సింహాద్రి అప్పన్న దర్శనం తర్వాత చూడవలసినవి – సింహాచలం సమీపంలో సైట్ సీయింగ్
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిగా పిలవబడేటువంటి సింహాద్రి అప్పన్న స్వామి వారి యొక్క దర్శన అనంతరము, చుట్టుపక్కన ఉప ఆలయాలు మరియు అనేక ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. సింహాచల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వెళ్లినటువంటి భక్తులు వీటిని కూడా దర్శించడం ఉత్తమం. కావున ఆ దర్శనీయ ఉప ఆలయాలను కూడా కింద వివరరంగా ఇవ్వడం జరుగుతోందిది.
సింహాచలం దేవస్థానం కొండ పైన మరియు కింద చూడవలసినవి:
- ఆండాళ్ సన్నిధి (గోదాదేవి)
- సింహవల్లీ తాయారు సన్నిధి
- లక్ష్మి నారాయణ సన్నిధి
- త్రిపురాంతక స్వామి ఆలయం
- కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం
- శ్రీ సీతారామస్వామి ఆలయం
- గంగాధర
- అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి
- కొండ దిగువన వరాహ పుష్కరిణి
- కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం
- కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం
- సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి
- వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు
సింహాచల దేవస్థానం సమీపంలో చూడదగ్గ సైట్ స్పాట్స్ (సైట్ సీయింగ్)
సింహాచలంలో స్వామివారి యొక్క దర్శనం అనంతరం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు అనేకనేకం ఉన్నాయి. సింహాచలం ఆలయానికి సుమారుగా 50 కిలోమీటర్ల లోపు ఇంచుమించు 25 కు పైగానే సందర్శించదగ్గ ప్రాంతాలు ఉన్నాయి వాటి వివరాలు కిందన సవివరంగా ఇవ్వడం జరిగింది.
- రామకృష్ణ బీచ్: ఆర్కే బీచ్ పిలవబడేటువంటి ఈ యొక్క సాగర తీరం విశాఖపట్నం ప్రాంతానికే తలమానికంగా ఉంటుంది రామకృష్ణ బీచ్ వద్ద ప్రతినిత్యం అనేక వందల మరియు వేల సంఖ్యలో సందర్శికులు ఆటవిడుపుగా సాగర తీరంలో తమ యొక్క సమమయాన్ని గడుపుతారు.
- రిషికొండ బీచ్: అద్భుతమైనటువంటి సాగర తీరం కలిగినటువంటి విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ ప్రాంతం ఒకటి దీనిని సాధారణంగా వైజాగ్ బీచ్ అని కూడా పిలుస్తుంటారు.
- మల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం: ఈ ఆలయం స్వామివారి ప్రత్యేకమైనటువంటి ఆలయాలలో ఒకటి. ఇది విజయనగరం జిల్లాకు దగ్గర్లో ఉంటుంది.
- మత్స్య దర్శిని అక్వేరియం: రామకృష్ణ బీచ్ సమీపంలో ఈ మధ్య దర్శిని అక్వేరియం అను ప్రాంతం అత్యంత ఆకర్షణీయంగా అనేకనేక సముద్ర సంతతికి చెందినటువంటి మత్స్య జాతుల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- విశాఖ మ్యూజియం దీనినే విశాఖ మారీ టైం మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇందులో పురాతన కాలానికి చెందిన అనేక వస్తువులను మనం చూడవచ్చు.
- తెన్నేటి పార్క్: విశాఖపట్నంలో సుదూరంగా ఉన్నటువంటి ఈ తెన్నేటి పార్క్ అత్యంత సుందరమైనటువంటి పార్క్ గా భావించవచ్చు.
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విజయనగరానికి సమీపంగా ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర ఆలయం లో వెంకటేశ్వర స్వామి వారి కొలువై నిత్యం అనేక వందలాది మందికి తన యొక్క దర్శనాన్ని ఇస్తున్నారు.
- యారాడ బీచ్: సహజంగా ఏర్పడినటువంటి సుందరమైనటువంటి సముద్ర తీరమే ఈ యారాడ బీచ్.
- పైడితల్లి అమ్మవారు ఆలయం: స్థానికంగా పైడితల్లమ్మ అని పిలవబడేటువంటి ఈ అమ్మవారి యొక్క ఆలయం హిందూ దేవాలయాలలో అత్యంత పవిత్రమైనది ఇది విజయనగరం వద్ద ఉన్నది.
- ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్: ఈ సుందరమైనటువంటి పార్క్ విశాఖపట్నం 12 కిలోమీటర్ల దూరంలో పర్యాటకలను ఆకర్షిస్తూ ఉంటుంది.
- గంట స్తంభం: దీనిని క్లాక్ టవర్ అని కూడా పిలుస్తారు విజయనగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక్క స్తంభం ఒక చారిత్రాత్మక కట్టడం గా భావించవచ్చు.
- తారకరామా పార్కు: ఇది వైజాగ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానము.
- జలాంతర్గామి మ్యూజియం: రామకృష్ణ బీచ్ వద్ద ఉన్నటువంటి సబ్ మెరైన్ మ్యూజియం ని జలాంతర్గామి మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సబ్మెరైన్లకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు.
- భీమునిపట్నం బీచ్: భీమిలి బీచ్ గా పిలవబడేటువంటి ఈ యొక్క భీమునిపట్నం బీచ్, విశాఖపట్నం సుందరమైనటువంటి నేచర్ స్పాట్గా ఉంటుంది.
- విజయనగరం కోట: విజయనగర సామ్రాజ్యానికి తలమానికంగా ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడమే ఈ యొక్క విజయనగరం కోట. విజయనగర వైభవాన్ని మనం ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- అలకానంద వాటర్ ఫాల్స్: సహజ సుందరమైనటువంటి ఈ యొక్క జలపాతాలు చూపర్ల మనసుని ఆకర్షిస్తూ ఉంటాయి.
- శివాజీ పార్క్: విశాఖపట్నంలో పర్యాటకులు సేదతీరాడానికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ పార్క్ ఈ శివాజీ పార్క్.
- డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్: విశాఖపట్నం యొక్క పోర్టుకు సంబంధించి, అదేవిధంగా సులభంగా విశాఖపట్నం సాగర తీరాన చేరుకోవడానికి తలమానికంగా ఉండేటువంటి ఐకానిక్ లైట్ హౌస్ ఇది.
- కైలాసగిరి హిల్ పార్క్: కైలాసగిరి అనేటువంటి కొండపైన ఉన్నటువంటి సుందరమైనటువంటి పార్క్. కైలాసగిరి హిల్ పార్క్ వైజాగ్ లో తప్పకుండా చూడవలసినటువంటి ఒక ప్రాంతం.
- బుర్రా గుహలు: రసాయన చర్యల ద్వారా ఏర్పడిన గుహలు, మరియు సహజ సిద్ధంగా వెలిసిన శివలింగము మరియు ఖనిజాలకు సంబంధించిన అనేక విషయాలను ఈ బుర్ర గుహలో మనం తెలుసుకోవచ్చు. తప్పక చూడవలసిన ప్రదేశం ఇది.
- అరకు: ప్రకృతి రమణీయతను మేళవించే ఒక అందమైన అనుభూతిని కలిగించే అరకులోయ భారతదేశంలోనే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా నిలిచే స్వర్గధామం.
ఇవే కాకుండా మరెన్నో ప్రదేశాలు సింహాచలం పరిసర ప్రాంతాలలో మనం చూడవచ్చు