సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం…
కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక. ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి, నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని… గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.
శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిశేకము చేయించి, గారెలతో మాల వేసి… కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్షు పెరుగును.
అంతేకాక ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.
శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి. భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం … తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
కాలభైరవ గాయత్రి …..
ఓం కాల కాలాయ విద్మహే
కాలాతీతాయ ధీమహి
తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥