“చెడు సమయంలో డెలివరీ చేయించుకుని, ఆ తరువాత జాతకం బాగో లేదని శాంతులు, జపాలు చేయించుకోవడం కన్నా ముందుగానే మంచి ముహూర్తం చూసుకుంటే సరిపోతుంది కదా పంతులు గారూ…!” అని అడిగే యజమానులు చాలా మందే ఉన్నారు. అలా చూసుకోవడం ఒకందుకు మంచిదే కానీ…
మాకు పుట్టబోయే శిశువు ఫలానా రోజు ఫలానా సమయానికి పుడితే వాడి భవిష్యత్తు బాగుంటుంది అని సిజేరియన్ డెలివరికి ముహూర్తం(Shubh muhurat for Cesarean delivery) పెట్టించుకోవడం మాత్రం బుద్ది పొరపాటే.
రాముల వారి జన్మ నక్షత్రము అని కొందరు, గొప్ప వ్యక్తి పుట్టిన పుట్టిన రోజు అని మరి కొందరూ ముందే నిర్ణయించుకొని చేసుకొనే డెలివరీల వల్ల తల్లీ బిడ్డలకు వైద్య పరమైన ఆరోగ్య సమస్యలు, ముందస్తు శిశు జననం (Premature birth) వల్ల శిశువు ఆరోగ్యంపై పడే దుష్ప్రభావములు అనేకం ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మంచిరోజు అని నిర్ణయించుకొని ఆసుపత్రులలో చేరడం చేత ఒకే రోజు కనీసం 15-30 సగటున C-section (Cesarean Delivery) చేయవలసి రావడంతో ప్రసూతి వైద్యులు కూడా విపరీతమైన ఒత్తిడికి లోను అవడంతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రులకు ఇది కాసుల పంటగా మారింది. ఈ మధ్య ముహూర్తాలకు డెలివరీ చేయడంతోపాటు నొప్పులు లేకుండా డెలివరీ చేయించబడును అంటూ స్పెషల్ ఆఫర్లు, ప్యాకేజీలు ప్రకటిస్తుండడం ఆశ్చర్యం.
వర్జ్యం, దుర్ముహూర్తములు రాహు యమగండములు లేని సమయముల మాట సరే కానీ… ఒక విశేషమైన పర్వదినమనో, ప్రముఖుని పుట్టిన రోజనో గుర్తుండి పోయేలా ఉంటుందని, గొప్ప వ్యక్తి జన్మించిన రోజు అయితే శిశువు కూడా గొప్పవాడు అవుతాడని ఆలోచించి సహజమైన పుట్టుకను కృత్రిమం చేయడం అస్సల మంచిది కాదు అని పురోహిత / జ్యోతిష పండితులు సలహా.
అసలు డెలివరి కి ముహూర్తం అవసరమా? మంచి ముహూర్తం చూసి డెలివరీ చేస్తే పుట్టే పిల్లల జాతకం నిజంగా మారిపోతుందా? అని ప్రశ్నించుకొంటే… ఈ మధ్య ఐతే ఫలానా రోజులలో ప్రసవం అవుతుందని వైద్యులు చెబుతున్నారు కాని, పూర్వకాలంలో అవేమి చూసుకోకుండా హడావుడి జరిగే సాధారణ కాన్పుల వల్ల జన్మించినవారందరూ ఆరోగ్యంగా, చక్కని జీవనాన్ని గడుపుతున్న వారే కదా. అలా పుట్టినవారిలో చాలా మంది మహార్జాతకులు కూడా ఉన్నారు.
అందుచేత లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే అన్నట్లుగా పుట్టుక చావులను గూర్చి మన హడావుడి ఎందులకు? అంతా దైవేచ్చ కాబట్టి ముహూర్తం చూసి డెలివరీ చేయించుకోకుండా దైవంపై భారం వేసి ప్రసవించుట వల్ల సర్వత్రా శుభము చేకూరును.
పై వివరణ చదివిన తరువాత కూడా సిజేరియన్ ఆపరేషన్ డెలివరి కి ముహూర్తం (Muhurat for C Section Cesarean Delivery) పెట్టించుకోవాలంటే కింది లింక్ ని క్లిక్ చేసి మీ వివరములు అందించగలరు.