మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి , దీనినే ‘దమన ఏకాదశి’ అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు.
స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం … జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.
కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.
వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం ,విశిష్టతను వివరించాడు .వశిష్ట మహాముని దిలీప్ రాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు.
పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు, నాట్యాలు చేసిన రాజునూ సంతోషపరిచేవారు ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు, తనభార్య లలితతో చాల అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచోనలోపడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే బయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది. అల వింధ్యాచల అడువుల్లో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శ్రింగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి .. తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాదేయపడింది. అప్పుడు శ్రింగి మహర్షి కామాద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు, ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భ ర్తను మీరే ఏ విధంగానైన కాపాడాలి అని మనసులో తలచుకోని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే బయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.