పెద్దలు స్త్రీలను “అయిదో తనముతో నిండు నూరేళ్ళు వర్ధిల్లమ్మా” అని దీవిస్తారు. అయిదో తనము అంటే మీకు తెలుసా?
అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం.
స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…
పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వాటితో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది. అలాగే మాంగళ్య గౌరీ అనుగ్రహంవల్ల అయిదోతనంతో వర్ధిలుతుంది.
సేకరణ: https://www.panditforpooja.com/blog/muttaiduva-or-aidava-tanam/