ఉగాది కుంభ రాశి ఫలితాలు 2024-2025
ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి [Sri Krodhi Nama Samvatsara Kumbha Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 14, వ్యయం – 14
- రాజపూజ్యం – 06, అవమానం – 01
ఎవరెవరు కుంభరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కుంభరాశి లోకి వస్తారు.
- ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
- శతభిషం 1,2,3,4 పాదాలు (గొ, స, సి, సు)
- పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కుంభ రాశి ఫలాలు [Kumbha Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.
కుంభ రాశి ఫలాలు 2024-25
ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు
- రవి : 15-5-2024 నుండి 14-6-2024 వరకు అర్ధాష్టమం. 17-9-2024 నుండి 17-10-2024 వరకు అష్టమం. 14-1-2025 నుండి 14-3-2025 వరకు ద్వాదశం, జన్మం.
- కుజుడు : 13-7-2024 నుండి 26-8-2024 వరకు అర్దాష్టమం.
- గురుడు : ఈ సం॥రం అర్ధాష్టమం.
- శని : ఈ సం॥రం ఏల్నాటి శని
- రాహువు : ఈ సంబరం శుభుడే
- కేతువు : ఈసం॥రం అష్టమం.ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కారకుడైన గురుడు వృషభంలో, శని జన్మంలో ఉండుటచే మీగృహకుటుంబ పరిస్థితులు సాంఘికముగాను, గృహ సంబంధముగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రధమార్ధంలో బాగుంటుంది. ఏపని తలపెట్టినా అవలీలగా పూర్తిచేయగలరు. సెప్టెంబర్ నుండి అగ్నిభయం. దొంగలవల్లభయం. వృధాగాశ్రమపడుట, ప్రయాణాలందు కష్టాలు, నష్టాలు ఆర్దికంగా ఇబ్బందులు తప్పవు. గాన దైవధ్యానంచేసేది. నామ, జపం వ్రతముచే వెలుగు నీడలుగా పరిణమించిన మీజీవితం ధన్యత నొందును. మీ ఆరోగ్యంచక్కగాచూచుకొనేది. గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేక ఏమి మాట్లాడుచున్నారో మీకుతెలియని స్థితిగా మీకుతెలియనిస్థితిగా ఉంటుంది. ఇంద్రియపటుత్వం దిగజా . రును. ధాతుబలంతగ్గును. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తఅవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకులోటురాదు. ప్రతి పనిలోలాభదాయకంగా కన్పించినా లోలోప లపడే బాధలు దేవుని ఎరుక అన్నట్లుండును. అధికారవర్గం, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంతకష్టపడి సంపాదించినా క్రియకు ఏనుగు మ్రింగిన వెలుగ పండు మాదిరి అని పించును. మీలోగల మంచితనంవల్ల ఎంతటిగడ్డు సమస్యలైన తప్పించు కుంటారు. గౌరవంనిలబడినా ఆర్దికంగా ఇబ్బందులు తప్పవు. ఋణాలుచేయుదురు.
ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగష్టువరకు అనుకూలమైన కాలం. ప్రమోష న్తో కూడినబదిలీలు. శ్రమకుతగినఫలం. అధికారులఅనుగ్రహంలభించును. సెప్టెం బరుండిపరిస్థితులుఅనుకూలించవు. సుదూరప్రాంతాలకుబదిలీలు. అపనిందలు, చేయని పనులకుశిక్షను అనుభవించెదరు. సస్పెండ్చేసే పరిస్థితులకుదారితీయును. *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి రికి గడ్డుకాలమే. నిరుద్యోగులకు అగష్టులోపే ఉద్యోగాలు రావాలి. తదుపరి వచ్చే అవకాశం ఉండదు. పర్మినెంట్ కాని వార్కి ప్రథమార్ధంలోనే అగును. పర్మినెంట్ కానివార్కి ఆగష్టులోగా అయ్యేఅవకాశంఉంది.
రాజకీయ నాయకులకు ఆగష్టువరకుగడ్డుకాలమే. అనేకఆరోపణలు ఎదుర్కొన వలసివచ్చును. అంతావ్యతిరేకతఉండును. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూ లించును. పనులందుఆటంకాలు, ఎన్నికలలో ఎంతడబ్బు ఖర్చుపెట్టినా విజయాలు సాధించలేరు. మీకురావలసిని నామినేటడ్ పదవులు ఇతరులకు వెళ్ళి పోవును. జాగ్రత్తగా యోచించి మసలుకోవాలి. కొన్నిఆస్తులను అమ్ముకోవలసివచ్చును.
కళాకారులకు బాగుండును. తదుపరి గురుబలం కారణంగా యోగం ఉంటు ంది. టి.వి సినిమాలలో నటించు నటీనటవర్గం, గాయనీ, గాయకులు ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువ. విజయాలు కూడా అంతంత మాత్రమే. చాలా ఓర్పు, నేర్పుతో ఉంటేనే నెగ్గుకు రాగలరు. అవార్డులులభించును.
ఈ సం||రం వ్యాపారులకు బాగుండును. అన్నిరకాలు వ్యాపారులకు లాభాలు చేకూరును. ఆగష్టు తర్వాత అనేక ఇబ్బందులు ప్రభుత్వమూలక ఇబ్బందులు నష్టపోవుట, ట్రాన్స్పోర్టు రంగములో ఉన్నవార్కి వాహన ప్రమాదములు అధికంగా జరుగును. వెండి బంగారం వ్యాపారస్థులకు విపరీత నష్టములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకుమంచిలాభాలు. సరుకులు నిల్వచేయువారికి నష్టాలురావు. రెండిం తలులాభాలువచ్చును. కాంట్రాక్టులు చేయువారి ఇబ్బందులుతప్పవు. షేర్ మార్కెట్ లో ఉన్నవారు బాగా నష్టపోవుదురు. జాయింటు వ్యాపారులు విడిపోవుదురు.
విద్యార్ధులకు ఈ సం॥రం చాలా బాగుండును. ఈ సమయాన్నే ఇంజనీరింగ్, * మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, ఈసెట్, బి.ఇడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చుటచే మంచి ర్యాంకులుపొంది మంచికాలేజీలలో సీట్లును పొంద గలరు. విదేశాలలో చదువులకోసం ప్రయత్నించువార్కి ఈ సం॥కోరిక నెరవేరును. ద్వితీయార్ధంలో కొన్ని ఇబ్బందులుతప్పవు. క్రీడాకారులకు అంతా బాగుండును.
వ్యవసాయదారులకు మొదటిపంట బాగాఫలించును. రెండవపంట బాగుం డక పోయినా జీవనం సాఫీగా గడిచిపోవును. కిట్టుబాటు ధరలు లభించుటచే ఋణ విముక్తులగుదురు. చేపలు, రొయ్యలు చెరువుల వార్కి నష్టములు తప్పవు.
స్త్రీలకు :- ఈ సం॥రం మీమాటకు ఎదురుఉండదు. కుటుంబం గౌరవం పెరుగును. సంతానంసౌఖ్యం, జీవితంలోస్థిరత్వం పొందగలరు. నూతన ఆభరణాలు లభించును. సెప్టెంబర్నుండి పరిస్థితులుమారును. కుటుంబంలో అశాంతి, వ్యవ హారనష్టములు, స్థాన మార్పులు, గృహమార్పులు, దొంగలవల్ల భయం, విలువైన వస్తువులు పోగొట్టుకొనుట, ఉద్యోగంచేయువార్కి సెప్టెంబర్నుండి అన్నీ సమస్యలే. వివాహంకానివార్కి ఈ సం॥ వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆగష్టులోగా అయితే ఫ్రీ డెలివరీ తదుపరి ఆపరేషన్ జరుగును. జీవనం సాఫీగా సాగును. మొత్తంమీద ఈరాశి స్త్రీ,పురుషాదులకు ఆగష్టువరకు పరిస్థితులు అనుకూలం.
చేయవలసిన శాంతులు:- మంగళ, శనివారనియమాలు పాటించాలి. శని కేతు వులకు జపం, హోమంచేయాలి. మీకుదగ్గరలో ఉన్న శివాలయంల లుద్రాభిషేకం, శ్రీశైలక్షేత్ర సందర్శనం మంచిది.
ఏప్రియల్:- అన్నిరంగాలందు అనుకూలమే. వృత్తివ్యాపారములందు రాణింపు, ఆరోగ్యంబాగుండును.గతంలో ఉన్న సమస్యలు తొలగును. వాహనమార్పులు, ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు. బంధు మిత్రుల కలయిక, గృహంలో శుభమూలక ధనవ్యయం, రాజకీయ నాయకులతో లేదా అధికారులతో కలయిక.
మే :- ఈనెలలో మీ మాటకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా ? అనున ట్లుండును. చేయువృత్తి వ్యాపారాలందులాభాలు, అనుకూలత. కుటుంబ సౌఖ్యం, వివాహాది శుభకార్యములకు హాజరగుట, విందులు, వినోదములు, మధ్యవర్తిత్వం నెరపుట, సంఘంలో ఉన్నతస్థితి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది.
జూన్ :- అన్నిరంగాలవార్కిఅనుకూలమే. సమస్యలు పరిష్కారమగును. ఆర్ధికంగా బాగుండును. రావలసినబాకీలువసూలుఅగును. విద్యార్థులకుఫలితాలు సంతృప్తి నిచ్చును. కుటుంబసంతోషం, విందులు, వినోదాలు, అధికారసంబంధమైన పనులు పూర్తిఅగుట, రాజకీయ నాయకులసుకలుసుకొనుట, స్పెక్యులేషన్లో బాగుండును.
జూలై:- ఈ నెలలో కూడా గ్ర వారం బాగున్నది. అన్నిరంగములందు అందరికి లాభమే. అన్నింటా జయం, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి. ధైర్యంతోకూడిన పనులు ప్రత్యేకంగా చేస్తారు. వాహన సౌఖ్యం, రిపేర్లు చేయిస్తారు. సంతానసౌఖ్యం, నూతనరంగాల అభివృద్ధికికృషిచేయుట స్పెక్యులేషన్లోలాభములు.
ఆగష్టు:-ఈ నెలలోగ్రహస్థితులుఅనుకూలించవు. ఏపనీపూర్తికాదు. అన్నింటా అపజయమే. అపవాదులు, అవమానాలు, ఆర్ధికసమస్యలు, బంధుమిత్రులతో విరో ధాలు, భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగాలు, దూరప్రయాణాలందు నష్టాలు. భయాందోళనలు కలిగించు సంఘటనలు, అనవసర ధనవ్యయం, ఏమిమాట్లాడినా విరోధమే.
సెప్టెంబర్:- ఈనెలలో ఆరోగ్యభంగాలు, పనులందుఆటంకాలు, వృత్తి, వ్యాపార, వ్యవహారనష్టాలు గృహంలోవిరోధాలు, ప్రతిచిన్నవిషయానికి భయపడుట, శారీరక శ్రమ, అలసట, అకాలభోజనాలు, భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు. వాహన ప్రమాదాలు, శారీక గాయములు, ఔషధసేవ, స్పెక్యులేషన్ ఫర్వాలేదనిపించును.
అక్టోబర్ :-ఈనెలలోప్రథమార్ధంబాగుండును. కష్టాలేఅధికం. వృత్తివ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలించును. ఆరోగ్యంబాగుండును. వ్యవహారదక్షత కార్యజయం రావలసినధనం చేతికందుట, మిత్రులసహాయసహకారంలభించుట, స్త్రీసౌఖ్యం, స్పెక్యులేషన్మాత్రం బాగుండును.
నవంబర్:- గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని విధములుగా యోగమే. చేయువృత్తివ్యాపారాలుబాగుండును. అదాయంబాగుండును. ధైర్యంతో ముందుకు పోగలరు. వాహనసౌఖ్యం, కుటుంబసౌఖ్యం, మిత్రులతోకలిసివిందులు, వినోదాలు, తీర్ధయాత్రఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయలాభాలు, స్పెక్యులేషన్ లాభాలు.
డిశంబర్:- ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందుదురు. కోపం ఎక్కువ. దురుసుగా ప్రవర్తిస్తారు. ఉద్రేకంగా మాటలాడుటచే మీమాటలను వక్రీకరిస్తారు. శరీర గాయములు ఆందోళన కలిగించు సంఘటనలు సోదర మూలక కష్టములు, ఆరోగ్యభంగాలు, భార్యాభర్తల మధ్య చిన్నచిన్నతగాదాలు తప్పపు. సంతానసౌఖ్యం.
జనవరి :- ఈ నెలలో శుభాశుభమిశ్రమ ఫలితాలుఉండును. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి, దూరప్రయాణాలు, పాత మిత్రులను కలుసుకొంటారు. వృత్తి వ్యాపార, వ్యవహారాలు కలిసివచ్చును. ఆనందమైన జీవనం కాని ఒక్కోసారి విరోధా లేర్పడును. వ్యవహారభంగం చివరకు మీదే విజయం. స్పెక్యులేషన్ బాగుండును.
ఫిబ్రవరి :-ఈ నెలలో చికాకులు కలిగించే సంఘటనలు. ఆరోగ్యం బాగుండును. సమస్యలుతీవ్రమగును. అన్నింటాఅపజయం. ఏమిమాట్లాడినావిరోధమే. చిక్కులు, కుటుంబకలహాలు, భార్యాభర్తలమధ్య అవగాహనఉండదు. గృహంలో శుభమూ లక ధనవ్యయం. ప్రభుత్వమూలక ఇబ్బందులు, స్పెక్యులేషన్లో కూడా నష్టములు.
మార్చి:- గ్రహాల అనుకూల సంచారము వలన చేయు వృత్తివ్యాపారములందు రాణింపు, అన్నింటాజయం, ఆరోగ్యలాభం, ఆదాయంనకు లోటుండదు. అప్రయత్న ధనలాభము. విద్యార్ధులు పరీక్షలు బాగా వ్రాయుదురు. ప్రయాణసౌఖ్యం, భార్యా భర్తల మధ్య అనుకూలత. దైవదర్శనం. స్త్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్ అనుకూలం.
Astrology Consultation
₹1,000.00 – ₹2,500.00
Horoscope Matching for Marriage
₹350.00 – ₹1,000.00