లలితా సహస్రనామ – ఉత్తర పీఠిక

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.

ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.

॥ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నం – ఉత్తర పీఠిక॥

| అథోత్తరభాగే ఫలశ్రుతిః ||

ఇత్యేతన్నామసాహస్రం కథితం తే ఘటోద్భవ |
రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్ || 1 ||

అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి |
సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్ || 2 ||

సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్ |
సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్ || 3 ||

పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్ |
ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్ || 4 ||

జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్తితత్పరః |
ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్య చ || 5 ||

పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ |
విద్వాన్ జపేత్సహస్రం వా త్రిశతం శతమేవ వా || 6 ||

రహస్యనామసాహస్రమిదం పశ్చాత్పఠేన్నరః |
జన్మమధ్యే సకృచ్చాపి య ఏతత్పఠతే సుధీః || 7 ||

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ |
గంగాదిసర్వతీర్థేషు యస్స్నాయాత్కోటిజన్మసు || 8 ||

కోటిలింగప్రతిష్ఠాం చ యః కుర్యాదవిముక్తకే |
కురుక్షేత్రే తు యో దద్యాత్కోటివారం రవిగ్రహే || 9 ||

కోటీస్సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజాతిషు |
కోటిం చ హయమేధానామాహరేద్గాంగరోధసి || 10 ||

ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే |
దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్ || 11 ||

శ్రద్ధయా పరయా కుర్యాత్సహస్రపరివత్సరాన్ |
తత్పుణ్యం కోటిగుణితం భవేత్పుణ్యమనుత్తమమ్ || 12 ||

రహస్యనామసాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్ |
రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్ || 13 ||

తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః |
నిత్యకర్మాననుష్ఠానాన్నిషిద్ధకరణాదపి || 14 ||

యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువమ్ |
బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ || 15 ||

అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే |
తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ || 16 ||

యస్త్యక్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి |
స హి శీతనివృత్త్యర్థం హిమశైలం నిషేవతే || 17 ||

భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్ |
తస్మై శ్రీలలితాదేవీ ప్రీతాభీష్టం ప్రయచ్ఛతి || 18 ||

అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి |
నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే || 19 ||

సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేఽయనే |
నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే || 20 ||

కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః |
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || 21 ||

పంచోపచారైస్సంపూజ్య పఠేన్నామసాహస్రకమ్ |
సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యం చ విందతి || 22 ||

అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః |
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్ || 23 ||

తత్‍క్షణాత్ప్రశమం యాతి శిరోబాధా జ్వరోపిచ |
సర్వవ్యాధినివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ పఠేదిదమ్ || 24 ||

తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్ |
జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే || 25 ||

అభిషించేద్గ్రహగ్రస్తాన్ గ్రహా నశ్యంతి తత్‍క్షణాత్ |
సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్ || 26 ||

యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి |
వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్ || 27 ||

నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్ |
దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టామంకుశేన చ || 28 ||

ధ్యాత్వాభీష్టాంస్త్రియం రాత్రౌ జపేన్నామసహస్రకమ్ |
ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురం గతా || 29 ||

రాజాకర్షణకామశ్చేద్రాజావసథదిఙ్ముఖః |
త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రీదేవీధ్యానతత్పరః || 30 ||

స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజమ్ |
ఆరుహ్యాయాతి నికటం దాసవత్ప్రణిపత్య చ || 31 ||

తస్మై రాజ్యం చ కోశం చ దద్యాదేవ వశం గతః |
రహస్యనామసాహస్రం యః కీర్తయతి నిత్యశః || 32 ||

తన్ముఖాలోకమాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే |
యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి శక్తిమాన్ || 33 ||

తస్య యే శత్రవస్తేషాం నిహంతా శరభేశ్వరః |
యో వాభిచారం కురుతే నామసాహస్రపాఠకే || 34 ||

నిర్వర్త్య తత్క్రియా హన్యాత్ తం వై ప్రత్యంగిరాస్స్వయమ్ |
యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్రపాఠకమ్ || 35 ||

తానంధాన్కురుతే క్షిపం స్వయం మార్తాండభైరవః |
ధనం యో హరతే చోరైర్నామసాహస్రజాపినః || 36 ||

యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తమ్ |
విద్యాసు కురుతే వాదం యో విద్వాన్నామజాపినా || 37 ||

తస్య వాక్ స్తంభనం సద్యః కరోతి నకులేశ్వరీ |
యో రాజా కురుతే వైరం నామసాహస్రజాపినా || 38 ||

చతురంగబలం తస్య దండినీ సంహారేత్స్వయమ్ |
యః పఠేన్నామసాహస్రం షణ్మాసం భక్తిసంయుతః || 39 ||

లక్ష్మీశ్చాంచల్యరహితా సదా తిష్ఠతి తద్గృహే |
మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః || 40 ||

భారతీ తస్య జిహ్వాగ్రరంగే నృత్యతి నిత్యశః |
యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః || 41 ||

ముహ్యంతి కామవశగా మృగాక్షస్తస్య వీక్షణాత్ |
యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః || 42 ||

తద్దృష్టిగోచరాస్సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః |
యో వేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే || 43 ||

అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభ్యస్తు కదాచన |
శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్సమర్చతి || 44 ||

యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః |
తస్మై దేయం విశేషేణ శ్రీదేవీప్రీతిమిచ్ఛతా || 45 ||

న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః |
పశుతుల్యస్సవిజ్ఞేయస్తస్మై దత్తం నిరర్థకమ్ || 46 ||

పరీక్ష విద్యావిదుషస్తేభ్యో దద్యాద్విచక్షణః |
శ్రీమంత్రరాజసదృశో యథా మంత్రో న విద్యతే || 47 ||

దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ |
రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః || 48 ||

లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్ |
సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ || 49 ||

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ |
నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే || 50 ||

తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్ |
ఏభిర్నామసహస్రైస్తు శ్రీచక్రం యోఽర్చయేత్సకృత్ || 51 ||

పద్మైర్వా తులసీపుష్పైః కల్హారైర్వా కదంబకైః |
చంపకైర్జాతికుసుమైర్మల్లికాకరవీరకైః || 52 ||

ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేసరపాటలైః |
అన్యైస్సుగంధికుసుమైః కేతకీమాధవీముఖైః || 53 ||

తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః |
సా వేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్ || 54 ||

అన్యే కథం విజానీయుర్బ్రహ్మాద్యాస్స్వల్పమేధసః |
ప్రతిమాసం పౌర్ణమాస్యామేభీర్నామసహస్రకైః || 55 ||

రాత్రౌ యశ్చక్రరాజస్థామర్చయేత్పరదేవతామ్ |
స ఏవ లలితారూపస్తద్రూపా లలితా స్వయమ్ || 56 ||

నతయోర్విద్యతే భేదో భేదకృత్పాపకృద్భవేత్ |
మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీం చక్రమధ్యగామ్ || 57 ||

అర్చయేన్నామసాహస్రైస్తస్య ముక్తిః కరేస్థితా |
యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్ || 58 ||

చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు |
సర్వాన్కామానవాప్నోతి సర్వసౌభాగ్యసంయుతః || 59 ||
పుత్రపౌత్రాదిభిర్యుక్తో భుక్త్వా భోగాన్యథేప్సితాన్ |
అంతే శ్రీలలితాదేవ్యాస్సాయుజ్యమతిదుర్లభమ్ || 60 ||

ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః |
యస్సహస్రం బ్రాహ్మణానామేభిర్నామసహస్రకైః || 61 ||

సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపషడ్రసైః |
తస్మై ప్రీణాతి లలితా స్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి || 62 ||

న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే |
నిష్కామః కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమమ్ || 63 ||

స బ్రహ్మజ్ఞానమాప్నోతి యేన ముచ్యేత బంధనాత్ |
ధనార్థీ ధనమాప్నోతి యశోఽర్థీ చాప్నుయాద్యశః || 64 ||

విద్యార్థీ చాప్నుయాద్విద్యాం నామసాహస్రకీర్తనాత్ |
నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే || 65 ||

కీర్తనీయమిదం తస్మాద్భోగమోక్షార్థిభిర్నరైః |
చతురాశ్రమనిష్ఠైశ్చ కీర్తనీయమిదం సదా || 66 ||

స్వధర్మసమనుష్ఠానవైకల్యపరిపూర్తయే |
కలౌ పాపైకబహుళే ధర్మానుష్ఠానవర్జితే || 67 ||

నామసంకీర్తనం ముక్త్వా నౄణాం నాన్యత్పరాయణమ్ |
లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్ || 68 ||

విష్ణునామాసహస్రాచ్చ శివనామైకముత్తమమ్ |
శివనామసహస్రాచ్చ దేవ్యానామైకముత్తమమ్ || 69 ||

దేవీనామసహస్రాణి కోటిశస్సంతి కుంభజ |
తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే || 70 ||

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీః సరస్వతీ |
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ || 71 ||

రహస్యనామసాహస్రం ముఖ్యం దశసు తేష్వపి |
తస్మాత్తత్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే || 72 ||

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః |
విష్ణునామపరాః కేచిచ్ఛివనామపరాః పరే || 73 ||

న కశ్చిదపి లోకేషు లలితానామతత్పరః |
యేనాన్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు || 74 ||

తస్యైవ భవతి శ్రద్ధా శ్రీదేవీనామకీర్తనే |
చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్ || 75 ||

నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని |
యథైవ విరళా లోకే శ్రీవిద్యారాజవేదినః || 76 ||

తథైవ విరళా గుహ్యా నామసాహస్రపాఠకాః |
మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తథా || 77 ||

రహస్యనామపాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్ |
అపఠన్నామసాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీమ్ || 78 ||

స చక్షుషా వినా రూపం పశ్యేదేవ విమూఢధీః |
రహస్యనామసాహస్రం త్యక్త్వా యస్సిద్ధికాముకః || 79 ||

స భోజనం వినా నూనం క్షున్నివృత్తిమభీప్సతి |
యో భక్తో లలితా దేవ్యాస్స నిత్యం కీర్తయే దిదమ్ || 80 ||

నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటిశతైరపి |
తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రీతయే పఠేత్ || 81 ||

ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కథితం మయా |
నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన || 82 ||

యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యమిదం మునే |
పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమమ్ || 83 ||

యో వా దదాతి మూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ |
తస్మై కుప్యంతి యోగిన్యస్సోనర్థస్సుమహాన్‍ స్మృతః || 84 ||

రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్ |
స్వాతంత్ర్యేణ మయా నోక్తం తవాపి కలశోద్భవ || 85 ||

లలితాప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ |
కీర్తయత్వమిదం భక్త్యా కుంభయోనే నిరంతరమ్ || 86 ||

తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి |
ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవో ధ్యాత్యా శ్రీలలితాంబికామ్ || 87 ||

ఆనందమగ్నహృదయస్సద్యః పులకితోఽభవత్ |

| ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే
శ్రీలలితాసహస్రనామసాహస్రఫలనిరూపణం నామ తృతీయోఽధ్యాయః |

Dussehra, festivals, god, hindu tradition, lalitha devi, maha lakshmi, maha saraswati, sahasra namam, Saraswati
శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం
శ్రీ మహాలక్ష్మి అష్టకం

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.