మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టారా… సమయానికి పురోహితుడు అందుబాటులో లేరా.. అయితే Pandit Poojalu Services సంస్థను Online లో సంప్రదించండి మీ సమస్య కు పరిష్కారం దొరుకుతుంది. ముహూర్తాలు పెట్టడానికి (to fix muhurtham).. ఇతర శుభకార్యాలు జరిపించాలంటే అయ్యగారిదే ప్రధాన భూమిక. ప్రత్యేక పూజలు, హోమాలు ఇతర పూజలు చేయించుకోవాలని అనుకొనేవారు Online లో సంప్రదిస్తే చాలు మీ పని ఇట్టే అయిపోతుందంటున్నారు Poojalu.com వెబ్ రూపకర్త రవికుమార్ శర్మ పెండ్యాల. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవిదేశాలకూ సేవలు విస్తరించారు.
- శుభకార్యాలకు ఆన్ లైన్ పండిత్ సర్వీసెస్
- అయ్యగారు కావాలంటే పూజలు.కాం
- బుక్ చేసుకొంటే సేవలు మీ దరికి…
- దేశ విదేశాలలో వారికీ అందుబాటులో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన రవికుమార్ శర్మ పెండ్యాల హైదరాబాదు కేంద్రంగా Poojalu.com వెబ్ ద్వారా పౌరోహిత్యం సేవలను అందిస్తున్నారు. వివిధ పూజలకు పండితులను వెబ్ ద్వారా అందచేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ 2014 నుంచి దాదాపు 500 మంది పురోహితులను అందుబాటులో ఉంచింది. ప్రత్యేక పర్వదినాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పూజలను నిర్వహించాలనుకునే వారు ముందుగా ఈ సైట్ లో బుక్ చేసుకొనవచ్చును.
Social Media ద్వారా క్రతువులు..
వివిధ దేశాలలో పండితులు అందుబాటులో ఉన్నా.. కొన్ని ప్రాంతాలలో మాత్రం పూజారులు అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారం Poojalu.com వారు WebCam ల ద్వారా పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా ముస్లిం దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. పూజలు నిర్వహించుకొనే వారికి WebCam లో పండితులు మంత్రాలు చదువుతూ సూచనలు చేస్తారు. వీటిని ఫాలో అవుతూ పూజా కార్యక్రమాలు చేస్తారు క్లయింట్స్.
అందరికీ అందుబాటులో పూజారులు..
పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో వేదపండితుల కొరత ఉంది. ఈ నేపద్యంలో శాస్త్రం తెలిసిన పండితులు దొరకడం కష్టంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి Poojalu.com Online Website ను ప్రారంభించాం. Social Media వేదికగా పూజలు చేయిస్తాం.
అంతా ఆన్ లైన్ బుకింగ్ (Online Pandit Booking)..
వేదపండితులను Online ద్వారా బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో Standard, Premium వంటి ఆప్షన్ లు కూడా ఉంటాయి. ఒకవేళ పూజా సామాగ్రితో సహా పంతులు కావాలంటే (Pandit with Puja Material) ఇందుకు సైతం ఆప్షన్ లు ఉంటాయి. తెలుగు పంతుళ్ళు మాత్రమె కాదు ఉత్తర భారతీయుల కోసం హిందీ పండితులను (North Indian Pandits) కూడా ఈ Website లో ఉన్నారు. అంతే కాకుండా బ్రాహ్మణుల గూర్చి ప్రత్యేకంగా ఇంట పూజాది కార్యక్రమాలకు వేద పండితులతో పాటుగా క్యాటరింగ్ సేవలూ (Brahmin Catering Services) అందుబాటులో ఉన్నాయి.
Published link: http://epaper.sakshi.com/1437256/Hyderabad-District/20-11-2017#page/10/2