ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2024-25

Loading

ఉగాది మకర రాశి ఫలితాలు - Makara Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మకర రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి [Sri Krodhi Nama Samvatsara Makara Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 14, వ్యయం – 14
  • రాజపూజ్యం – 03, అవమానం – 01

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మకరరాశి లోకి వస్తారు.

  • ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
  • శ్రవణం 1,2,3,4 పాదాలు (జు, జే, జో, ఖ)
  • ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మకరరాశి ఫలాలు [Makara Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

మకర రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : 14-4-2024 నుండి 14-5-2024 వరకు అర్ధాష్టమం . 17-8-2024 నుండి 16-9-2024 వరకు అష్టమం . 16-12-2024 నుండి 12-2-2025 వరకు ద్వాదశం , జన్మం.
  • కుజుడు : 2-6-2024 నుండి 12-7-2024 వరకు అర్ధాష్టమం.
  • గురుడు : ఈ సం|రం శుభుడే.
  • శని : ఈ సం॥రం ఏల్నాటి శని.
  • రాహు, కేతువులు : ఈ సం॥రం శుభులే.ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతిశని 2వ ఇంట, బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పనిచేసినా బేలన్సుగా ఉండును. పట్టుదలఎక్కువ. ఎంతటివారినైనా లొంగదీసు కుంటారు. ఆదాయము బహుముఖములుగా చేతికందును. ఒడిదుడుకులు లేని జీవితమై ఉండును. మీ మాట, ఆడవారి మాట ఒక్కటై రాణించును. మీ నమ్మకం. మీ ఆత్మబలం మిమ్ములను సదాకాపాడును. పుణ్యనదీస్నానం, పుణ్యక్షేత్రసంచారం, పుణ్యకార్యములు చేయుట కలుగును. ఎంత ఆదాయమో అంత ఖర్చుఅగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారులు వలన కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయములు స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట జరుగును. మీ ఆత్మశరీరమును మంచిదారిలో ఉంచును. మీరు ఎంతదైవారాధనచేస్తార్తో అంతమహోపకారంకలుగును. మీలోదైవత్వం, పరమేశ్వ రుని కృపచే సాధించలేని కార్యంఉండదు. గతసంవత్సరంవలెనే ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధికసంతోషంకల్గించును. సర్గోష్టులు చేస్తారు. ధర్మ బుద్ధితో ఉంటారు. అన్ని రంగాల వార్కి యోగ్యకాలమని చెప్పవచ్చు. స్తిరాస్తులు కొంటారు. గృహమార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా దొంగలవల్లనష్టాలు, ప్రయాణాదులలో ఇబ్బందులు, సోదరమూలకనష్టాలుతప్పవు.ఈ సం॥రం ఉద్యోగులకు బాగుండదు. అలసట, శ్రమకు తగిన గుర్తింపు లేకుండుట, కేసులందుఇరుక్కొనుట, అపవాదులు, అనేకసమస్యలు మనఃస్థిమితం ఉండదు. దూరప్రాంతములకు బదిలీలు, స్థాన చలనములు, ద్వితీయార్ధంలో అనుకూలత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవార్కి ద్వితీయార్ధంలో ప్రమోషన్తో కూడిన బదిలీలు. ఆదాయం బాగుండును. ప్రవేటు సంస్థలలో పనిచేయువారికి ద్వితీయార్థంలో మంచిజీతాలతో మరొక కంపెనీకిమారుదురు నిర్మద్యోగులకు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగాదులు లభించి జీవన సౌఖ్యం, స్థిరత్వం లభించును.రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు. మీ మాట మీ ప్రతీ. విషయంలోనూ పైచేయిగాఉంటుంది. ప్రజలలోమంచిపేరుప్రఖ్యాతులు కలుగును. సాంఘికంగా సేవా కార్యక్రమాలలో మంచి పేరు, పార్టీలోనూ, ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి లభించును. ఎన్నికలందు విజయం తప్పనిసరిగా లభించును. కావాలని ఉద్దేశపూర్వకంగామిమ్మల్ని దెబ్బతీయుటకు ప్రయత్నించివిఫలమగుదురు.

    కళాకారులకు, మంచి యోగదాయకమైనకాలం. గతంలో లేని విధంగా జీవిస్తారు. టి.వి సినిమా రంగాలలో ఉన్న గాయనీ గాయకులకు, నటీనటవర్గం, ఇతర సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగంచేసుకొని స్థిరత్వం పొందుదురు. విజయాలు సాదించుట వలన ప్రభుత్వ ప్రవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు తప్పక ఫలించును. గృహ నిర్మాణములు కలసి వచ్చును.

    వ్యాపారులకు కూడా ఈ సం॥రం శనిబలంవల్ల చాలాబాగుండును. ఆశించ నంత మేర లాభములు లభించును. బంగారం, వెండి వ్యాపారములకు ఆగష్టు వరకు బాగుండదు. తదుపరి చాలా బాగుండును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచిసమయం. రెట్టింపులాభాలుచేకూరును. బిల్డింగెమెటీరియల్ వ్యాపారస్థులకు అనుకూలమే. సరుకులు నిల్వచేయువార్కి విశేషలాభాలు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయువారికి బిల్స్ త్వరగా వచ్చి నూతన కాంట్రాక్టులు పొందగలరు.

    విద్యార్ధులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ద ఉండును. శని వలన జ్ఞాపకశక్తి తగ్గును. ప్రథమార్ధంలో పరీక్షలు బాగుగా వ్రాయలేరు. కొన్ని సబ్జెక్టులు నిలచిపోవుట జరుగును. ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్గంలోనే వచ్చుటచే సరైన ర్యాంకులు పొందలేక కోరుకొన్నచోట్ల సీట్లును పొందలేరు. సెప్టెంబర్ నుండి తిరిగి చదువులపై శ్రద్ధ, ఆశక్తి పెరుగును. పరీక్షలలో ఉత్తీర్ణులగుదురు.సౌఖ్యము.

    వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండును. సెప్టెంబర్నుండి అనుకూల వాతావరణంకలిగి ఋణాలు నుండి విముక్తులగు దరు. కౌలుదార్లకుఫర్వాలేదనిపించును. చేపలు, రొయ్యలుచెరువులవార్కి సెప్టెంబర్ తర్వాత విపరీతంగాలాభాలుచేకూరును. కోళ్ళఫారంల వార్కిలాభసాటిగా ఉండును.

    స్త్రీలకు:- ఈ సం॥రం శనిబలం వలన మీ మాటకు ఎదురు లేకుండా ఉండును. కుటుంబంలో మీపై గౌరవభావాలుపెరుగును. మనోధైర్యంపెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందింతురు. ఆగష్టు వరకుస్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్ననూ తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవనం. విలువైనవస్తువులు, స్థిరాస్తులు లాభించును. సంతానంకూడా అభివృద్ధిలో ఉంటారు. భార్యాభర్తలమధ్యసరైన అవగా హన మీమాటకుఎదురుచెప్పరు. గతంలో ఎడబాటుగా ఉన్నవారు కలసిజీవిస్తారు. మొత్తంమీద ఈరాశి స్త్రీ, పురుషులకు జీవనం బాగుండును. ఏల్నాటి శని ప్రభావం తగ్గును. రాహువు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితం. సాంఘికంగా మానసికంగాఉన్నతస్థితి. ఈర్ష్య, అసూయ మీపై ఉండును.

    చేయవలసిన శాంతులు :- మంగళ, సోమవారనియమాలు పాటించాలి. శివాలయంలో, రుద్రాభిషేకం,రాహువుకు జపం, హోమంచేయాలి. శ్రీశైలక్షేత్రసందర్శనంమంచిది. శని, నరఘోషయంత్రాలు ధరించిన మంచిది.

    ఏప్రియల్ :- మీమాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఎదురించి మాట్లాడ గలరు. పనులుపూర్తి చేసుకొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన బాకీలు వసూలగును. కోర్టువ్యవహారాలు అనుకూలించును. గృహనిర్మాణాలు కలసివచ్చును. నూతనపరిచయలాభాలు. రాజకీయ   నాయకులు అభిమానించే వారిని కలుసుకుంటారు.

    మే :  గ్రహాలఅనుకూలసంచారంవల్ల చేయువృత్తివ్యాపారాలందు అనుకూలత, ఆరోగ్యంబాగుండును. ఆర్ధిక సమస్యలు సంతృప్తి. ఏదోలా సమయానికి ధనంచేతి కందును. మిత్రులతోకలయిక. పరాక్రమంతో ఉంటారు. వివాహాదిశుభకార్యాలు జరు గును. సంతాన సౌఖ్యం, దైవదర్శనం, శత్రులపైజయం. స్పెక్యులేష్లోలాభములు.

    జూన్ :-ఈ నెలలోమిశ్రమఫలితాలు ఉండును. ఉద్యోగస్థులకు స్థానచలనములు. గృహమార్పులుఉంటాయి. అద్దెఇంట్లోఉండేవార్కి గృహమార్పులుతప్పక ఉండును. స్త్రీలతోవిరోధాలు, మీ మాటలను వక్రీకరిస్తారు. నమ్మినవారి వల్ల మోసపోవుట గ్రహించి నష్టం నుండి బయటపడుదురు. సంతానం ద్వారా వృద్ధి, లాభములు.

    జూలై :- ఈ నెలలో బాధలు ఎక్కువగును. సమస్యలుకొని తెచ్చుకుంటారు. ఆర్దికంగా బాగుండును. అనవసరఖర్చులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధాలు, ఆరోగ్య భంగములు, బంధుసూతకాలు, పరామర్శలు చేయుట, స్త్రీ, కుటుంబ సౌఖ్యం తక్కువ. కావలసిన వారే దూరమగుట, స్పెక్యులేషన్లో విపరీతనష్టములు

    ఆగష్టు:- ఈనెలలో 8వ ఇంట గ్రహసంచారంవల్ల అనేకఇబ్బందులు. పోలీసు కేసులలోఇరుక్కొనుట, ఇతరులకు జామీనులు ఉండుటచే అనేకనష్టాలు. స్థానచల నాలు. ఉద్యోగులకు బదిలీలు తప్పవు. సంతానం ద్వారా సమస్యలు. శత్రుమూలక ఇబ్బందులు. ఊహించనిపరిణామాలు, ఎన్నికష్టాలున్నా ధైర్యంతో ఎదుర్కొనగలరు.

    సెప్టెంబర్:- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. సమస్యలున్నా ధైర్యంగా ముందుకు పోగలరు. ఆదాయంబాగుంటుంది. ఆరోగ్యంకుదుటపడును. సోదరమూలక ధన వ్యయం. వాహన ప్రమాదములు, శారీరక శ్రమఅధికం, పుణ్యనదీ స్నానంఫలం, ప్రయాణ సౌఖ్యం, నూతన పరిచయలాభం, స్పెక్యులేషన్లో నష్టములు తప్పవు.

    అక్టోబర్ :-అన్నిరంగాలవార్కియోగమే. చేయు వృత్తివ్యాపారములు రాణించును. ఆరోగ్యంబాగుండును ఆర్థికంగాచక్కబడును. పరాక్రమంగాఉంటారు. వాహన సౌఖ్యం, భూసంబధ లావాదేవీలు సంతృప్తి. నూతనవస్తు ప్రాప్తి, సంతానసౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. స్పెక్యులేషన్ లాభించును.

    నవంబర్ :-ఈనెలలో ప్రథమార్ధంచాలాబాగుండును. అన్నిరంగాలవార్కియోగమే. ఆరోగ్యలాభములు. ఆర్థికసమస్యలుండును. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. శత్రుజయం,వాహనసౌఖ్యం, బంధుమిత్రులసహాయసహకారంలభించును. సంతానలాభం,శత్రుజయం, భార్యసహకారంలభించును. స్పెక్యులేషన్బాగుండును.

    డిశంబర్ :-ఈనెలలోస్వల్పంగా ఇబ్బందులు. వాహననష్టం,ప్రమాదాలు,శారీరక గాయములు, స్త్రీలకుశస్త్రచికిత్స, ధనంమంచినీళ్ళవలెఖర్చుగును. ప్రతి చిన్నవిష యానికి కోపోద్రేకులగుదురు. మీ మాట కటువుగా ఉండుటచే కొన్ని సమస్యలు సోదర మూలక విరోధాలు, శారీరకశ్రమ అలసట, స్పెక్యులేషన్లో నష్టపోవుదురు.

    జనవరి :-ఈ నెలలో ధనవ్యయం ఉన్నప్పటికీ మిగిలిన విషయాలలో అనుకూ లత. నూతన వస్తు, వస్త్రప్రాప్తి, దూరప్రయాణాలు, బంధుమిత్రులతోకలయిక, ఆరోగ్యం బాగుంటుంది. నూతన పరిచయలాభం, శారీరక సౌఖ్యం, సంతాన సౌఖ్యం, వాహన మార్పులు, యాత్రఫలప్రాప్తి, స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు.

    ఫిబ్రవరి :- అన్నివిధాలుగా అన్నిరంగాలవార్కియోగమే. చేయు వృత్తివ్యాపారా లందులాభం. ఆరోగ్యం బాగుండును. ఆర్ధికంగా బాగుండును. సరైన సమయానికి ధనంచేతికందును. భూసంబంధవ్యవహారలాభం, ఉద్యోగులకుప్రమోషన్తోకూడిన బదిలీలు. సంతానసౌఖ్యం, సమస్యలు పరిస్కారమగుట, స్పెక్యులేషన్ లాభములు.

    మార్చి :- గ్రహ సంచారం అనుకూలంగా ఉండుటచే ఏ పని చేయువారలకైనా లాభించును. అన్నింటామీదేపైచేయి. ఆర్ధికంగాబాగుండును. ధైర్యంతోకూడినపనులు, మొండిగాచేసివిజయంసాధిస్తారు. విద్యార్ధులుపరీక్షలుబాగావ్రాయుదురు. కుటుంబ వ్యక్తులలో సఖ్యత, నూతన పరిచయలాభం, స్త్రీ సౌఖ్యం స్పెక్యులేషన్లో లాభములు.

Newborn Baby Horoscope

Newborn Baby Horoscope

350.00

Download Horoscope

Download Horoscope

500.001,000.00