ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2025-26

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మకర రాశి ఫలితాలు 2025-26

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి [Sri Viswavasu Nama Samvatsara Makara Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 8 వ్యయం – 14
  • రాజపూజ్యం – 4 అవమానం – 5

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మకరరాశి లోకి వస్తారు.

  • ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
  • శ్రవణం 1,2,3,4 పాదాలు (జు, జే, జో, ఖ)
  • ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మకరరాశి ఫలాలు [Makara Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.

మకర రాశి ఫలాలు 2025-26

ఈరాశి వారికి గురుడు మే15 నుండి షష్ఠస్థానమైన మిథునరాశి యందు సువర్ణమూర్తిగానూ చక్కని స్వస్తతను స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని శత్రుజయాన్ని కల్గిస్తుంది. మరియూ శని సంవత్సరమంతా తృతీయస్థానమందు తామ్ర మూర్తులు గానూ సామాన్యఫలితములు కలుగ జేయును. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా ధన, అష్టమ స్థానములందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితములిచ్చును.

వివేకవంతులు మరియు ఉదార స్వభావులుగా మార్పుచెందుతారు. జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్ములను అందరూ ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపబడిన ఇంట్లో నివసిస్తారు. వైద్య, విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షలలో రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కడుపు మరియు అజీర్ణం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంతమేరకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అక్టోబర్లో ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. వైవాహిక సంబంధాలలో పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ధీటుగా శత్రువులను ఎదుర్కునే సామర్ధ్యం ఉంటుంది. వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు. డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

తృతీయ స్థానమందలి శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు ఉద్యోగ విషయంలో బదిలీ తప్పదు. మతపరమైన విషయాలలో ఆసక్తి పెంచుకుంటారు. తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు, కానీ వారితో మీ సంబంధం సుహృద్భావంగా ఉంటుంది. మీ సంతానం పురోగతి సాధిస్తారు. మీస్నేహసంబంధాన్ని విస్తరించుకుంటారు. సృజనాత్మకతతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు. జూలై – నవంబర్ల మధ్య ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు తదుపరి స్వస్థత కల్గుతుంది. మీ రాశి నుండీ 2వ ఇంట్లో రాహువు సంచారం. ప్రజలను ఆకట్టుకునే చాలా పనులు చేస్తారు. మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు కల్గుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
కేతు ప్రభావం 8వ స్థానంలో మానసిక హెచ్చుతగ్గులు. ఊహించని ధనలాభం. శారీరక సమస్యలు, వాత, పిత్త సంబంధిత సమస్యలు. సాధన, ఆధ్యాత్మికతలో ఎక్కువగా నిమగ్నం. శనివారం శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం మీరు పఠించినా శ్రద్ధతో విన్నా మీకు దివ్య అనుభూతికల్గుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8.

నెలవారీ ఫలితములు

  • 2025 ఏప్రిల్ : మేధస్సు మరియు జ్ఞానం వృద్ధి అవుతుంది. జీవితంలోని అనేక రంగాలలో విజయానికి దారితీసే ఉన్నత స్థాయి ధీశక్తి పెరుగుతుంది. పట్టుదలతో కృషిచేయాలనే తపనను పెంచి విజయం వైపు తీసుకువెళ్తుంది.
  • మే : సమయానికి తగినట్టు వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం. అందరికీ ఆదర్శవంతులవుతారు. ధార్మిక కార్యాల్లో సహాయం అందిస్తారు.
  • జూన్ : ఇతరులను అధిగమించి, పోటీపరీక్షలలో రాణించి విజయాన్ని వరిస్తారు. ఈ రాశిలోని ప్రతీవారు ఈ మాసంలో ఏదోవిధంగా రాణించి లాభపడతారు. సంపద కూడా పెరుగుతుంది. సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు.
  • జూలై : శ్రేయస్సు మరియు ఆరోగ్యం సంబంధ ప్రతికూలతలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. సవాల్లను స్వీకరించి ఆచరణలో విజయవంతంగా పూర్తి చేస్తారు.
  • ఆగష్టు: ఉన్నత స్థితిని పొందగల అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నత స్థితిని పొందుతారు. వ్యార భాగస్వాములను గౌరవించాలి వారిపై తేలిక చులకన భావం మిమ్ములను దూరం చేస్తుంది.
  • సెప్టెంబర్: జీవితంలోని పరివర్తన అవగాహన మరియు అంగీకారాన్ని అందిస్తుంది. అంతర్లీనంగా బలమైన ధృక్పథాన్ని పెంచుతుంది. అనుభవంతో ముందు రాబోవు అడ్డంకులను పసిగట్టి అధిగమించగలరు.
  • అక్టోబర్: శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కాలంలో ప్రయత్నాలను బట్టి విజయాన్ని పొందుతారు. వ్యక్తి తన తలపెట్టిన దీర్ఘకాలిక పథకాలను సంతృప్తిగా పూర్తిచేసి లాభాన్ని గౌరవాన్ని పొందుతారు. సంపద పెరుగుతుంది. అతని కీర్తి మరియు ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి.
  • నవంబర్ : శుభప్రదమైన సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మరియు సమాజంలో అతని గౌరవం మరియు మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు.
  • డిసెంబర్ : పనిచేసే సంస్థలో జవాబుదారీతనానికి నిజాయితీకి మారుపేరుగా మిమ్మల్ని అందరూ భావిస్తారు. మీ నాయకత్వం పట్ల ప్రజలు సంతుష్టులుగా ఉంటారు. ఆనందమయమైన జీవనం గడుపుతారు.
  • 2026 జనవరి : ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మార్గావరోధాలు ప్రమాదాలు సంభవించవచ్చు. వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం మిమ్ములను వరిస్తుంది. మీ కృషి ఫలాలను అందరికీ పంచుతారు.
  • ఫిబ్రవరి : సన్నిహితంగా ఉండేవారితో ఆపోహలు కలగడానికి అవకాశం. అహంకారం వదలి సహనంగా ఉండటం మంచిది. ఆలస్యమైనా కార్యసాధన చేస్తారు. పోదరవర్గంతో ఆపోహలు రాకుండా చూచుకోవడం మంచిది.
  • మార్చి: మార్చి నెలాఖరుకు వ్యవహార జయము, జీవన పురోగమనము, ఇతరులకు సాయిశక్తులా సహాయం చేయడం, అపరిష్కృత సమస్యలను స్వశక్తితో కృషిచేసి అందరి మన్ననలు పొందడం, యత్నకార్యసిద్ధి కలుగును.
Download Horoscope

Download Horoscope

525.001,050.00