నర్మదా నది పుష్కరాలు 2024
నర్మదా నది మధ్య భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నదులలో ఒకటి. ఈ నది ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది.
నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ . ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. 2024లో నర్మదా నది పుష్కరాలు మే 1 మధ్యాహ్నం ఒంటిగంటకు గురుడు వృషభరాశి లోకి ప్రవేశించాక ప్రారంభమై మే 12 న ముగుస్తాయి.
నర్మదా పుష్కరాల తేదీలు మరియు తిధులు
- మే 1 2024 – బుధవారం – అష్టమి
- మే 2 2024 – గురువారం -నవమి
- మే 3 2024 – శుక్రవారం -దశమి
- మే 4 2024 – శనివారం -ఏకాదశి
- మే 5 2024 – ఆదివారం -ద్వాదశి
- మే 6 2024 – సోమవారం -త్రయోదశి
- మే 7 2024 – మంగళవారం -చతుర్దశి
- మే 8 2024 – బుధవారం – అమావాస్య
- మే 9 2024 – గురువారం -పాడ్యమి, విదియ
- మే 10 2024 – శుక్రవారం – తదియ
- మే 11 2024 – శనివారం – చవితి
- మే 12 2024 – ఆదివారం – పంచమి
పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది.