ఉగాది మిధున రాశి ఫలితాలు 2025-2026
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిధున రాశి [Sri Viswavasu Nama Samvatsara Mithuna Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం- 14 వ్యయం – 2
- రాజపూజ్యం – 4 అవమానం – 3
ఎవరెవరు మిధునరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మిధునరాశి లోకి వస్తారు.
- మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మిధున రాశి ఫలాలు [Mithuna Rasi Phalalu 2026-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
మిధున రాశి ఫలాలు 2025-26
ఈరాశి వారికి గురుడు మే15 ముండి జన్మ రాశి యందు సువర్ణమూర్తి గామా, శని సంవత్సరమంతా దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములిచ్చువట్లునూ, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా భాగ్య, తృతీయ స్థానములందు లోహమూర్తులుగన సామాన్య ఫలితములిచ్చు వారుగమా సంచరించును. ఈ రాశివారికి జన్మ గురుని పంచారంచేత ఆత్మ విశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. క్రొత్త విషయాలను తెలుసుకొనుటకు ఉత్సుకత చూపేస్తారు. విద్యార్థులు కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. అన్నీ రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. విరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూలము ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జన్మ గురువి పంచార ప్రవేశకాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి వెలకొవి ఉంటుంది. మీ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయమార్గాలు పెరిగే అవకాశం ఉంది, ఉద్యోగస్తులకు వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది.
జన్మరాశిలో గురుడు పంచరించడం వల్ల ముఖ వర్చస్సు పెరిగి, ప్రత్యేకం ఆకర్షణ ఉంటుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. వీరి వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్టోబర్ మాసంలో ధన సంబంధ సమస్యలను అధిగమిస్తారు. డిసెంబర్ మాసంలో స్వల్పఆరోగ్య సమస్యలకు గురి అవుతారు. మరియు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కల్గుతాయి. మిథునరాశి వారికి, శని భాగ్య, రాజ్యాధిపతి మార్చి వెలాఖరులో మీవరాశిలోనికి అనగా దశమ స్థానంలో శని పంచారం వలన మీ కోరికలు వెరవేరతాయి. పమలన్నీ విజయవంతమవుతాయి. దశమ స్థాన పంచార గతుడైన శని కృషి, పట్టుదల, మరియు సాధన మొదలగు అంశాలను ప్రభావితం చేస్తుంది. అధికారాన్నిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులకు అండగా ఉండి కట్టుబడి యుంటారు. మీ తల్లిదండ్రులు ఆవారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. సంతానం ఉన్నతవిద్య లాభిస్తాయి. వారసత్వంగా సంక్రమించవలసిన ఆస్తి మీకు దక్కుతుంది. మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది. వివాదాలకు దూరంగాఉండటం మంచిది. సంతానానికి వివాహాది శుభయోగములు. కుటుంబంతో ఆనందంగా గడపగల్గడం తండ్రి తరపువారితో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం, తీర్ధయాత్రలకు వెళ్ళడం, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలసి రావడం వంటివి జరుగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. తృతీయ స్థానంలో కేతువు సంచారం అనుకూలంగా ఉంటుంది. ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. మీరు ప్రతి పనిని పూర్తి నిజాయితీ మరియు కష్టపడి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు. గురు ధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ, గురువారం ఒక కేజీపావు శెనగలు దానం చేస్తే కొంత ఉపశమనం కల్గుతుంది. ఈ రాశి వారి ఆదృష్ట సంఖ్య 5.
నెలవారీ ఫలితములు
2025 ఏప్రిల్: ఆరోగ్యంగా, ధనవంతులుగా మరియు తెలివైనవారుగా రూపుదిద్దు కుంటారు. జన్మరాశిలో గురుసంచారం జ్ఞానం, సంపద మరియు శ్రేయస్సును పెంపొందిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో గణనీయంగా పెరుగుతాయి.
మే: ధనలాభం. ఇతర దేశ సందర్శనలు, మరియు కుటుంబానికి దూరంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ధార్మిక కార్యాల్లో ధనం ఖర్చు చేస్తారు.
జూన్ : స్నేహితులు, బంధువులు, తోబుట్టువులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనస్సు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఎక్కువగా ఉండే అవకాశం.
జూలై : మీరు పనిచేసే చోట కొన్ని ఒడిదుడుకులు, నచ్చని ప్రదేశానికి బదిలీ. అధిక ధనం ఖర్చు చేస్తారు. ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.
ఆగష్టు : దూర ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలతో సహా అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తారు. గంగా వంటి పవిత్ర నదుల్లో కూడా స్నానం చేస్తారు. ఆర్థికంగా హెచ్చుతగ్గులకు గురవుతారు.
సెప్టెంబర్: ఆరోగ్య సమస్యలు మీ తండ్రిని ఇబ్బంది పెట్టవచ్చు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి.
అక్టోబర్: సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. ఈ సమయంలో మీరు చేసే పని విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు వెళతారు. ఈ సమయంలో, కొన్ని శారీరక సమస్యలు మీ తోబుట్టువులను ఇబ్బంది పెట్టవచ్చు.
నవంబర్: మీరు ఆస్తిని కొనుగోలు చేయడంలో కృతకృత్యులవుతారు. వ్యాపారాలకు సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్ధికంగా లాభపడతారు.
డిసెంబర్: విద్యార్ధులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటూ సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
2026 జనవరి : వృత్తిపరంగా ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనం చేకూర్చే కొత్త ఆదాయ వనరులను ఆస్వాదిస్తారు.
ఫిబ్రవరి : అన్ని సమస్యలను అధిగమించే ధృఢత్వం కల్గుతుంది. శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా చేస్తుంది. కళ్యాణాది శుభయోగములు సంప్రాప్తించును. ఆదాయమార్గాలు పెరుగుతాయి. జీవనం సుఖమయం
మార్చి:ముఖ వర్చస్సు శరీర సౌష్ఠవం తెలివితేటలు ఇతరులను ప్రభావితం చేసే వాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. ధనం నిల్వ చేస్తారు.
Astrology Consultation
₹1,050.00 – ₹2,625.00
Horoscope Matching for Marriage
₹367.50 – ₹1,050.00