.
తుల రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05& రాజపూజ్యం – 02, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: చిత్త 3,4 పాదాలు, స్వాతి పాదాలు నాలుగు పాదాలు, విశాఖ 3 పాదాలు.
వృశ్చిక రాశి
- ఆదాయం – 02, వ్యయం – 14 & రాజపూజ్యం – 05, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: విశాఖ 4 పాదం, అనూరాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు.
ధనుస్సు రాశి
- ఆదాయం – 05, వ్యయం – 05 & రాజపూజ్యం – 01, అవమానం – 05
- నక్షత్రాలు- పాదాలు: మూల నాలుగు పాదాలు, పూర్వాషాడ నాలుగు పాదాలు, ఉత్తరాషాడ 1 పాదం.
మకర రాశి
- ఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం –05 నక్షత్రాలు- పాదాలు: ఉత్తరాషాడ 2, 3, 5 పాదాలు, శ్రవణ నాలుగు పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం.
కుంభ రాశి
- ఆదాయం – 08, వ్యయం – 14 & రాజపూజ్యం – 07, అవమానం–05
- నక్షత్రాలు- పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నాలుగు పాదాలు, పూర్వాషాడ 1, 2, 3పాదాలు.
మీన రాశి
- ఆదాయం – 05, వ్యయం – 05 & రాజపూజ్యం – 03, అవమానం – 01
- నక్షత్రాలు- పాదాలు: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు.
విశ్వావసు సంవత్సరంలో మన దేశంలో గోచరమగు సూర్యగ్రహణములు లేవు.
మొదటి చంద్ర గ్రహణము 07-09-2025 ఆదివారం రాత్రి
07-09-2025 భాద్రపద పూర్ణిమా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశివారు దీనిని వీక్షించగూడదు. మరుసటి రోజు యధావిధి చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను.
గ్రహణ స్పర్శకాలం రాత్రి గం.9.50ని.లు
ఉన్మీలన కాలం రాత్రి గం.10.580.లు
గ్రహణ మధ్యకాలం రాత్రి గం.11.410.లు
విమీలన కాలం రాత్రి గం.12.240.లు
సంపూర్ణ చంద్ర గ్రహణం
గ్రహణ మోక్షకాలం రాత్రి గం.1.31ని.లు, ఆద్యంత పుణ్యకాలం గం. 3.410.లు
రెండవ చంద్రగ్రహణము 3-3-2026 మంగళవారం
సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడు చంద్రగ్రహణం
ది.3-3-2026 ఫాల్గుణ పూర్ణిమా మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. ఇది కేతుగ్రస్తము. గ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇది సంపూర్ణ గ్రహణమైవమా సాయంత్రము గం.6.20 ని.లకు చంద్రోదయమైన తర్వాత 27 నిముషములు మాత్రమే కన్పించు అవకాశము కలదు. మధ్యాహ్నం గం.3.20ని.లకు గ్రహణ స్పర్శ కల్గును, తదుపరి సాయంత్రం గం.4.30ని.లకు సంపూర్ణ గ్రహణము ప్రారంభమై సా.గం.5.32వి.లకు సంపూర్ణ గ్రహణం పూర్తి అగును. (అయితే ఇది కన్పించదు.) చంద్రుడు క్షితిజముపైకి వచ్చుసరికి పాక్షిక గ్రహణం విడుపు మాత్రమే కన్పించును. పుబ్బ నక్షత్రములో ఈ గ్రహణము సంభవించును. కావున సింహరాశి వారు మరుసటి రోజు యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను. గ్రహణ స్పర్శ కనబడదు. ఈశాన్య దిక్కులో మోక్షం కన్పించును. స్వల్పగ్రహణం.
గ్రహణ స్పర్వకాలం ప.గం.3.20 (కనిపించదు)
మధ్యకాలం సా.గం.5.03ని.లు
చంద్రోదయం సా.గం.6.090.లు
గ్రహణ మోక్షకాలం సా.గం.6.470.లు