నర్మదా పుష్కరాలు
బ్రహ్మపుత్ర నుంచి పంపా నది వరకు ప్రతి నదినీ దేవతగా కొలిచే మన భారత దేశం లో ఏదో ఒక సమయంలో ఆయా నదులను దర్శించాలని కోరుకుంటారు. అందుకే ప్రధాన నదులకు వచ్చే పుష్కరాలను స్థానిక వేడుకగా కాకుండా, దేశమంతా పండుగలా భావించే సంప్రదాయం మనకు ఉన్నది. ఈ ఏడాది కూడా అలాంటి వేడుకలా నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి. నర్మదా పుష్కరాలు మే 1 నుంచి 12 వరకు జరుగుతాయి.
పుష్కర స్నానం
పుష్కర సమయంలో ఆయా నదులలో ఎక్కడ స్నానం చేసినా, పూర్వ జన్మల్లో మనస్సు, వాక్కు, శరీరమనే త్రికరణాలతో చేసిన అన్ని పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. ఎన్నో పుణ్య కార్యాలు ఈ సమయంలో చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మానవులు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టాలను పితృ పిండ ప్రదానాలను చేయాలని మహర్షులన ప్రబోధించారు. పుణ్య కార్యాలన్నింటిలో ముఖ్యమైనది, మహత్తరమైనది, పుష్కరస్నానం.
నర్మదా నది పుష్కర స్నానం సంకల్పం
ఈ సంవత్సరం జరగబోయే నర్మదానది పుష్కరాల సందర్భంలో, నర్మదా నదిలో స్నానం చేసేటప్పుడు, పిండప్రధానం, పితృ తర్పణం లేదా దానం చేసేపప్పుడు సంకల్పాన్ని ఏ విధంగా పఠించాలి అలాగే నర్మదా నది పుష్కర స్నాన సంకల్పము వివరాలను కింద ఇవ్వడం జరిగినది.
ఓం విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణుర్ విష్ణుర్ విష్ణుః, శ్రీ మద్ మహాపురుషస్య విష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతే కలియుగే, కలిప్రథమచరణే,జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, ఆర్యావర్తే ఏకన్తరే దేశే, బ్రహ్మవర్తే దేశే ఓంకార్ గిరిజ క్షేత్రే మాంధాత్ మైన్డుర్ మణిపర్వతే, ఓంకారేశ్వర రాజరాజేశ్వరి నర్మదాయం దక్షిణ తటే, ఓమకారేశ్వర్ – మమలేశ్వర్ చతుర్థ జ్యోతిర్లింగ సన్నిదౌ, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, సాలివాహనే, ఉత్తరాయణే, మాసానాం మాసోత్తమే, మాసే పూర్ణ పవిత్రాదిక మాసే, చైత్ర మాసే, శుక్లే పక్షే పౌర్ణమ్యం, గురు బృహస్పతి వాసరాయం, వాసరః అముక వాసారాయం, నక్షత్రే, మమాత్మనః, శ్రీమాన్ శ్రీమత గోత్రః ఆత్రేయస గోత్రం శర్మ ధర్మపత్నీసమేతస్య సహ కుటుంబస్య___