సూర్య / చంద్ర గ్రహణం పూర్తి అయిన మరసటి రోజున ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానాదులు చేసే నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకుని శిరస్సు నుంచి స్నానం చేయాలి. ఇంట్లోని పూజాగది, దేవుని పటములు & విగ్రహములు శుభ్రపరచుకోవాలి. యజ్ఞ్యోపవీతము (జంధ్యం) కలిగిన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు తప్పక యజ్ఞ్యోపవీతము మార్చుకుని, బ్రాహ్మణులు గాయత్రీ చేయవలెను. యంత్రాలకు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం నివేదించాలి.
గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి, కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి కాబట్టి నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్ళి కొత్త వాటిని పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.