చంద్ర గ్రహణం సంభవించిన అశ్వనీ భరణీ, కృత్తికా 1వపాదం మేషరాశి జాతకులు (వృషభం, కన్య, మకరం రాశుల వారికి అరిష్టము కావున వారు కూడా ఇచ్చుకోవచ్చు) గ్రహణానంతరం ఏ దానమును ఇవ్వాలో, దానము ఇచ్చే సమయంలో పురోహితులు చెప్పవలసిన సంకల్ప మంత్రము ఇక్కడ సవివరంగా ఇవ్వబడ్డాయి.
ఇవ్వవలసిన దానములు, చేయవలసిన పనులు:
గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, వెండి చంద్రబింబములను పూజించి (శక్తిని బట్టి వెండినాగ పడగను, వెండి చంద్రబింబమును కూడా ఇవ్వవచ్చును), నెయ్యితో నిండిన కంచు/రాగి గిన్నెను, పాలు, తెల్లనివస్త్రం, మినుములు 1.1/4 కేజి, బియ్యం 1.1/4 కేజీ తో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును.
మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.
గ్రహణకాల దాన మంత్రము:
యజమానస్య జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత చంద్ర గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం చంద్రబింబ నాగబింబ దానం కరిష్యే…
తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! అను మంత్రముచే చదివి
గ్రహణ సూచిత సర్వారిష్ట నివారణార్ధం మమ యజమానస్య సకల శుభ ఫలావాప్త్యర్ధం ఇదం రాహు బింబ, చంద్ర బింబ సహిత ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహిత, క్షీర – శ్వేత వస్త్ర సాహిత యధాశక్తి రాజమాష పూర్వక శ్వేత తండుల దానం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమును స్వీకరించి, దానమిచ్చిన వారిని ఆశీర్వదించవలెను.
ఆశీర్వచన మంత్రం:
మన యజమానస్య జాతకరీత్యా గోచార రీత్యా ఏఏ గ్రహాహ అరిష్ట స్థానేషు స్థితాహ క్రియమైన కరిష్యమాన సూచిత ఆగామి వర్తమాన వర్తిష్యమాన సమస్త దోష నివారణ సిద్ధిరస్తు, పాక్షిక రాహు గ్రస్త చంద్రగ్రహణ దోష నివారణ సిద్ధిద్వారా సకల శ్రేయోభి వృద్ధిరస్తు, మమ యజమానస్య జాతక చక్రేషు ఆదిత్యాది నవగ్రహ అత్యంత ఏకాదశ స్థాన శుభఫల ప్రాప్తిరస్తు.