నర్మదా నది ప్రాశస్త్యం
పూర్వం చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహార మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరాడు. దివిలో వున్న నర్మదా నదియే పాప ప్రక్షాళన చేయగలదని చెప్పారట. నర్మద నదిని భూమి మీద ప్రవహింపచేయుటకు పురూరవుడు తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. ఈ ప్రవాహాన్ని తట్టుకుని అడ్డుగా నిలిచే వారెవరని అడుగుతాడు శివుడు. అప్పుడు వింధ్య పర్వత రాజు, తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని శివునికి చెప్తాడు.అలా అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి స్వర్గప్రాప్తి పొందాడు పురూరవుడు. అంతటి మహత్యం కలిగినది ఈ నర్మదా నది.
నర్మదా నది జన్మస్థలం
నర్మదా నది జన్మస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో అమర్‌కంటక్ పర్వతం వద్ద ఉంది. ఇది అమర్‌కంటక్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వద్ద ప్రారంభమై మూడు రాష్ట్రాల గుండా 1312 కిమీ పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణిస్తుంది మరియు తపతి నది మరియు మహి నదితో పాటు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించే మూడు నదులలో ఇది ఒకటి. భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది.
నర్మదా నది ఒడ్డున అనేక ఆలయాలు ఉన్నాయి.వాటిలో అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్దేశ్వర్ మందిరం, చౌసత్ యోగిని ఆలయం, చౌబిస్ అవతార్ ఆలయం మరియు భోజ్‌పూర్ శివాలయాలు చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.
నర్మదా నది పుష్కరాల ముఖ్యమైన ఘాట్లు పేర్లు :
నర్మదా నది ప్రవాహ మార్గం లో అనేక ఘాట్లు నిర్మించారు. ఇక్కడ భక్తులు పవిత్ర ఆచారాలు మరియు పవిత్ర స్నానాలు చేస్తారు. కొన్ని ప్రముఖ నర్మదా నది పుష్కర ఘాట్లు:
- చకర్ తీర్థ ఘాట్
- గౌముఖ్ ఘాట్
- భైరోన్ ఘాట్
- కేవల్రామ్ ఘాట్
- నగర్ ఘాట్
- బ్రహ్మపురి ఘాట్
- సంగం ఘాట్
- అభయ్ ఘాట్
- కోటి తీర్థ ఘాట్