ఉగాది మేష రాశి ఫలితాలు 2025-2026
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి [Sri Viswavasu Nama Samvatsara Mesha Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 02, వ్యయం – 14
- రాజపూజ్యం – 05, అవమానం – 07
ఎవరెవరు మేషరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మేషరాశి లోకి వస్తారు.
- అశ్విని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
- భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
- కృత్తిక 1వ పాదము (ఆ)
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మేషరాశి ఫలాలు [Mesha Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
మేష రాశి ఫలాలు 2025-26
ఈ రాశి వారికి గురుడు మే15 నుండి 3వ స్థానమైన మిథునరాశి యందు మరియూ శని సంవత్సరమంతా వ్యయ స్థానమందు లోహమూర్తులు గానూ ధనవాశ కలుగచేయుట, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సం॥రమంతా తామ్రమూర్తులుగానూ సామాన్య ఫలితములిచ్చువారుగాన పంచరించును. వీరు చురుకైన స్వభావం కలిగి సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుట, సంపద వృద్ధి. శీతల పానీయ వ్యాపారులకు అధిక లాభాలు కల్గుతాయి. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారస్తులకు గణవీయమైన పెరుగుదల. విద్యార్థులు పురోగతి, కుటుంబ జీవితం ఆనందకరం.
శని సంవత్సరారంభంలో పూర్వాభాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనక మైన అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు. వృత్తి, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి. స్థిరాస్తులను వృద్ధిచేయడం లేదా వాహనాలను కొమగోలు చేయడం వంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి విజాయితీతో సాధిస్తారు. శని వ్యయస్థానము నందు సంచారము వలన ఇప్పటివరకు తీసుకున్న విర్ణయాలు ప్రభావితమవుతాయి. చీకటి మార్గాలద్వారా ధనం సంపాదించా లనే వారికి ప్రతికూల పరిస్థితులు, శత్రువృద్ది మరియు ఆందోళనలు.
వీరికి వత్సరారంభం నుండి ఏలినాటి శని ప్రారంభం. క్రమశిక్షణ లోపం వలన ధనవిషయాలలో ప్రతికూల పరిస్థితులు, ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్య సమస్యలు, వేత్ర సంబంధ రుగ్మతలు. విదేశీ వివాప అవకాశం. విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు, 7, 11 నెలల మధ్య అనారోగ్యం. ఆంజవేయ ఆరాధన చేయుటచే సమస్యల నుండి ఉపశమనం.
వీరికి మిథున రాశిలో గురుసంచారం వలన సోమరితనం పెరిగి ప్రతీ పనిని వాయిదా వేయుట, పనిచేసేచోట అధికారుల ఆగ్రహానికి గురియగుట, అయితే ధార్మిక విషయాలలో చురుకుగా పాల్గొనట, స్నేహితులు, తోబుట్టువుల సహకారం. మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు చాలా ఉంటాయి. వ్యాపారంలో పురోగతి. వైవాహిక జీవితం సుఖమయం. పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగి, వ్యాపారం విస్తరణ, ఆదాయంలో వృద్ధి, సామాజికంగా పలుకుబడి. పురోగతి సాధిస్తారు. సంతానం వృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి. సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు పూర్తవుతాయి. 12వ నెలలో గురువు తిరోగమనంలో మిథువరాశిలో ప్రవేశించునపుడు తోబుట్టువులతోమా పనిచేసే చోట సహోద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వలన సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం.
రాహువు సంచారం వలన శుభ సూచనలు, ఆకస్మిక ధనలాభములు. దీర్ఘకాల సమస్యలు తీరుట, ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుట, ఆర్థిక పరిస్థితిమెరుగుపడుట, స్నేహితుల మన్ననలు, కొత్త వ్యక్తులను కలియుట, కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు. అన్నిరకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందుట, వ్యవసాయ మరియు వ్యాపార రంగంవారికి విజయాలు, ఉద్యోగస్తులు పదోన్నతి లేదా వేతన పెంపు. 5వ స్థానంలో కేతు సంచారం వలన సంతానం ఆరోగ్యం విషయంలో యిబ్బందులు, చదువులో వెనక బడుట, చెడు సావాసాలకు లోనయ్యే పరిస్థితి. వీరి అదృష్ట సంఖ్య 9. గురువార నియమములు, దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానములు చేయుటవల్ల మేలు కల్గును.
నెలవారీ ఫలితములు
2025 ఏప్రిల్ : సంపద, ఆస్తి, సౌకర్యాలు మరియు విలాసవంతమైన సౌఖ్యాలు. ఋణాల బారిన పడకుండా అధిక ఖర్చులను తగ్గించుకోవడం, ఆశావాహంగా ఉండటం, తన వాక్కుతో ఇతరులను మెప్పించి కార్యజయం పొందుతారు.
మే : ప్రతికూల ప్రభావం. ఆర్థిక నష్టం పెట్టుబడులు కలసీరావు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి అనుకూలం కాదు. ఇతరులతో ఘర్షణ వాతావరణాన్ని నిరోధించాలి.
జూన్: వ్యక్తిగత గౌరవం స్థాయి పెరగడం, ఇతరులపై సరైన అవగాహన దృక్పథం కలిగి వారి అభిమానం పొందటం, ఉన్నత విద్యా విషయాలలోనూ ముందంజ.
జూలై: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి ఆగుట, ధైర్యంతో వ్యవహారజయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
ఆగష్టు: అలంకార యోగము, స్త్రీ సౌఖ్యము, విలువైన వస్తువులను సంగ్రహించుట, బంధుమిత్ర సమాగమము, ధనము అధికంగా ఖర్చు చేయుట, వృత్తివ్యాపారాలలో స్తబ్ధత అంతంతమాత్రముగా ఉండుట. వృధావ్యయము.
సెప్టెంబర్: వృత్తి వ్యాపారాలు అనుకూలం. పోటీ పరీక్షలలో రాణిస్తారు. వ్యాపారాలల్తో ప్రత్యర్థులు ఎటువంటి నష్టం కలిగించలేరు. మాసాంతంలో అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల ఉంటుంది.
అక్టోబర్: పంతోషంగా ఉంటారు మరియు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాయపరమైన సమస్యలు మరియు వ్యాజ్యాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి.
నవంబర్ : జూదం పందాలు కట్టడం మానుకోవాలి, అష్టమకుజ సంచార దోషంమ అధిగమించుటకు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి కందులు దానం చేయాలి. సమస్యలు అధిగమించి పమల్లో కృతకృత్యులవుతారు. సమాజంలో గుర్తింపు.
డిసెంబర్: వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నానూ అనుకూలంగా మార్చుకోగల్గుతారు. ఇతరులకు ఆకర్షణగా వీలుస్తారు. ఇతరులకు అండగా విలుస్తారు. సమాజం, కుటుంబం అధికారం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు.
2026 జనవరి : కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాపాడతారు. ఓర్పు సహనంతో ఉండి తగిన సమయానికి చురుకైన పాత్రవహించి కృతకృత్యులవుతారు. అదృష్టం కలిపివస్తుంది. అధికారం మీ హస్తగతం అవుతుంది.
ఫిబ్రవరి: మంచి యోచన ముందుచూపు యుక్తి కుయుక్తులతో వ్యవహరించటం, రాజకీయ వ్యవహారాలలో మెరుగైన పాత్ర వహిస్తారు. అధికారం వస్తుంది, వ్యాపారస్తులకు అధిక లాభాలు కల్గుతాయి.
మార్చి: సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవన విధానం సజావుగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు నాలకు మీవంతు సహాయం చేస్తారు. భూ గృహ స్థిరాస్తుల విషయంలో లాభపడతారు. సోదరుల అండదండలు కల్గుతాయి
Astrology Consultation
₹1,000.00 – ₹2,500.00
Horoscope Matching for Marriage
₹350.00 – ₹1,000.00